శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By srinivas
Last Modified: శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (20:15 IST)

'శైలజారెడ్డి' ర‌మ్య‌కృష్ణ‌తో ముఖాముఖి... నాగచైతన్య అక్కడ చాలా ఇబ్బందిపడ్డారు...

అందం, అభిన‌యం ఈ రెండూ ఉన్న అతికొద్దిమంది తార‌ల్లో ర‌మ్య‌కృష్ణ ఒక‌రు. టాప్ హీరోల స‌ర‌స‌న న‌టించి మెప్పించి ప్రేక్ష‌క హృద‌యాల్లో సుస్థిర స్ధానం సంపాదించుకున్న ర‌మ్య‌కృష్ణ సెకండ్ ఇన్నింగ్స్‌లో బాహుబ‌లి సినిమాలో శివ‌గామి పాత్ర‌లో న‌టించి అలాంటి పాత్ర‌లు

అందం, అభిన‌యం ఈ రెండూ ఉన్న అతికొద్దిమంది తార‌ల్లో ర‌మ్య‌కృష్ణ ఒక‌రు. టాప్ హీరోల స‌ర‌స‌న న‌టించి మెప్పించి ప్రేక్ష‌క హృద‌యాల్లో సుస్థిర స్ధానం సంపాదించుకున్న ర‌మ్య‌కృష్ణ సెకండ్ ఇన్నింగ్స్‌లో బాహుబ‌లి సినిమాలో శివ‌గామి పాత్ర‌లో న‌టించి అలాంటి పాత్ర‌లు చేయాలంటే ర‌మ్య‌కృష్ణ మాత్ర‌మే చేయాల‌నిపించారు. తాజాగా అక్కినేని నాగ‌చైత‌న్య శైల‌జారెడ్డి అల్లుడు సినిమాలో శైల‌జారెడ్డి పాత్ర‌లో న‌టించి మ‌రోసారి మెప్పించారు. సెప్టెంబ‌ర్ 15న ర‌మ్య‌కృష్ణ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ర‌మ్య‌కృష్ణ‌తో ఇంట‌ర్వ్యూ మీకోసం...
 
 
ర‌మ్య‌కృష్ణ గారు మీకు ముందుగా బ‌ర్త్‌డే విషెస్‌.. ఈ పుట్ట‌న‌రోజు కానుక‌గా శైల‌జారెడ్డి అల్లుడు మంచి విజ‌యాన్ని సాధించ‌టం ఎలా వుంది.?
మీకు ధ‌న్య‌వాదాలు.. ఈ పుట్టిన‌రోజుకి ఓక మంచి చిత్రం సూప‌ర్‌హిట్ అవ్వ‌టం చాలా ఆనందంగా వుంది. అలాగే ఈ చిత్రంలో అంద‌రూ చాలా జెన్యూన్‌గా కష్ట‌ప‌డ్డారు.. వారంద‌రికి నా ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు.
 
శైల‌జారెడ్డి అల్లుడు చిత్రం చూసిన‌ వారంతా మీ పాత్ర గురించి ప్ర‌త్యేకంగా మాట్లాడుకుంటున్నారు.. ఈ రెస్పాన్స్ మీద మీ కామెంట్‌...
డెఫినెట్‌గా శైలజారెడ్డి పాత్ర వైవిధ్యంగా వుంటుంది. ఒక సైడ్ ఊరులో ఆడ‌వాళ్ళ‌కి అన్యాయం జ‌రిగితే ఏంత‌వ‌ర‌కైనా పోరాడే ధీర‌త్వం.. మ‌రోవైపు త‌ల్లిగా కూతురు మీద ప్రేమ‌.. స‌మ‌స్య వ‌స్తే ఎదుర్కునే ధైర్యం ఇన్ని వున్నాయి శైల‌జారెడ్డి పాత్ర‌లో.. మారుతి గారు ఈ పాత్ర‌ని మ‌లిచిన విధానం చాలా బాగుంది. ఈ చిత్రంలో అత్త పాత్ర రెగ్యుల‌ర్‌గా ఉండ‌దు.. మీరు ఎప్పూడూ చూస్తున్న అత్త అల్లుళ్ళ మ‌ధ్య కామెడి కూడా ఈ చిత్రంలో క‌నిపించ‌దు. చూసినవారికి, చూసేవారికి స్వీట్ సర్ప్రైజ్‌లా వుంటుంది. 
 
ఈ చిత్రంలో మీది ఇగో కేర‌క్ట‌ర్ క‌దా..?
అది ఓ ప‌క్క వుంటుంది.,. కాని సీన్స్ అన్నీ కొత్త‌గా వుంటాయి. చాలా బాగుంటాయి.. కొత్త అత్త‌, అల్లుడ్ని చూస్తారు. ఈ చిత్రంలో...
 
ఇక్క‌డ అత్తకి ఇగోనే కూతురికి ఇగోనే పాపం అల్లుడు క‌దా.. అల్లుడు మీద జాలి వేయ‌లేదా మీకు..?
హ‌హ‌హ నిజం అండీ... అత్తగా నాకు ఇగో, కూతురికి ఇగో ఇక్క‌డ వ‌ర‌కూ నేను ఎంజాయ్ చేశాను.. సేమ్ నాలాంటి పాత్ర ఇంకోక‌టి నాకు తోడుగా వుంది అని పాపం చైతన్య గారికి మాత్రం ఫుల్ టెన్ష‌న్ వుంది.. కాని మీరు చూస్తే ఇవ‌న్ని ఫ‌న్ జెనెరేట్ చేస్తాయి. మా ముగ్గురి మ‌ధ్యలో న‌రేష్ గారు, మాణిక్యంగా ఫృధ్వి గారు, వెన్నెల కిషోర్ గారు కేర‌క్ట‌ర్స్ కామెడిగా వుంటాయి.. కొన్నిసార్లు కామెడికి షూట్ కూడా ఆపేసి న‌వ్వేవాళ్ళం.. నేను బాగా ఎంజాయ్ చేశాను.
 
మీరు నాగార్జున గారితో చేశారు.. ఇప్ప‌ుడు నాగ‌చైత‌న్య గారికి అత్త‌గా చేశారు.. చైత‌న్య గారు యాక్టింగ్ ఎలా వుంది..?
చాలా హ్య‌పిగా వుంది. నాగ‌ చైతన్య వెరీ డౌన్ టు ఎర్త్ వుండే మ‌నిషి. యాక్టింగ్‌లో చాలా గ్రోత్ అయ్యాడు. ముఖ్యంగా నన్ను, అనుని క‌న్విన్స్ చేసే సీన్ వుంది. అక్క‌డ చాలా ఈజ్‌తో మెచ్చూర్డ్ ఫెర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు.. వెరి గుడ్ ఆర్టిస్ట్‌.
 
డైర‌క్ట‌ర్ మారుతి గారు వ‌ర్కింగ్ స్టైల్ ఎలా వుంది.. సీనియ‌ర్‌గా ఏమైనా టీజ్ చేశారా..?
టీజ్ చేయ‌ట‌మా... అంత టైమ్ ఇవ్వ‌రు ఈ డైర‌క్ట‌ర్‌.. బాబోయ్ స్పీడ్‌గా వ‌ర్క్ చేస్తారు. మిష‌న్‌లా... జ‌స్ట్ రెడి అయ్యి కూర్చుందామ‌నుకునేస‌రికి రెడి రెడి అని కాల్ చేస్తారు. ఓ రోజు వ‌ర్షం ప‌డుతుంది... వ‌దిలేస్తాడేమో అనుకున్నా.. ఆ గ్యాప్‌లో కూడా తీసేసారు.. వెరి గుడ్ ఫ్యూచ‌ర్ వుంది. వెరి గుడ్ ప్లానింగ్‌.. నా కెరీర్లో ఇంత ఫాస్ట్‌గా షూటింగ్ చేసి ఇంత ఫాస్ట్‌గా ఇచ్చిన చిత్రం శైల‌జారెడ్డి మాత్ర‌మే. 
 
మీరు సీరియ‌స్ పాత్ర ఎలా చేస్తారో అంతే ఈజిగా కామెడి కూడా చేస్తారు.. ఎలా.?
అలా ఏమి కాదు ఆర్టిస్ట్ అంటే అన్ని చెయ్యాలి.. కొ-ఆర్టిస్ట్ పెర్‌ఫెక్ట్‌గా వుంటే కామెడి చాలా బాగా వ‌స్తుంది అది కూడా స్పాంటెనియ‌స్‌గా వస్తుంది.. నేను కామెడి బాగా చేసింది పంచ‌తంత్రం చిత్రం... ఈ శైల‌జారెడ్డి అల్లుడులో నా చుట్టూ కామెడి జ‌రుగుతుంది. హిలెరియ‌స్‌గా వుంటుంది కాని నేను సీరియ‌స్‌గా వుండాలి.. ఇది నాకు ఢిఫ‌ికల్ట్‌గా అనిపించింది. 
 
సినిమాటోగ్రాఫ‌ర్ నిజార్ ష‌ఫి గురించి చెప్పండి..?
మీరు సినిమాలో చూశారు అంద‌రూ చాలా అందంగా వున్నారు.. కాని మారుతి గారు వ‌ర్క్ స్పీడ్‌కి ఆయ‌న ప‌రిగెత్తి ప‌రిగెత్తి షూట్ చేసేవాడు పాపం.. గ్రేట్ పీపుల్‌తో వ‌ర్క్ చేశాను అనే ఫీలింగ్ వుంది నాకు.
 
మీరు బాహుబ‌లి చిత్రం త‌రువాత కొంచెం గ్యాప్ తీసుకుని ఇలా అత్త‌గా క‌నిపించారు.. మ‌రి ఇలాంటి రోల్స్ వ‌స్తే చేస్తారా..?
 
నేను చేసిన వెరైటి రోల్స్ మాత్ర‌మే న‌న్ను ఆర్టిస్టుగా నిల‌బెట్టాయి.. సో ఇలాంటి వైరైటి రోల్స్ వ‌స్తే త‌ప్ప‌కుండా చేస్తాను. 
 
ఈ సినిమా నిర్మాత‌ల గురించి చెప్పండి..?
చాలా ఫ్యాష‌నేట్ ప్రోడ్యూస‌ర్స్. అలాగే ద‌ర్శ‌కుడ్ని నమ్మి న‌టీన‌టుల్ని న‌మ్మి ఇలా చిత్రాలు చేసే నిర్మాత‌లు చాలా అరుదుగా వుంటారు. వారికి నా త‌రుపున కంగ్రాట్స్‌..
 
చివ‌రిగా ఈ చిత్రం గురించి..?
చాలా మంచి చిత్రం.. చ‌క్క‌టి ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్‌గా అంద‌రూ ఆద‌రిస్తున్నారు. ఇలాగే శైల‌జారెడ్డి అల్లుడ్ని మరింత ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అని ముగించారు.