మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది... 'కంచె' హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఇంటర్వ్యూ

pragya jaiswal
DV| Last Modified బుధవారం, 21 అక్టోబరు 2015 (20:38 IST)
వరుణ్‌ తేజ్‌, ప్రగ్యా జైస్వాల్ జంటగా నటించిన 'కంచె' చిత్రాన్ని రాజీవ్‌ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి సంయుక్తంగా ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్టైన్మెంట్‌ బ్యానర్‌‌పై నిర్మించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని గురువారం విడుదలవుతుంది. ఈ సందర్భంగా నాయిక ప్రగ్యా జైస్వాల్‌తో చిట్‌చాట్‌..
 
కంచెలో మీ పాత్ర ఎలా వుంటుంది?
రాచకొండ సీతాదేవి పాత్రలో కనిపిస్తాను. సంపన్న కుటుంబానికి చెందిన తను ఏదైతే కరెక్ట్‌ అనుకుంటుందో.. అదే చేస్తుంది. ఆ విషయంలో ఎవరిమాట వినదు. ఇదొక పీరియాడిక్‌ ఫిలిం. రెండో ప్రపంచయుద్ధ నేపధ్యంలో జరిగే కథ. 1930కు చెందిన సీతాదేవి కాలేజీలో ఓ అబ్బాయితో ప్రేమలో పడుతుంది. తన ప్రేమను ఎలా గెలిపించుకుందనేదే ఈ సినిమా కథ.
 
పాత్ర పరంగా ఎటువంటి కేర్‌ తీసుకున్నారు?
హిందీలో 'గబ్బర్‌' సినిమా ఆడిషన్స్‌కు వెళ్లాను. ఆడిషన్‌ అప్పుడు నన్ను గుర్తుపెట్టుకొని 'కంచె' సినిమా ఆడిషన్‌కు రమ్మని ఫోన్‌ వచ్చింది. నా నటన నచ్చడంతో హీరోయిన్‌గా కన్ఫర్మ్‌ చేసారు. నా మోడలింగ్‌ ప్రాజెక్ట్స్‌, నేను ఇంతకముందు చేసిన సినిమాల అనుభవం నేను 'కంచె'కు ప్రిపేర్‌ అయ్యేలా చేశాయి. ఈతరం అమ్మాయిలకు 1900 సంవత్సరానికి చెందిన అమ్మాయిలకు చాలా తేడా ఉంటుంది. 
 
నడవడిక, మాట తీరు, లుక్‌ ఇలా ప్రతి దాంట్లో వ్యత్యాసం ఉంది. దానికోసం ఎంతో రీసెర్చ్‌ చేసాను. ఎలా డ్రెస్‌ చేసుకోవాలి, నా లుక్‌ ఎలా ఉండాలనే వాటిపై చాలా శ్రద్ధ పెట్టాను. పాత హిందీ, ఇంగ్లీష్‌ సినిమాలు చూసాను. మహారాణి గాయత్రి దేవి లుక్‌ను నాకు రిఫరెన్స్‌గా ఇచ్చారు. పూర్తిగా మా శ్రద్ధ అంతా క్రిష్‌ గారి విజన్‌ మీదే ఉండేది. ఆయన ఎలా చెప్తే అలా చేశాను. 
 
బాగా కష్టపడిన సందర్భాలు?
ఈ సినిమాలో పండగకు సంబంధించిన ఒక పాట ఉంటుంది. పొలాల గట్ల మధ్య డాన్సు చేయాలి. కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా రాళ్ళు, మొక్కల మధ్య డాన్సు చేయడం చాలా కష్టంగా అనిపించింది. అదే కాకుండా వర్షంలో ఓ ముఖ్యమైన సన్నివేశం షూట్‌ చేయాలి. నేను కళ్ళు బ్లింక్‌ చేయకుండా ఎదురుగా ఉన్న మనిషిని చూస్తూ.. డైలాగ్‌ చెప్పాలి. అప్పుడు కూడా కష్టంగా అనిపించింది.
 
చిరు ఫ్యామిలీ ఏమన్నారు?
ఇక నాగబాబు గారు నన్ను ఈ సినిమాలో చూసి నిజంగా మహారాణిలా ఉన్నావు. పాత సినిమాలో కాంచన గారిలా ఉన్నావని చెప్పారు. అలానే కంచె ఆడియో రోజు రామ్‌ చరణ్‌ స్టేజీ మీద అందంగా ఉన్నావని చెప్పారు. మెగా ఫ్యామిలీ నుండి మంచి సపోర్ట్‌ ఉంది అని చెప్పారు.దీనిపై మరింత చదవండి :