'శైలజారెడ్డి అల్లుడు'కి డేట్ ఫిక్స్... భార్యాభర్తల మధ్య పోటీ?  
                                          అక్కినేని నాగ చైతన్య నటించిన తాజా చిత్రం "శైలజారెడ్డి అల్లుడు". ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించగా, సీనియర్ నటి రమ్యకృష్ణ అత్తగా నటించింది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఈనెల 31వ తేదీ
                                       
                  
				  				  
				   
                  				  అక్కినేని నాగ చైతన్య నటించిన తాజా చిత్రం "శైలజారెడ్డి అల్లుడు". ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించగా, సీనియర్ నటి రమ్యకృష్ణ అత్తగా నటించింది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఈనెల 31వ తేదీన విడుదల కావాల్సి వుంది. అయితే, అనివార్య కారణాల రీత్యా ఈ చిత్రం విడుదలను వాయిదా వేశారు.
	
				  
	 
	అయితే కేరళలో రీ రికార్డింగ్ చేస్తోన్న గోపీ సుందర్, వరదల కారణంగా సకాలంలో తన పనిని పూర్తిచేయలేకపోయాడు. దాంతో ఈ సినిమా ముందుగా అనుకున్నట్టుగా ఈ నెల 31వ తేదీన థియేటర్లకు రావడం లేదు. "వినాయక చవితి" సందర్భాన్ని పురస్కరించుకుని వచ్చేనెల 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారనేది తాజా సమాచారం. 
				  											
																													
									  
	 
	అదే రోజున 'యూ టర్న్', 'నన్నుదోచుకుందువటే' సినిమాలు విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. యుటర్న్ చిత్రం నాగచైతన్య సతీమణి, టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం కావడం గమనార్హం. సో, సెప్టెంబరు 13న భార్య సమంతతో నాగచైతన్య పోటీపడేందుకు సిద్ధమయ్యారన్నమాట.