శ్రీకాంత్ ఈ కథ చెబుతున్నపుడు ఇంతవరకూ రవితేజ గారు ఇలాంటి సినిమా చేయలేదు. ఈ సినిమా చూసిన తర్వాత రవితేజ గారు ఇలా కూడా చేయగలుగుతారా ? అని ప్రేక్షకులు షాక్ అవుతారు. కొత్త కాన్సెప్ట్ . ఇది వర్క్ అవుట్ అయితే హీరోలు ఇలాంటి మరిన్ని కథలు ప్రయత్నిస్తారు అని రావణాసుర నిర్మాత అభిషేక్ నామా అన్నారు.
సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మించారు. హీరో సుశాంత్ కీలక పాత్ర పోషించారు. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా సినిమా రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో నిర్మాత అభిషేక్ నామా రావణాసుర విశేషాలని విలేకరులు సమావేశంలో పంచుకున్నారు.
రావణాసురకి కర్త కర్మ క్రియ మీరే అని అందరూ చెబుతున్నారు ?
అంతా హీరో రవితేజ గారిది. ఆయనే కథని ఫైనల్ చేసి నన్ను పిలిచి సినిమా చేయమని చెప్పారు. రవితేజ గారు కూడా ఇందులో ఒక నిర్మాత.
ఒకప్పుడు చిన్న సినిమాలు సొంతగా రిలీజ్ చేసుకునేవారు. ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా సొంతగా విడుదల చేసుకునే పరిస్థితి రావడానికి కారణం ?
అది నిర్మాత బట్టి ఆధారపడి వుంటుంది. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా మనమే సొంతగా విడుదల చేస్తామని ముందే అనుకున్నాం. లాభమైన నష్టమైన మనం బలంగా నమ్మిన కంటెంట్ ని మనమే విడుదల చేద్దామని భావించాం.
మరి ఇందులో రిస్క్ ఉంటుందా ?
ఒక కథ నచ్చి, దానిపై నమ్మకంతోనే డబ్బుపెట్టాం. నమ్మకం వున్నపుడు వేరే వాళ్ళకి ఇవ్వడం ఎందుకు ? మేము నమ్మిన సినిమా మేమే విడుదల చేస్తున్నాం. కథ విన్నప్పడు నుంచే రావణాసుర పై నమ్మకంగా వున్నాం.
ఇప్పటి వరకూ రావణాసుర కథ గురించి టీం లో ఎవరూ లీడ్ ఇవ్వలేదు. మీరు ఏం చెబుతారు ?
థ్రిల్లర్ జోనర్స్ చూసినప్పుడు షాకింగ్.. వావ్.. ఫ్యాక్టర్స్ వుంటాయి. అవి ముందే ఆడియన్స్ కి తెలిసిపోయినపుడు ఆ కిక్కు రాదు. అందుకే కథ గురించి బయటికి చెప్పలేదు.
భారీ తారాగణం కనిపిస్తోంది.. మీరు అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేశారా ?
అనుకున్న బడ్జెట్ లోనే పూర్తి చేశాం. సుధీర్ వర్మ టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్. అనుకున్న సమయంలో అనుకున్న బడ్జెట్ కి పూర్తి చేశారు.
రవితేజ గారికి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ?
ప్రేక్షకులు థ్రిల్ అయిపోయి షాక్ లో వుంటారు. రవితేజ గారిని ఇంత కొత్త కోణంలో చూసే సరికి అదిరిపోయింది కదా అనే ఫ్యాక్టర్ వస్తుంది. ఇంటర్వెల్ ఎక్స్ టార్డినరీగా వుంటుంది. ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.
సుశాంత్ పాత్ర గురించి ?
ఒక ఇన్నోసెంట్ ఫేస్ తో ఫ్రెష్ గా ఉండాలని సుశాంత్ ని అనుకున్నాం. ఇందులో సుశాంత్ ని చాలా కొత్తగా చూస్తారు.
ఈ సినిమా టైటిల్, డిజైన్స్ మీవే అని రవితేజ గారు చెప్పారు ?
నేను ఫైన్ ఆర్ట్స్ నేపధ్యం నుంచి వచ్చాను. మంచి సినిమాలు చేయాలనే ఆసక్తి వుంటుంది. కాన్సెప్ట్ సినిమాలు చేయడం ఇష్టం.
అభిషేక్ పిక్చర్స్ సినిమాలు పాన్ ఇండియా రిలీజ్ అవుతుంటాయి కదా.. రావణాసుర ఎందుకు చేయలేదు ?
ఇక్కడ విడుదలైన తర్వాత ఇదే సబ్జెక్ట్ తో పాన్ ఇండియా ప్లాన్ చేయాలనే ఆలోచన వుంది.
రావణాసుర మ్యూజిక్ హిట్ అయ్యింది.. హర్షవర్ధన్ రామేశ్వర్ ని తీసుకోవడానికి కారణం?
హర్షవర్ధన్ రామేశ్వర్ కుటుంబం అంతా సంగీతకారులు. తనకి చాలా ప్రతిభ వుంది. మొదట సాక్ష్యం సినిమా ఇచ్చాను. తర్వాత రవితేజ గారికి చెప్పాను. రావణాసురతో తన ప్రతిభని మరోసారి నిరూపించుకున్నాడు.
రవితేజ గారు 100కోట్ల మార్క్ ని అందుకున్న తర్వాత వస్తున్న రావణాసుర పై మీకు ఎలాంటి అంచనాలు వున్నాయి ?
రవితేజ గారు ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించారు. నేనేం ఫీలౌతానంటే.. ఒక ఆర్టిస్ట్ కొత్తగా చేసిన పాత్రని ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తే..దానికి మించిన సక్సెస్ ఏమీ వుండదు. కాంతార లాంటి సినిమా చూసినపుడు మనం వావ్ అంటాం. అయితే ఇక్కడ చేయాలంటే మాత్రం వర్క్ అవుట్ అవుతుందా లేదా అని ఆలోచిస్తాం. కానీ రావణాసురతో రవితేజ అవన్నీ బ్రేక్ చేసేశారు.
రావణాసుర రచయిత శ్రీకాంత్ విస్సా ని దర్శకుడుగా లాంచ్ చేసే అవకాశం ఉందా ?
దర్శకుడిగా నా బ్యానర్ లోనే మొదటి సినిమా చేయాలని చెప్పాను. చేస్తానని కూడా అన్నారు.
ప్రేమ విమానం సినిమా ఎంత వరకూ వచ్చింది ?
పూర్తయింది. నెక్స్ట్ మంత్ విడుదల చేస్తున్నాం
డెవిల్ ఎప్పుడు ?
డెవిల్ క్లైమాక్స్ నడుస్తుంది. రెండు మూడు నెలల్లో ఏదైనా మంచి డేట్ చూసి విడుదల చేస్తాం. డెవిల్ 2 కూడా వుంది.
కొత్త ప్రాజెక్ట్స్ గురించి ?
2024లో దాదాపుగా ఏడు సినిమాలు లాంచ్ చేస్తాం.