శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: సోమవారం, 21 సెప్టెంబరు 2015 (21:53 IST)

పవన్‌ మామయ్యకు నేనేంటే స్పెషల్‌ కేర్‌: సాయిధరమ్‌ తేజ్‌ ఇంటర్వ్యూ

'పిల్లా నువ్వులేని జీవితం' అంటూ రెజీనాతో చెట్టాపట్టాలేసుకున్న సాయిధరమ్‌తేజ్‌ మళ్ళీ ఆమెతోనే తాను సేల్‌ అంటూ కొనుక్కోవచ్చంటూ ముందుకొస్తున్నాడు. సినిమాలో ఆయన పేరు సుబ్రహ్మణ్యం. ఆయను ఎలా సేల్‌ చేసుకుంటాడో.. ఏమిటా కదా? అనేది చిత్రంలో చూడాల్సిందేనంటూ చెబుతున్నారు. ఈ నెల 24న చిత్రం విడుదల కానుంది. తన మామయ్యల్లో పవన్‌ అంటే ఇష్టమనీ, ఆయన తనపై తీసుకుంటున్న కేర్‌ చాలా గొప్పదని అంటున్న సాయిధరమ్‌ తేజ్‌తో ఇంటర్వ్యూ విశేషాలు.
 
మీ దగ్గరకి వచ్చే వారు మీ కోసమేనా, లేక మీ ఫ్యామిలీ హీరోలను బేస్‌ చేసుకుని వస్తారా?
మాకు రాని ఆలోచన వచ్చిందే... ఇప్పటివరకూ అలా జరగలేదు. నా దగ్గరకు వచ్చేవారు నా గురించి రాసుకున్న కథ అని చెబుతారు. కాని నిజంగా నాకంటే వరుణ్‌కో మరొకరికో సూట్‌ అవుతాయంటే ఖచ్చితంగా షేర్‌ చేసుకుంటాము. ఫ్యూచర్‌లో అలా జరిగే పాజిబిలిటీస్‌ ఉన్నాయి.
 
సబ్రహ్మణ్యం.. సినిమాలో మీ క్యారెక్టరైజైషన్‌ ఎలా వుంటుంది?
ఇప్పటి యూత్‌ ఆలోచనలకు దగ్గరగా వుంటుంది. డబ్బు కోసం అమెరికా వెళ్ళిన యువకుని పాత్రలో కనిపిస్తాను. సంపాదన కోసం అన్ని రకాలా ఉద్యోగాలు చేస్తుంటాడు. రెస్టారెంట్‌లో, టాక్సీ డ్రైవర్‌గా ఇలా పని చేసుకుంటూ ఉన్న అబ్బాయికి ఓ అమ్మాయి పరిచయమవుతుంది. తను కొన్ని సమస్యల్లో ఉంటుంది. వాటిని హీరో సాల్వ్‌ చేసి, ఇద్దరు ప్రేమలో పడే అంశాలతో సినిమా రన్‌ అవుతుంటుంది.
 
అమ్మాయి ప్రాబ్లమ్‌ హీరో సాల్వ్‌ చేసే కథలు చాలానే వచ్చాయి కదా?
కరెక్టే.. ఇక్కడ బ్యాక్‌డ్రాప్‌తో పాటు.. అమ్మాయి సమస్య కూడా చిత్రంగా వుంటుంది. ఎవ్వరూ ఊహించని ప్రాబ్లమ్‌.. సహజంగా ప్రేమించిన అమ్మాయి కోసం అబ్బాయి ఏదైనా చేస్తాడు కదా.. దానికి మించి కథలు ఏముంటాయి చెప్పండి.
 
దర్శకుడు హరీష్‌ నేరుగా మీకే కథ చెప్పారా?
నాకే చెప్పారు. హరీష్‌ నాకు 'మిరపకాయ్‌' సినిమా నుంచి తెలుసు. ఆయన నాతో సినిమా చేయాలని కథ చెప్పడానికి వచ్చారు. చెప్పే ముందే నేను గబ్బర్‌ సింగ్‌ డైరెక్టర్‌ అనుకొని కథ వినకు. రామయ్య వస్తావయ్య సినిమా డైరెక్టర్‌గా కథ చెబుతున్నాను. స్టొరీ నచ్చితేనే సినిమా చేద్దాం అన్నారు. ఆయన కథ చెప్పిన వెంటనే మరో ఆలోచన లేకుండా వెంటనే ఓకే చెప్పేసాను. 
 
ఆడియో వేడుకలో చిరంజీవిగారు..'మొగుడు కావాలి' సినిమాలా వుందని మీ చిత్రం గురించి మాట్లాడారు?
కొన్ని కథలు ఎక్కడో చోట సింక్‌ అవుతాయి. దర్శకుడు కూడా కొన్ని చిత్రాలను ఇన్స్పిరేషన్‌ తీసుకుంటాడు. ట్రైలర్‌ చూసినప్పుడు మావయ్యకు బావగారు బాగున్నారా, మొగుడు కావాలి సినిమాల్లాగా అనిపించి ఉండొచ్చు. ఫ్యామిలీ ఎమోషన్స్‌, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ఇందులో వున్నాయి.
 
'గువ్వా గోరింకతో' పాట స్టెప్‌లు కష్టమనిపించలేదా?  
చాలా పాటలను ఫిల్టర్‌ చేసిన తరువాత 'గువ్వా గోరింకతో' సాంగ్‌ సెలెక్ట్‌ చేసాం. స్టెప్‌లు వేసేటప్పుడు మామయ్య చేసినట్లున్నా... కొత్తగా అనిపిస్తాయి. ఈ సాంగ్‌ సెలక్షన్‌ మాత్రం దిల్‌ రాజు గారు, హరీష్‌ల ఛాయిస్‌. ఈ పాట కోసం ప్రత్యేకంగా అమెరికాలోని గ్రాండ్‌ కెన్యా అనే ప్రాంతంలో షూట్‌ చేసాం. ఇప్పటివరకు అక్కడ ఏ సినిమా షూటింగ్‌ జరగలేదు. అక్కడ పర్మిషన్‌ కూడా కేవలం ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకే. ఆ రెండు గంటల్లోనే మేము పాటలో చరణం, పల్లవి షూట్‌ చేసాం. రాత్రి 12 గంటల వరకు రిహార్సల్స్‌ జరిపి ఉదయం మూడు గంటలకే బయలుదేరి ఆ పాట షూటింగ్‌ కంప్లీట్‌ చేసాం. 
 
మీ నటనలో మీ మామయ్యలే కన్పిస్తారే?
చిన్నప్పటి నుండి వారిని చూస్తూ పెరగడం వలన వాళ్ళ మేనరిజం వచ్చి ఉండొచ్చు. అంతేకాని వారిని ఇమిటేట్‌ చేసే విధంగా నేను ఎప్పుడు ప్రవర్తించలేదు. నా బాడీ లాంగ్వేజ్‌ అంతే. 
 
రెండోసారి రెజీనాతో నటించడం ఎలా వుంది?
ఇద్దరం మంచి ఫ్రెండ్స్‌. తనతో ఆల్రెడీ పిల్లా నువ్వు లేని జీవితం సినిమా చేసాను. సో.. తనతో కలిసి వర్క్‌ చేయడానికి చాలా కంఫర్టబుల్‌‌గా ఫీల్‌ అవుతాను. తను నాకు మూడు సంవత్సరాలుగా తెలుసు. నేను ఇంటిమేట్‌ సీన్స్‌‌లో నటించడానికి కాస్త ఇబ్బంది పడతాను. కాని రెజీనా నాకు మంచి ఫ్రెండ్‌ కాబట్టి ఏమైనా ప్రాబ్లం అయితే ఇద్దరం డిస్కస్‌ చేసుకొని హరీష్‌‌కు చెప్పేవాళ్ళం.
 
కథల ఎంపిక విషయంలో ఎవరైనా ఇన్వాల్వ్‌ అవుతారా?
లేదు. సొంత నిర్ణయాలే తీసుకుంటాను. కాని కథ ఓకే చేసాక చిన్న మావయ్య(పవన్‌ కళ్యాన్‌)కు సినిమా చేస్తున్నాను అని ఇన్ఫార్మ్‌ చేస్తాను. ఆయన నా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. రీసెంట్‌‌గా నేను బైక్‌ కొన్నానని తెలిసి వెంటనే ఫోన్‌ చేసారు. హెల్మెట్‌ కొన్నావా, గ్లౌజెస్‌ తీసుకున్నావా అని చాలా ప్రశ్నలు అడిగారు. ఆయనకు నేనంటే అంత కేరింగ్‌. కొంచెం డబ్బు సంపాదించిన తరువాత స్పోర్ట్స్‌ బైక్‌ తీసుకోవాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. ఈ మధ్యనే హార్లీ డేవిడ్సన్‌ బైక్‌ కొనుకున్నాను. 
 
దిల్‌ రాజు ప్రొడక్షన్‌లోనే కంటెన్యూగా చేస్తున్నారే?
అనుకున్న రెమ్యునరేషన్‌ ఇస్తున్నారు. అందుకే ఆయన ప్రొడక్షన్‌లో సినిమాలు చేస్తున్నాను. నా తదుపరి చిత్రాలు కూడా ఆయనతో కమిట్‌ అయ్యాను. జనాలని సంతృప్తి పరిచే సినిమాలే చేస్తాను. ఒక నటునిగా నేనేంటో ప్రూవ్‌ చేసుకోవాలి. ఎవరైనా మంచి కథలతో అప్రోచ్‌ అయితే ఖచ్చితంగా వేరే బ్యానర్‌‌లో కూడా నటిస్తాను.
 
సెట్లోకి మామయ్యలు వచ్చారా?
అలా వచ్చి వెళ్ళిపోయినవారే. పవన్‌ మామయ్య రాలేదు. మొదటిసారి నాగబాబు గారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నాను. షూటింగ్‌‌కు ఆయన రాకముందు వరకు సులువుగా యాక్ట్‌ చేసేవాడ్ని. ఆయన వచ్చాక డైలాగ్‌ చెప్పడానికి చాలా టేక్స్‌ తీసుకున్నాను. సడన్‌గా ఆయనని చూసి చిన్నపిల్లాడ్ని అయిపోయాను. తరువాత ఆయన నా దగ్గరకి వచ్చి ఏంట్రా ప్రాబ్లం ఎందుకు చేయలేకపోతున్నావని అడిగారు. మిమ్మల్ని చూడగానే టెన్షన్‌ వచ్చేసిందని చెప్పాను. ఆ తరువాత నాగబాబు గారు, హరీష్‌ అన్న నాకు సర్ది చెప్పి డైలాగ్‌ చెప్పించారు.
 
హీరోల కాంపిటేషన్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
నాకంటూ ఓ మేనరిజం వుంది. దాన్ని కంటెన్యూ చేయడమే. యూత్‌ హీరోలంతా ఒక్కోరికిది ఒక్కో స్టైల్‌. కాంపిటేషన్‌ అనేది వృత్తిలోనే. అది కూడా మంచిదే.
 
కొత్త చిత్రాలు?
అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో నటిస్తున్నాను. అది కాకుండా దిల్‌ రాజు గారి ప్రొడక్షన్‌‌లో శతమానం భవతి సినిమాలో నటిస్తున్నాను అని చెప్పారు.