శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By PNR
Last Updated : సోమవారం, 9 మార్చి 2015 (20:38 IST)

క్రికెట్ - సినిమా... అన్నదమ్ములు వంటివి : మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్

క్రికెట్ , సినిమా, రంగాలు రెండు అన్న‌ద‌మ్ముల లాంటివే కానీ అక్క‌డ రీ టేక్‌లుండ‌వు, ఇక్క‌డ ఉంటాయని ప్ర‌ముఖ మాజీ క్రికెట‌ర్ వెంక‌టేష్ ప్ర‌సాద్‌ అంటున్నారు. ఈయనతో తాజాగా నిర్వహించిన ఇంటర్వ్యూ వివరాలను పరిశీలిస్తే... 
 
ప్ర‌శ్న‌. హ‌య్ సార్ ఓ క్రికెట‌ర్‌గా అభిమానుల గుండెల్లో స్టార్‌గా ఎదిగిన మీరు న‌టించిన‌ మెద‌టి చిత్రం స‌చిన్ ఇప్పుడు తెలుగులో విడుద‌ల‌వుతుంది. ఏలా 
ఫీల‌వుతున్నారు? 
 
జ‌. నాకు హైద‌రాబాద్‌తో చాలా అనుబంధం ఉంది. హైద‌రాబాద్ బిర్యాని, ఇరానీ ఛాయ్ అంటే చాలా ఇష్టం. నేను తెలుగు మాట్లాడ‌లేను కానీ తెలుగు అర్థమ‌వుతుంది. నేను, సుహాసిని గారు క‌లిసి న‌టించిన స‌చిన్ అనే చిత్రం క‌న్న‌డ‌ంలో విడుద‌ల‌ైంది. చాలా మంచి విజ‌యం సాధించింది. నాకు చాలా మంచి పేరు 
తెచ్చిపెట్టింది కూడా. అంతేకాదు ఇప్పుడు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో స్క్రీనింగ్ అయ్యింది. తాజాగా తెలుగులో మార్చి 13న విడుద‌ల‌వుతుంది. ఇలా వ‌రుస‌గా బంప‌ర్ ఆఫ‌ర్స్ వ‌స్తుండ‌టంతో ఆనందంగా వుంది. 
 
ప్ర‌శ్న‌. క్రికెట‌ర్‌గా ఈ చిత్రంలో న‌టించేటప్పుడు ఏమ‌న్నా ఇబ్బంది ఫీల‌య్యారా? 
జ‌. లేదు ఎందుకంటే నేను ఇందులో కూడా క్రికేట్ కోచ్‌గా చేశాను. స‌చిన్ అనే పిల్లాడితో పాటు కొంత‌మంది పిల్ల‌ల‌కి క్రికెట్ నేర్పించే కోచ్‌గా న‌టించాను. పెద్ద‌గా ఇబ్బంది ప‌డ‌లేదు అయినా క్రికెట్, సినిమా, రంగాలు రెండు అన్న‌ద‌మ్ముల లాంటివే కాని అక్క‌డ రీ టేక్‌లుండ‌వు.. ఇక్క‌డ వుంటాయి అంతే తేడా. (న‌వ్వుతూ) 
 
ప్ర‌శ్న‌. ఈ ప్ర‌పోజ‌ల్ ఎవ‌రు మీ ద‌గ్గ‌రికి తీసుకువ‌చ్చారు.. మీరు ఈ స్టోరిలో ఏమి న‌చ్చి న‌టించారు.? 
జ‌. ఈ స్టోరి చెప్పింది మాత్రం డైర‌క్ట‌ర్ గారు. అయితే ఈ స్టోరీ విన‌మ‌ని చెప్పింది మాత్రం సుహాసిని గారు. ఈ క‌థ వినండి ఈ పాత్ర‌కి మీరైతే బాగుంటుదని 
అనుకుంటున్నాము. విని చెప్పండి అని అన్నారు. మోయిన్‌గా ఈ క‌థ‌లో మాన‌వ‌త్వం ఉంది. మాన‌సిక‌ పరిస్థితి స‌రిగ్గాలేని ఓ కుర్రాడి చివ‌రి కోరిక క్రికెట్ 
ఆడాల‌ని. అయితే ఆ కుర్రాడి కోరిక తీర్చ‌టం కోసం అంద‌రూ ఏవిధంగా మాన‌వత్వంతో ఎలా స‌హ‌యం చేశార‌నేది చిత్ర క‌థ‌లోని ముఖ్యాంశం. ఇదే ఈ చిత్రంలో 
న‌టించ‌టానికి నాకు ఓ కార‌ణ‌మైంది. ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థాంశం నన్ను ఆక‌ట్టుకుంది. 
 
ప్ర‌శ్న‌. సీనియ‌ర్ న‌టి సుహాసిని గారితో న‌టించ‌టం ఏలా ఫీల‌వుతున్నారు.? 
జ‌. అస‌లే న‌టించండం కొత్త‌, దానికి తోడు మ‌హానటి సుహాసిని గారితో కాంబినేష‌న్ ఇంక నా పరిస్థితి ఎలా వుంటుదో ఆలోచించండి. టోట‌ల్ బాడి షేకింగ్‌. కానీ 
సుహాసిని గారు మాత్రం నాకు ఎలా నిల‌బ‌డాలో, ఎలా డైలాగ్ చెప్పాలో, ఎలా న‌టించాలో చ‌క్క‌గా టీచ‌ర్‌లా చెప్పి చేయించారు. త‌ను కాకుండా ఎవ‌రైనా అయితే 
నేను న‌టించేవాడ్ని కాదు. ఈ సినిమాలో నాకంటే సుహాసిని గారి పాత్ర అంటేనే ఇష్టం నాకు. థ్యాంక్స్ టు సుహాసిని గారు.. 
 
ప్ర‌శ్న‌. ఇక ముందు సినిమాల్లో న‌టిస్తారా? 
జ‌. చ‌క్క‌టి క‌థ అంటే సోష‌ల్ ఏవేర్‌నెస్ ఉన్న స‌బ్జెక్ట్‌లు వ‌స్తే త‌ప్ప‌కుండా చేస్తాను. స‌చిన్ లాంటి క‌థ‌ల‌తో వ‌స్తే మారు మాట్లాడ‌కుండా న‌టిస్తాను. 
 
ప్ర‌శ్న‌. ఒక ప‌క్క మ‌న టీం ఇండియా వాళ్ళు దూసుకెళుతున్నారు. క‌ప్ మ‌న‌దేనంటూ అభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్నారు మీరేమంటారు? 
జ‌. టీం ఇండియాలో అంద‌రూ యూత్ బాగా ఉన్నారు. మ‌నం ఊహించిన దానికంటే బెట‌ర్‌గా ఆడుతున్నారు. ఇదే జోరుతో వెలితే త‌ప్ప‌కుండా క‌ప్పు మ‌న‌దే.. 
 
ప్ర‌శ్న‌. మ‌న ఇండియా టీంకి మీరేమైనా స‌ల‌హ‌లు ఇస్తుంటారా.? 
జ‌. త‌ప్ప‌కుండా ఇస్తాను. సీనియ‌ర్ ఆట‌గాళ్ళ నుంచి కుర్ర ఆట‌గాళ్ళు త‌ప్ప‌కుండా స‌ల‌హాలు తీసుకోవాలి. కుర్రాళ్ళ టాలెంట్‌కి మాలాంటి వాళ్ళ అనుభ‌వం 
తోడ‌వ్వుతుంది. 
 
ప్ర‌శ్న‌. స‌చిన్ అనే టైటిల్ పెట్టి సినిమా చెయ్య‌మంటే మీరు ఇబ్బందిగా ఫీల‌వ్వ‌లేదా.? 
జ‌. ఎందుకు ఇబ్బంది ఫీలవ్వాలి. ఇండియా క్రికెట్ అంటే మ‌న‌కి మందు గుర్తోచ్చేది స‌చిన్ పేరు మాత్ర‌మే. స‌చిన్ పేరుతో చేస్తున్న చిత్రంలో న‌టించ‌టం గ‌ర్వంగా 
ఫీల‌వుతున్నా.