శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Updated : సోమవారం, 18 మే 2015 (18:22 IST)

గ్లామర్‌ అనే పదం ఇష్టం వుండదు... కానీ బొడ్డు చూపిస్తే... రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇంటర్వ్యూ

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ చిత్రంలో నటించాక ప్రస్తుతం అగ్రహీరోల చిత్రాల్లో అవకాశం రావడం డెస్టినీగా భావిస్తున్నట్లు రకుల్‌ప్రీత్‌ సింగ్‌ అంటోంది. రవితేజతో 'కిక్‌-2'లో నటించింది. తాజాగా రామ్‌తో 'పండగ చేస్కో'లో చేసింది. ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ చిత్రం గురించి ఆమె చెప్పిన సంగతులు.
 
ఈ సినిమాలో మీ పాత్ర ఎలా వుంటుంది?
విలేజ్‌ అమ్మాయిగా చేశాను. పర్యావరణ పరిరక్షణ చేస్తుంటాను. జంతువులను, పక్షుల్ని ప్రేమిస్తాను. పచ్చదనం కోసం పరితపిస్తాను. నేను చేసే పనులు చూసేవారికి కామెడీగా వుంటాయి. ఫస్ట్‌టైమ్‌ ఇలాంటి పాత్ర చేస్తున్నాను. 
 
ఏ తరహా చిత్రం?
కుటుంబమంతా కలిసి చూసే చిత్రమిది. ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్‌, మ్యూజిక్‌‌తో కూడిన కుటుంబ కథా చిత్రమిది. మంచి ఎమోషనల్‌ మసాలా మూవీ ఇది. పండుగలాంటి వాతావరణం ప్రతి ఫ్రేమ్‌లో కన్పిస్తుంది.
 
రామ్‌తో డాన్స్‌ చేయడం ఎలా వుంది?
నేను మొదట నెర్వెస్‌గా ఫీలయ్యాను. రామ్‌ చాలా స్పీడ్‌ మనిషి. ఏక్టింగ్‌, డాన్స్‌ చాలా ఫాస్ట్‌గా వుంటాయి. జోవియల్‌గా వుంటాడు. రెండు రోజులు ఆయనతో కలిసి నటించడానికి కష్టపడాల్సి వచ్చింది. అందుకోసం జోకులు వేస్తూ సరదాగా మైండ్‌ను మలిచాడు.
 
సోనాల్‌ చౌహాన్‌ గురించి..?
తన పాత్ర విదేశాల నుంచి ఇండియా వస్తుంది. నేను ఇక్కడే వుంటాను. సోనాల్‌‌తో నాకు రెండు మూడు సీన్స్‌ మాత్రమే ఉంటాయి. స్వీట్‌ గర్ల్‌ తను. 
 
గోపీచంద్‌ మలినేని దర్శకత్వం ఎలా అనిపించింది?
ఆయన అటు క్లాస్‌ను, ఇటు మాస్‌ను డీల్‌ చేయగల దర్శకుడు. ఒక్కొక్క ఫ్రేమ్‌‌లో 20 నుండి 25 మంది యాక్టర్స్‌ ఉంటారు. వాళ్ళందరిని మేనేజ్‌ చేస్తూ తనకు కావలసినట్లుగా ఔట్‌‌పుట్‌ రప్పించుకుంటారు. చాలా ఓర్పు ఉన్న మనిషి. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను.
 
స్క్రిప్ట్స్‌ ఎలా సెలెక్ట్‌ చేసుకుంటారు..?
కథ విన్నప్పుడు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రా లేదా అని చూస్తాను. రెండు స్క్రిప్ట్స్‌ నా చేతిలో ఉంటే ఏ సినిమాలో నా పాత్రకు పెర్ఫార్మన్స్‌ ఎక్కువగా ఉంటుందో అదే సెలెక్ట్‌ చేసుకుంటాను. 
 
పాత్రల్లో గ్లామర్‌ ఎంతవరకు చేయగలరు? నాభీ ప్రదర్శనపైన...
అసలు ఆ పదమే ఇష్టం వుండదు. గ్లామర్‌ అని ఎందుకంటారో తెలీదు. గ్లామర్‌ అనేది మనం వేసుకున్న డ్రెస్‌‌లలో ఉండదు. పాత్రకు తగ్గట్లుగానే వస్త్రధారణ ఉంటుంది. ఇప్పుడు ఫేషన్‌గా వస్త్రాలు వేసుకోవడం అలవాటైంది. దాన్ని గ్లామర్‌ అనకూడదు. అయితే అనవసరంగా మూవీలో గ్లామరస్‌‌గా నటించడం నాకు నచ్చదు. సీన్స్‌ డిమాండ్‌ చేస్తే మాత్రమే నటిస్తాను.
 
స్టార్‌ హీరోస్‌‌తో నటించే అవకాశాలు చకచకా వస్తున్నాయి. రహస్యం?
సీక్రెట్‌ అంటూ ఏమీ లేదు. అదంతా డెస్టినీ అనుకుంటా. దానికితోడు హార్డ్‌‌వర్క్‌ చేయడంతో వస్తున్నాయి.
 
ఫ్యామిలీ లైఫ్‌‌ను మిస్‌ అవ్వట్లేదా..?
నాకు ఇష్టమైన పని చేసుకుంటుంన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఫ్యామిలీ లైఫ్‌‌ను మిస్‌ అవ్వట్లేదు. మా అమ్మ నాతోనే ఉంటుంది. నా ఫ్రెండ్స్‌, వెల్‌‌విషర్స్‌‌తో రెండుమూడు రోజులకొకసారి మాట్లాడుతూ ఉంటాను. నాకు వీలున్నప్పుడల్లా ఢిల్లీ వెళ్లి వారిని కలుస్తాను.
 
మీకు ఇష్టమైన పండగ ఏది?
హోలీ అంటే నాకు చాలా ఇష్టం. కాని ఇప్పుడు ఆడలేను. 
 
పారితోషికం పెంచారని వార్తలు వచ్చాయి?
మొదటి సినిమాకు తర్వాత సినిమాకు తేడా వుంటుంది. అదంతా మా మనేజర్‌ చూసుకుంటాడు. 
 
మహేష్‌ బాబు సినిమాకు ఎక్కువ అడిగారనే వార్త కూడా వచ్చింది?
అసలు ఇంకా నేను సైనే చేయలేదు. 
 
కొత్త చిత్రాలు?
'షిమ్లా మిర్చి' చేశాను. పూర్తయింది. ఆగష్టు లేదా సెప్టెంబర్‌‌లో రిలీజ్‌ అవుతుంది అని ముగించింది.