మంగళవారం, 19 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: సోమవారం, 9 జనవరి 2017 (18:58 IST)

నా ట్రైనర్ రామ్ చరణ్... చిరంజీవి ఇంటర్వ్యూ మొదటి భాగం

జనవరి 11న ఖైదీ నెంబర్ 150 విడుదల సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితో ముఖాముఖి. విశేషాలు... 'పసివాడిప్రాణం' తిరుపతిలో 'యముడికి మొగుడు' గుంటూరులో మొన్న ఖైదీనెం.150 చిత్రం ప్రి-రిలీజ్‌ఫంక్షన్‌ విజయవాడ - గుంటూరు మధ్యలో జరిగాయి. వీటన్నింటిలో ఎటువంటి తేడాలు గ

జనవరి 11న ఖైదీ నెంబర్ 150 విడుదల సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితో ముఖాముఖి. విశేషాలు...
 
'పసివాడిప్రాణం' తిరుపతిలో 'యముడికి మొగుడు' గుంటూరులో మొన్న ఖైదీనెం.150 చిత్రం ప్రి-రిలీజ్‌ఫంక్షన్‌ విజయవాడ - గుంటూరు మధ్యలో జరిగాయి. వీటన్నింటిలో ఎటువంటి తేడాలు గమనించారు?
 
నేను గమనించింది ఏమంటే... అభిమానుల ఉధృతి రోజురోజుకూ పెరుగుతుంది. అప్పట్లో ఫంక్షన్‌ అంటే వేలల్లో వచ్చేవారు. ఇప్పుడు లక్షల్లో వస్తున్నారు. పోలీసుల రిపోర్ట్‌ ప్రకారం 2.2లక్షల మంది వచ్చారని తెలిసింది. ఇంకా బయట చాలామంది లోపలికి రాలేకపోయినవారున్నారని చెప్పారు.
 
9 ఏళ్ళుగా నటించ లేదనే బాధపడ్డారా?
ఏయే సమయాల్లో ఎలా వుండాలనే బాధ్యతను నిర్దేశించాయి పరిస్థితులు. ఒకసారి నటుడిగా, మరోసారి రాజకీయనాయకుడిగా, ఇంకోసారి సామాజిక కార్యకర్తగా.. ఇలా ఎప్పుడు ఏమి చేయాలనేది సమయాన్ని బట్టి వుంటుంది.
 
నాగేశ్వరరావుగారితో నటించిన శ్రీదేవి నాగార్జునతో నటించింది. చరణ్‌తో నటించిన కాజల్‌ మీతో నటించింది. మీకెలా అనిపించింది?
మొన్న ఫంక్షన్‌లో కూడా చెప్పాను. కొడుకుతో సక్సెస్‌ అయ్యాక తండ్రితో నటించడం ఎక్కడో కానీ జరగదు. ముందుగా స్టిల్స్‌ వచ్చేక అందరినీ ఆకట్టుకుంటుంది. అక్కడే నెగ్గేశాం.
 
రీమేక్‌తోనే ఎంట్రీ ఇవ్వాలనుకున్నారా?
ఏడాదిపాటు ఎన్నో కథలు విన్నాను. స్ట్రెయిట్‌ కథల్లో చక్కటి సందేశం, సామాజిక అంశం వుండాలని చూశాను. ఏవీ తృప్తికరంగా అనిపించలేదు. 150వ సినిమా అంటే అంచనాలు ఎక్కువగా వుంటాయి. ధీటైన కథతో రావాలి. అందుకే వచ్చిన కథల్ని ఖరారు చేయలేకపోయాం. బాధ్యతాయిత స్థితి నుంచి సినిమాలకు వచ్చినప్పుడు ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేవిధంగా వుండాలి. అది బాధ్యత, ధర్మంగా భావించాను. కమర్షియల్‌గా 60 శాతం వున్నా.. మిగిలినది ప్రజలకోసం వుండాలి. ఇలా ఆలోచిస్తుండగానే సమయం మించిపోతుంది. అలాంటి టైమ్‌లో 'కత్తి' సినిమా చూశాను. అందులో సామాజిక సందేశంతో పాటు అన్ని అంశాలున్నాయి. వెంటనే మొదలుపెట్టాం.
 
నటించాలనుకున్నప్పుడు మీ భావన ఎలా వుంది?
రాజకీయంగా స్తబ్దతలో వున్న నాకు సినీ పరిశ్రమ ఆహ్వానం పలికింది. నటించమని సీనియర్‌ ఆర్టిస్టులు అమితాబ్‌, రజనీకాంత్‌తోపాటు నా అభిమానులు కూడా అదేపనిగా కోరడంతోపాటు నన్ను నేను తెరపై ఎలా చూపించుకోవాలనేది కొంచెం సంశయమం మాత్రం వుంది. లోపల ఎలా వున్నా.. చుట్టూ ప్రోత్సాహం కల్గించే వాతావరణం వుండటంతో.. యస్‌.. నేను తప్పక చేయగలననే నమ్మకం పెరిగింది.  ఈరోజు లుక్‌లో బాగున్నాడు.. అనే ముద్ర పడడానికి కారణం అదే. 2007లో 'శంకర్‌ దాదా జిందాబాద్‌' చేసినప్పటికీ ఇప్పటికీ తేడా లేదు. మళ్ళీ కెమెరా ముందుకు రావడంతో లైట్లు, యాక్షన్‌, ఫైట్లు.. డాన్స్‌ .. చూశాక. ఇదేగా మన గతం అనిపించింది.
 
వెండితెరపై చూసుకుంటే ఎలా అనిపిస్తుంది?
కథ కాన్‌ఫిడెన్స్‌గా వుంది కాబట్టి.. సంతృఫ్తికరంగా వుంది. సంగీతం కూడా తోడయి.. హిట్‌ అయిందని యూబ్యూట్‌లో 6,10 మిలియన్స్‌ వస్తున్నాయనంటే ఆ సపోర్ట్‌ కూడా సినిమాకుందనే భరోసా వచ్చేసింది. ఎన్ని వున్నా..  150 సినిమా చేశాను. కాంపిటేషన్‌ వుంది. దాంతో చిన్న ఒత్తిడి కూడా వుంటుంది. ఇలాంటివి ఎవ్వరూ ఎవాయిడ్‌ చేయలేరు.
 
'కత్తి'కి దీనికి ఏవైనా మార్పులు చేశారా?
అందులో ఒకటి, రెండు ఎపిసోడ్స్‌ తీసి మన కల్చర్‌కు అనుకూలంగా మార్చుకున్నాం. సందర్భానుసారంగా పాటలు పెట్టాం. అందులో కామెడీ ట్రాక్‌ లేదు. ఇందులో బ్రహ్మానందం, రఘుబాబు ద్వారా క్రియేట్‌ చేశాం. అందులో కథలో కాస్త మొనాటినీ అనిపించిన చోట్ల కమర్షియల్‌వైపు వెళ్ళాం. సంభాషణలు దానికి తీనికి చాలా తేడా వుంది. ట్రీట్‌మెంట్‌ కూడా ఫాస్ట్‌గా వుంటుంది.
 
మీ బాడీ లాంగ్వేజ్‌కు గైడ్‌ ఎవరు?
నా ట్రైనర్‌ రామ్‌చరణ్‌.. ఆహారపు అలవాట్లు ఎలా వుండాలి. రోజులో ఎంత తినాలి. ఎంత మేర జిమ్‌ చేయాలి అనేది అంతా చరణ్‌ చూసుకునేవాడు. తను నిర్మాత కాబట్టి హీరో బాగా కన్పించాలనే ప్రయత్నించాడు. అసలు ఇవన్నీ కాకపోయినా.. ముందు మనస్సు ప్రశాంతంగా వుంచుకుంటేనే ముఖంలో కనబడుతుంది. ఎటువంటి హెచ్చుతగ్గులు లేకుండా ఎటువంటి ఎమోషన్స్‌కు రియాక్ట్‌ కాకుండా అసలు నా దృష్టికి రాకుండా తనే అన్నీ చూసుకునేవాడు. నేను మెడిటేషన్‌ అప్పుడప్పుడు చేస్తాను. అంతకుముందు రాజకీయాల్లో తిరుగుతూ సరైన వేళలో ఆహారం తినక.. వ్యాయాయం చేయలేకపోయేవాడ్ని.