శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (16:25 IST)

ముద్దు సాంగ్‌ నాకు చాలా ఇష్టం: నిర్మలా కాన్వెంట్ ఫేమ్ శ్రియా శర్మ ఇంటర్వ్యూ

మూడేళ్ళకే బాలనటిగా సినిమా పరిశ్రమకు వచ్చిన శ్రియా శర్మ.. తెలుగులో జై చిరంజీవలోనూ చిరంజీవితోనూ, ఆ తర్వాత రజనీకాంత్‌తోనూ నటించిన ఘనత దక్కించుకుంది. నాయికగా 2014లో 'గాయకుడు'తో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు లేకపోవడంతో... టీవీ షోలు చేసింది

మూడేళ్ళకే బాలనటిగా సినిమా పరిశ్రమకు వచ్చిన శ్రియా శర్మ.. తెలుగులో జై చిరంజీవలోనూ చిరంజీవితోనూ, ఆ తర్వాత రజనీకాంత్‌తోనూ నటించిన ఘనత దక్కించుకుంది. నాయికగా 2014లో 'గాయకుడు'తో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు లేకపోవడంతో... టీవీ షోలు చేసింది. తాజాగా మరలా రెండేళ్ళకు తెలుగులో శ్రీకాంత్‌ కుమారుడు రోషన్‌తో కలిసి 'నిర్మలా కాన్వెంట్‌'లో జోడీగా నటించింది. ఇందులో నాగార్జునతో కలిసి నటించే సన్నివేశాలు థ్రిల్‌కు గురిచేశాయని చెబుతోంది. ఈ నెల 16న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమెతో చిట్‌చాట్‌.
 
మీ నేపథ్యం?
హిమాచల్‌ ప్రదేశ్‌లోని నూర్‌పూర్‌. నాన్న వికాశ్‌ శర్మ ఇంజనీర్‌, అమ్మ రీతూ శర్మ డైటిషియన్‌. చిన్నప్పట్నుంచి పలు యాడ్స్‌, సీరియల్స్‌లో నటించడంతో నటన అంటే ఆసక్తి పెరిగింది.
 
తెలుగులో ఏ సినిమాతో ప్రవేశించారు?
'గాయకుడు' సినిమాతో హీరోయిన్‌గా వచ్చాను. అంతకంటే ముందు చిరంజీవిగారు, రజీనీకాంత్‌, షారూక్‌ ఖాన్‌ వంటి సూపర్‌స్టార్స్‌తో నటించే అవకాశం వచ్చింది.  'నిర్మలా కాన్వెంట్‌' చిత్రంలో నాగార్జున గారితో కొత్తకొత్త భాష.. సాంగ్‌లో యాక్ట్‌ చేశాను. అంత పెద్ద నటుడితో యాక్ట్‌ చేయడం హ్యాపీగా అనిపించింది. చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను.
 
ఇందులో మీ పాత్రేమిటి?
ప్రేమ కథలో కొత్తగా వుంటుంది. ఫ్రెష్‌, ప్యూర్‌ అండ్‌ ఇన్‌స్పైరింగ్‌ లవ్‌స్టోరీ. ఈ చిత్రంలో శాంతి అనే అమ్మాయి పాత్రలో కనపడతాను. చాలా కోపం. అసూయ ఉండే అమ్మాయిగా నటించా. ఈ సినిమా చూసేటప్పుడు అమ్మాయిలు నా పాత్రతో బాగా కనెక్ట్‌ అవుతారు.
 
కొత్త హీరోతో నటించడం ఎలా అనిపించింది? 
రోషన్‌కు ఇదే తొలి సినిమా, అయినా విశ్వాసంతో నటించాడు. ఎక్కడా తత్తరపాటుపడలేదు. సీన్స్‌ ఎలా చేయాలనేది ఇద్దరం డిస్కస్‌ చేసి చేశాం.
 
దర్శకుడి పని విధానం ఎలా వుంది
దర్శకుడు జి.నాగకోటేశ్వర రావు చక్కగా తెరకెక్కించారు. ప్రతి సీన్‌ చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. సినిమా ఇంత బాగా వచ్చిందంటే ఆయనే కారణం. ప్రతి విషయంలో ఎంతో కేర్‌ తీసుకోవడమే కాకుండా మంచి అవుట్‌పుట్‌ రావడానికి ఎంతగానో శ్రమించారు.
 
సంగీతపరంగా మీకు నచ్చిన పాటలున్నాయా?
రోషన్‌ సాలూరి దర్శకత్వంలో వచ్చిన ఆడియో ఆల్రెడి చాలా పెద్ద హిట్‌ అయ్యింది. తన వల్లనే నాగార్జునగారు పాట పాడారు. ఆ పాట సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ట్యూన్స్‌తో పాటు మంచి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా అందించారు. ఈ ఆల్బమ్‌లో ముద్దు సాంగ్‌ నాకు బాగా ఇష్టమైన సాంగ్‌. ఆ సాంగ్‌లో లిరిక్స్‌ కానీ, పిక్చరైజేషన్‌ కానీ చాలా బావుంటాయి.
 
మళ్ళీ తెలుగులో నటిస్తారా?
'నిర్మలా కాన్వెంట్‌' కోసం వెయిట్‌ చేస్తున్నాను. ఈ సినిమా తర్వాతే తెలుగులో నెక్ట్స్‌ మూవీ గురించి ఆలోచిస్తాను. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. త్వరలో హిందీలో ఓ సినిమా చేయబోతున్నానని చెప్పారు.