శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: సోమవారం, 16 జనవరి 2017 (23:10 IST)

నాకింకా సరైనోడు దొరకలేదు : కాజల్‌ ఇంటర్వ్యూ

నటి కాజల్‌ అగర్వాల్‌... పెళ్లికి వయస్సుతో సంబంధం లేదనీ తన సోదరికి ముందుగా వివాహ అయినా తనకు వయస్సు మీదపడుతున్నా అవేమీ పెద్దగా ఆలోచిచండం లేదనీ సినీ కెరీర్‌పై దృష్టిపెడుతున్నానని అంటూ.. ఇంకా తన మనసుదోచిన వ్యక్తి కనబడలేదని స్పష్టం చేసింది. చిరంజీవితో 'ఖై

నటి కాజల్‌ అగర్వాల్‌... పెళ్లికి వయస్సుతో సంబంధం లేదనీ తన సోదరికి ముందుగా వివాహ అయినా తనకు వయస్సు మీదపడుతున్నా అవేమీ పెద్దగా ఆలోచిచండం లేదనీ సినీ కెరీర్‌పై దృష్టిపెడుతున్నానని అంటూ.. ఇంకా తన మనసుదోచిన వ్యక్తి కనబడలేదని స్పష్టం చేసింది. చిరంజీవితో 'ఖైదీనెం.150' సినిమాలో ఆమె నటించింది. ఈ సందర్భంగా సోమవారంనాడు ఆమె పలు విషయాలను తెలియజేసింది.
 
చరణ్‌తో నటించి చిరంజీవిగారితో నటించడం ఎలా అనిపించింది?
పదేళ్ళ కెరీర్‌లో ఇటువంటి రోజువస్తుందనుకోలేదు. చిరంజీవి వంటి గొప్ప నటుడితో నటించడం వరంగా భావిస్తున్నా. చరణ్‌ నాతోటి వయస్సువాడు. చిరంజీవిగారు పెద్ద అయినా.. ఆయన చరణ్‌ కంటే చాలా యంగ్‌గా కన్పించారు. సెట్లో చాలా సరదాగా వుంటారు. వృత్తిపరంగా ఖచ్చితమైన నిబద్ధతో వ్యవహరిస్తారు.
 
డాన్స్‌ చేసినప్పుడు ఎదైనా రిస్క్‌ ఫీలయ్యారా?
చిరంజీవి అంటేనే మంచి డాన్సర్‌ అనే పేరుంది. ఆయన డాన్స్‌ చేసినప్పుడు కొన్ని టిప్స్‌ చెప్పారు. కాలు ఇలా పెట్టి చేయాలి. అలా పెట్టి చేయాలి.. అని కొన్ని సూచనలు చాలావరకు వుపయోగపడ్డాయి. చాలా సింపుల్‌గా ఆయన డాన్స్‌ చేసేశారు. 
 
సినిమాను చూసినప్పుడు ఎలాంటి అనుభూతి పొందారు?
ప్రయాణాల్లో బిజీగా వుండడం వల్ల సినిమాను ప్రేక్షకుల మధ్య చూడలేకపోయా. చూసినవారంతా చాలా బాగుందని అన్నారు. త్వరలో థియేటర్‌లో చూస్తా.
 
మిగిలిన పెద్ద హీరోలతో నటిస్తారా?
కొన్ని పాత్రలు బాగుందని చేస్తాం. కొన్ని చిరంజీవి వంటివారు వున్నారని చేస్తాం. అలాంటి చిత్రమే ఇది. నా మేనేజర్‌ను డేట్స్‌ అడిగినప్పుడు వీలు చూసుకుని చిరంజీవి సినిమా అని అంగీకరించా. మిగిలిన హీరోలు నన్ను సంప్రదించలేదు. ఒకవేళ వస్తే అప్పుడు ఆలోచిస్తాను.
 
పదేళ్ళ కెరీర్‌ విశ్లేషించుకుంటే ఎలా వుంది?
ఈ ఏడాది పదేళ్ళ కెరీర్‌కు చేరుకున్నాను. మొదట్లో ఏవో సినిమాలు చేసి చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళి అక్కడే ఏదో ఉద్యోగం చేసుకోవాలనుకున్నాను. కానీ రానురాను అవకాశాలు, పేరు రావడంతో.. ఇక్కడే స్థిరపడిపోయా.
 
కొత్త చిత్రాలు?
తేజ దర్శకత్వంలో రానా హీరోగా ఓ సినిమాలో నటిస్తున్నా. తమిళంలో అజిత్‌, విజయ్‌ల కాంబినేషన్‌లో రెండు చిత్రాల్లో నటిస్తున్నా.
 
తెలుగు చిత్రాలను తగ్గించారే?
అలాంటిది ఏమీలేదు. తెలుగు చిత్రాలకు దూరంకాలేదు. గత ఏడాది జనతాగ్యారేజ్‌తో పాటు హిందీ, తమిళ చిత్రాలు కలిపి మూడు చిత్రాల్లో నటించా. ఈ ఏడాది కూడా మరో సినిమాలో నటించనున్నాను.
 
మరి ఐటంసాగ్స్‌లో మరలా నటిస్తారా?
ఐటం సాంగ్స్‌ అనేవి ప్లాన్‌ చేసుకోని చేయలేదు. ఖచ్చితంగా మంచి సినిమా పెద్ద స్టార్‌ వుంటే చేస్తాను. ఐటంసాంగ్స్‌ చేయడం తప్పు కాదని నా అభిప్రాయం అని చెప్పారు.