శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: శుక్రవారం, 28 ఆగస్టు 2015 (16:04 IST)

నెలకు 15 రోజులు లండన్‌‍లో ఉండాలి... అందుకే మహేష్‌తో చేయలేదు... రకుల్ ఇంటర్వ్యూ

రవితేజ - రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా 'కిక్‌' సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఎన్‌టిఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మించిన 'కిక్‌-2' చిత్రం ఇటీవల విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. తెలుగు చిత్రాల్లో చేయడం పల్ల ఈజీగా తెలుగు నేర్చుకున్నాననీ, తనను అందరూ తెలుగమ్మాయిగా ముంబైవాసులు అంటుంటారని చెబుతున్న కథానాయిక రకుల్‌ ప్రీత్‌ సింగ్‌తో ఇంటర్వ్యూ...
 
'కిక్‌-2' చిత్రానికి రెస్పాన్స్‌ ఎలా ఉంది?
నా ఫ్రెండ్స్‌ చాలామంది మూవీచూసి చాలా బాగుందని అన్నారు. అలాగే ఆడియన్స్‌ నుండి ఎక్స్‌టార్డినరీ రెస్పాన్స్‌ వచ్చింది. ముఖ్యంగా బ్రహ్మానందం, రవితేజల కామెడీ ట్రాక్‌ని బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. కథలో లీనమై కామెడీ వుంటుంది. స్పెషల్‌ ట్రాక్‌ అంటూ ఏం ఉండదు. డిఫరెంట్‌ పీపుల్స్‌కి డిఫరెంట్‌ కైండ్‌ ఆఫ్‌ కామెడీ నచ్చుతుంది. ఈ సినిమాలో స్టోరీకి తగ్గట్టుగా ట్రీట్‌మెంట్‌ ఉంటుంది. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్‌చేసిన ప్రేక్షకులకు థాంక్స్‌.
 
మీ క్యారెక్టర్‌కి వస్తోన్న ఫీడ్‌బ్యాక్‌ ఎలా వుంది?
చాలా సినిమాల్లో హీరోయిన్‌ క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్‌ ఉండదు. ఈ చిత్రంలో నా మనసుకి దగ్గరైన పాత్ర చేశాను. కథలో భాగంగా నా క్యారెక్టర్‌ ఉంటుంది. ఫస్టాఫ్‌లో సిటీ అమ్మాయిగా, సెకండాఫ్‌లో విలేజ్‌ గర్ల్‌గా చైత్ర క్యారెక్టర్‌ ఉంటుంది. లుక్స్‌, కాస్టూమ్స్‌ చాలా డిఫరెంట్‌గా వుంటుంది. మంచి ఫీడ్‌‌బ్యాక్‌ వస్తోంది. 
 
ఈ చిత్రాన్ని థియేటర్‌లో చూశారా?
ఈ సినిమా రిలీజ్‌ అప్పుడు నేను యుకెలో ఉన్నాను. అక్కడ ఈ సినిమా చూశాను. నాకు బాగా నచ్చింది.
 
ఎలాంటి ఎక్స్‌పీరియన్స్‌ కలిగింది?
రియల్లీ గుడ్‌. కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ డైరెక్టర్‌ సూరి. మూడు వందల మంది ఆర్టిస్టులతో ఔట్‌డోర్‌లో షూటింగ్‌ చేశారు. జైసల్మీర్‌, హంపిలో చాలా హ్యాపీగా షూటింగ్‌ జరిగింది. ఆ జర్నీ చాలా మెమరబుల్‌గా ఉంది. సంధ్యమిశ్రా, రాజ్‌పాల్‌ యాదవ్‌లను సెట్లో చూస్తే రియల్‌గా నవ్వొస్తుంది. లొకేషన్స్‌లో అందరం బాగా ఎంజాయ్‌ చేస్తూ షూటింగ్‌ చేశాం.
 
రవితేజతో వర్క్‌ చేయడం ఎలా ఉంది?
సూపర్బ్‌ ఎక్స్‌పీరియన్స్‌. ఆన్‌‌స్క్రీన్‌, స్క్రీన్‌ బయట చాలా ఎనర్జీగా ఉంటారు రవితేజ. దర్శకుడు సురేందర్ రెడ్డి బాగా చేయించారు. ఎంతమంది వున్నా.. వారితో కలిసి పనిచేయించడం గొప్ప విషయం. బ్రహ్మానందం, రాజ్‌పాల్‌ యాదవ్‌. అంతా సరదాగా వున్నారు.
 
బాలీవుడ్‌లో చేస్తున్నారా? 
అక్కడ చేసినా నేను తెలుగులోనే మాట్లాడుతాను. అందరూ తెలుగు అమ్మాయి అయిపోయిందంటారు.
 
ఇండస్ట్రీ ఎలా వుంది?
నాకు చాలా గౌరవం. నేను ఇచ్చే గౌరవం కూడా అలాగే వుంటుంది.
 
తెలుగులో డబ్బింగ్‌ చెప్పలేదా?
కిక్‌లో ట్రై చేశాను. డబ్బింగ్‌కు టైం దొరకలేదు.
 
హ్యాపియస్ట్‌ థింక్స్‌?
ప్రేక్షకులు ప్రోత్సహించారు. ఆడియన్స్‌ ఏక్సెప్ట్‌ చేశారు. అదే హ్యాపియస్ట్‌ నాకు.
 
హిట్‌కు కారణాలు ఏమిటి?
గాడ్‌ బ్లెస్సింగ్స్‌ వుండాలి. ఫ్యామిలీ సపోర్ట్‌ వుంటే గాడ్స్‌ సపోర్ట్‌ వుంటుంది. హార్డ్ వర్క్‌, డెడికేషన్‌.. వుంటే ఆటోమెటిక్‌గా అన్నీ వస్తాయి. చాలామంది లక్‌ను బ్లేమ్‌ చేస్తారు. కానీ మనం ఏం చేయలేం.
 
లిప్‌లాక్‌ అనుభవం గురించి?
మమ్మీ ఎక్కడో సెట్లో వుంది. ఇక్కడకు రావద్దని చెప్పాను. ఆ సీన్‌ చెప్పినప్పుడు.. విలేజ్‌ కోసం  చేయాలి. నీకు లోపల బాధగా వున్నా... ఈ సీన్‌ చిత్రానికి బాగా వుపయోగపడేదని దర్శకుడు చెప్పాడు. ఎక్కడా వల్గారిటీ లేకుండా చేశారు.
 
ముందుగా చెప్పారా?
స్పాట్‌లోనే చెప్పారు. ముందురోజే ఓ మాట చెప్పారు.. నో చెబితే.. సాడ్‌గా వుంటానని అన్నారు. కథలో భాగమే అందుకే పబ్లిసిటీ ఇవ్వలేదు.
 
బాలీవుడ్‌లో లెంగ్తీ కిస్‌ చేశారుగదా?
అవును. అక్కడ చాలాసేపు వుంది. మొదటిసారి చేసేటప్పుడు ఏడ్చేశాను. ఎమోషన్‌ కావాలనేది ఆ చిత్ర కాన్సెప్ట్‌. స్క్రిప్ట్‌ కన్వియన్స్‌గా వుందని ఓకే అన్నాను.
 
బ్రహ్మూత్సవం చిత్రంలో మీరు లేరే?
నేను లేను. సమంత చేస్తుంది. నాకూ చేయాలనుంది. అనుకోకుండా డేట్స్‌ కుదరలేదు. లండన్‌ షూటింగ్‌ వల్ల సెట్‌ కాలేదు. నెలకు 15 రోజులు లండన్‌లో వుండాలి.
 
ఇన్ని సినిమాలకు టైమ్‌ ఎలా సెట్‌ చేస్తున్నారు?
అంతా మా మేనేజర్‌ చూసుకుంటారు. 
 
చరణ్‌ సినిమాలో పాత్ర ఎలా వుంటుంది?
గ్రాఫిక్‌ డిజైనర్‌గా చేశాను. ఇక సుకుమార్‌ సినిమాలో రిచ్‌ లండన్‌ అమ్మాయిగా నటించాను. బన్నీ సినిమాలో ఇంకా ఎంటర్‌ కాలేదు. అది కూడా కొత్తగా వుంటుంది. 
 
లేడీ ఓరియెంటెడ్‌ పాత్రలు చేస్తారా?
లేడీ ఓరియెంటెడ్‌లో ఇంకా రాలేదు.
 
ఇటీవల లండన్‌లో కన్‌ఫ్యూజ్‌ అయ్యారుగదా?
అవును. ఫస్ట్‌టైమ్‌ అలా జరిగింది. అరగంట పాటు ఎలా మిస్‌ అయ్యానో నాకే తెలీలేదు. నా ఫ్యామిలీ అంతా టెన్షన్‌ పడ్డారు.
 
పాత్ర విషయంలో దేన్ని బేస్‌ చేసుకుంటారు?
సినిమా సినిమాకు తేడా వుంటుంది. ఒకసారి కథ, ఒకసారి బేనర్‌, దర్శకుడు. తక్కువ పాత్ర అయినా ఇంపార్టెంట్‌ వుంటే తప్పకుండా చేస్తాను.
 
గ్లామర్‌, పెర్‌ఫార్మెన్స్‌ దేనికి ప్రాధాన్యత?
బ్యాలెన్స్‌గా వుండాలి. కిక్‌2లో అది వుంది. లాంగ్‌ కెరియర్‌ వుండే పాత్రలు చూసుకుంటాను. కథ నచ్చితే గ్లామర్‌ చేయడానికి రెడీ.
 
వంద కోట్ల క్లబ్‌లో చేరారా?
(నవ్వుతూ).. నేను రావడం ఏమిటి. హీరోను బట్టే వుంటుంది. ఏది ఏమైనా హిట్‌ ప్లాప్‌ మన చేతుల్లో లేదు. హార్డ్‌వర్క్‌ చేయడమంటే ఇష్టం. నటిగా.. టెన్షన్‌ వుంటుంది. నిర్మాత, దర్శకుడికీ వుంటుంది. వందకోట్ల క్లబ్‌లో చేరితే అంతకంటే ఆనందంగా ఏముటుంది. 
 
కెరటం నుంచి కిక్‌ వరకు కెరీర్‌ చూసుకుంటే ఎలా అనిపించింది?
పాజిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ వచ్చింది. నటిగా ఎప్పుడు డెవలప్‌ చేసుకుంటూ పోవాలి. ఇన్ని చిత్రాలు చేసినా.. నా చిత్రం నేను జస్టిఫై చేసుకోలేను.
 
ఎన్‌టిఆర్‌ ఆర్ట్స్‌ బేనర్‌లో చేయడం ఎలా వుంది?
చాలా ఆనందంగా వుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
 
కళ్యాణ్‌రామ్‌తో చేస్తారా?
వస్తే తప్పకుండా..
 
బాహుబలి, శ్రీమంతుడు చూశారా?
చాలా బాగున్నాయి. బాహుబలి చూశాక... సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేశాను. తెలుగు మూవీ అంటే వరల్డ్‌లో కమర్షియల్‌ అనుకుంటారు. బాహుబలితో ప్రపంచ సినిమాలో ఒక ముద్ర గౌరవం ఏర్పర్చుకున్నారు. నా హిందీ ఫ్రెండ్స్‌ ఫోన్‌ చేసి చివరల్లో ఏమవుతుందని అడుగుతుండేవారు.
 
ఇక్కడ నచ్చిన విషయం?
చాలా వున్నాయి. సినిమా గురించి రెస్పెక్ట్‌ వుంది. లైట్‌ మ్యాన్‌ ప్రొడక్షన్‌, డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రతి ఒక్కరూ తపనతో చేస్తుంటారు. అదే నాకు చాలా నచ్చింది... చాలా చోట్ల ఒకరికి చెప్పిన పనిని మరొకరికి చెప్పి చేతులు దులుపుకుంటారు. ఇక్కడ అలా కాదు ఆర్టిస్టులకు రెస్పెక్ట్‌ బాగుంది.
 
ఇక్కడ ఏం నేర్చుకున్నారు?
తెలుగు నేర్చుకున్నాను. రోజూ.. నేర్చుకుంటే ఏ భాష అయినా వచ్చేస్తుంది.
 
సెట్లో మీ మదర్‌ వుంటారా?
ఒక్కోసారి మదర్‌, బ్రదర్‌ వుంటారు. 
 
డ్రీమ్‌ క్యారెక్టర్లు?
చిరస్థాయికి గుర్తిండిపోయే పాత్ర చేయాలి. అదేమిటనేది ఇంకా అనుకోలేదు.
 
ఎవరినైనా ప్రేమించారా?
సినిమానే ప్రేమించాను అని చెప్పారు.