శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Updated : సోమవారం, 21 నవంబరు 2016 (09:15 IST)

అల్లు అర్జున్‌తో నటించాలనుంది.. వెల్ కమ్ టు టాలీవుడ్ అన్నారు: నందితా శ్వేత ఇంటర్వ్యూ

తమిళంలో 'అట్టకత్తి', 'ముండాసిపట్టి', 'ఎదిర్‌ నీచ్చల్‌' చిత్రాల్లో నటించిన ఈమె తొలిసారిగా తెలుగులో 'ఎక్కడికిపోతావు చిన్నవాడా' చిత్రంలో నిఖిల్‌ సరసన నటించిన నందితా శ్వేతను ముందుగా మూడు చిత్రాల్లో ఆమెను

తమిళంలో 'అట్టకత్తి', 'ముండాసిపట్టి', 'ఎదిర్‌ నీచ్చల్‌' చిత్రాల్లో నటించిన ఈమె తొలిసారిగా తెలుగులో 'ఎక్కడికిపోతావు చిన్నవాడా' చిత్రంలో నిఖిల్‌ సరసన నటించిన నందితా శ్వేతను ముందుగా మూడు చిత్రాల్లో ఆమెను తిరస్కరించారు. కారణాలేమైనా.. అది మంచికే జరిగిందని చెబుతున్న ఆమె ఆదివారంనాడు హైదరాబాద్‌ వచ్చారు. ఈ సందర్భంగా ఆమెతో చిట్‌చాట్‌. 
 
ప్రశ్న: హారర్‌ చిత్రాలంటే ఇష్టమా? 
జ : అర్థరాత్రి 12 గంటలకు లైట్లన్నీ ఆర్పేసి, చీకటిలో చాలా హారర్‌ సినిమాలు చూసేదాన్ని. చాలా ఎంజాయ్‌ చేస్తాను. తమిళంలోనూ నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. కాకపోతే హారర్‌ చిత్రాలని అనగానే హెవీ మేకప్‌ వేసుకోమని అంటారు. అలాంటివి నాకు ఇష్టం లేదు. కానీ 'ఎక్కడికిపోతావు చిన్నవాడా' అందుకు భిన్నంగా ఉంది. అందువల్ల వెంటనే ఒప్పకుని చేశా. 
 
ప్రశ్న: దెయ్యాన్ని చూశారని నిఖిల్‌ చెప్పాడు? 
జ : గోకర్ణ, ధర్మస్థలకి వెళ్తున్నప్పుడు ఓ దెయ్యాన్ని చూశా. ఆ విషయాన్నే నిఖిల్‌తో చెప్పాను. జోక్‌గా తీసుకున్నాడు. దేవుడున్నానని నమ్ముతాను. అందువల్ల దెయ్యాలున్నాయని కూడా నమ్ముతాను. మంచి వెనకాలే చెడు కూడా ఉంటుందని నమ్ముతా. 
 
ప్రశ్న: మరో దెయ్యం పాత్రలో నటిస్తున్నారా? 
జ : తమిళంలో సెల్వరాఘవన్‌ సినిమాలోనూ దెయ్యంగానే చేస్తున్నా. కానీ అది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నందిత ఓ సినిమాను ఒప్పకుంటే ఎలా ఉంటుందో ఈ సినిమాను చూసి తెలుసుకోవచ్చు. 
 
ప్రశ్న: అల్లు అర్జున్‌ మెచ్చుకున్నారే? 
జ : అవును. అల్లు అర్జున్‌ నాకు ఫోన్‌ చేసి చెప్పినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. తనతో పనిచేయాలని ఉందని చెప్పాను. వెల్కమ్‌ టు టాలీవుడ్‌ అని అన్నారు. 
 
ప్రశ్న: భిన్నమైన పాత్ర చేశారే? 
జ : మొదటి నుంచి నాకు భిన్నంగా వుండడమంటే ఇష్టం. స్కూల్‌ డేస్‌లో కూడా ఇంట్లో కూర్చుని నాలుగు రోజులు చదివి రాసి అన్నీ పేపర్లు పాస్‌ అయ్యేదాన్ని. 'ఎదిర్‌ నీచ్చల్‌' అనే సినిమాలో కూడా నేను చాలెంజింగ్‌ పాత్ర చేశాను. 
 
ప్రశ్న: మిమ్మల్ని జ్యోతికతో పోలుస్తారు. ఎలా అనిపిస్తుంది? 
జ : జ్యోతిక తర్వాత అలాంటి పాత్రలో మీరు చేశారని అందరూ అంటున్నారు. ఆమెను ఎవరూ రీప్లేస్‌ చేయలేరు. కానీ అందరూ అలా చెప్తుంటే నాకు ఆనందంతో ఏడుపొచ్చేసింది. 
 
ప్రశ్న: కథా ఎంపికలో జాగ్రత్తలు ఎలా తీసుకుంటారు? 
జ : నటిగా సరైన స్క్రిప్ట్‌ వస్తే తప్పకుండా చేస్తా. స్క్రిప్ట్‌లో గ్లామర్‌ కావాల్సి ఉంటే చేయడానికి నాకేం ఇబ్బంది లేదు. నా పాత్రకు ప్రాముఖ్యత ఉంటే చాలు. 
 
ప్రశ్న: ఈ పాత్రకు ప్రేరణ ఎవరు? 
జ : మామూలు విషయాలకు స్పూర్తి ఉంటుంది. కానీ దెయ్యాల విషయంలో ఎవరిని స్ఫూర్తిగా తీసుకోవాలి? కెమెరా ముందు ఏం చేస్తామో అదే. అంతే తప్ప ఇంకేమీ లేదు. 
 
ప్రశ్న: కొందరు మిమ్మల్ని వద్దనుకున్నారు. ఇప్పుడు ఎలా అనిపించింది? 
జ : తమిళంలో సక్సెస్‌ వున్నా.. తెలుగులో రావడానికి నాలుగేళ్లు పట్టిందా? అని చాలామంది అడిగారు. కానీ కొన్ని సినిమాలను నేను వద్దనుకున్నాను. కొందరు నన్ను వద్దన్నారు. ఎట్టకేలకు ఈ కథను ఓకే చేసి చేశాను. హిట్‌ అయింది. లక్కీ గర్ల్‌ అనే పేరు వచ్చింది. తొలి సినిమాకే లక్కీ గర్ల్‌గా పేరు తెచ్చుకోవడం మామూలు విషయం కాదు. అందుకు చాలా ఆనందంగా ఉంది. కొంతమంది నన్ను వద్దనుకున్నారు. అలా కొన్ని సినిమాలు చేజారిపోయాయి. కాకపోతే అది చాలా మంది హీరోయిన్ల విషయంలో జరిగేదే. కొన్ని సార్లు వాళ్ల ప్రాజెక్ట్‌లో పాత్రలు ఒక రకంగా ఉండేవి, నేను ఇంకో రకంగా వుండాలనేదాన్ని. ఇలాంటివి చాలా జరిగాయి. ఈ సినిమా చూసి ఓ దర్శకుడు ఫోన్‌ చేసి 'నువ్వు ఇంతగా నటిస్తావని అనుకోలేదు. కానీ నా సినిమాలో నిన్ను మిస్‌ అయ్యాను' అని అన్నారు. అంటే నేను సక్సెస్‌ అయినట్టేగా. 
 
ప్రశ్న: కొత్త చిత్రాలు? 
జ : తమిళంలో నటించిన 'నెంజం మరుప్పదిల్లై' విడుదలకు సిద్ధంగా ఉంది. మొత్తం తమిళంలో నాలుగు సినిమాలున్నాయి. తెలుగులో మంచి పెద్ద సినిమానే చేస్తా.