Widgets Magazine

డబ్బింగ్ వద్దు బాబోయ్.. యూటర్న్‌లో తేలిపోయిన సమంత..

శనివారం, 15 సెప్టెంబరు 2018 (10:49 IST)

అక్కినేని సమంత తాజాగా యూటర్న్ సినిమాకు డబ్బింగ్ చెప్పింది. పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటిస్తూ తన సత్తా చాటుతోంది. ఇప్పటివరకు సమంత అన్ని సినిమాలకు సింగర్ చిన్మయి డబ్బింగ్ చెబుతూ వస్తోంది. అయితే 'మహానటి' సినిమాలో తొలిసారి సమంత తన పాత్రకు డబ్బింగ్ చెప్పింది. అందులో ఆమెకు ఎక్కువ డైలాగులు లేకపోవడంతో తప్పించుకుంది. కానీ యూటర్న్‌లో సమంత డబ్బింగ్‌లో తేలిపోయింది. 
 
'యూటర్న్' సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రం సమంత డబ్బింగ్ మానుకో అంటూ ఆమెకు సూచిస్తున్నారు. ఈ సినిమాలో సమంత చుట్టూ తిరుగుతుంది. కథను మొత్తం తానే నడిపించాలి. ఇదంతా తెలిసి కూడా సమంత తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడే ఆమె తెలుగు డబ్బింగ్ బాగాలేదనే విమర్శలొచ్చాయి. 
 
వీటికి సమంత స్పందిస్తూ మరింత మెరుగ్గా చేసే ప్రయత్నం చేస్తున్నామంటూ వెల్లడించింది. అయితే సినిమాలో ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో ఆమె డైలాగ్స్ అర్ధం కాలేదని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఏడుస్తున్నప్పుడు సమంత ఏం చెప్పిందో అర్ధం కాక ఇబ్బంది పడ్డామని నెటిజన్లు అంటున్నారు.

చిన్మయి గొంతు అంత బాగా సెట్ అయినప్పుడు ఇప్పుడు ఇలాంటి ప్రయోగాలు అవసరమా సామ్..? అందరూ చాలామంది ఆమెను ప్రశ్నిస్తున్నారు. దీంతో డబ్బింగ్ చెప్పడం మానుకోవాలని సమ్మూ కూడా భావిస్తోంది.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'శైలజారెడ్డి' ర‌మ్య‌కృష్ణ‌తో ముఖాముఖి... నాగచైతన్య అక్కడ చాలా ఇబ్బందిపడ్డారు...

అందం, అభిన‌యం ఈ రెండూ ఉన్న అతికొద్దిమంది తార‌ల్లో ర‌మ్య‌కృష్ణ ఒక‌రు. టాప్ హీరోల స‌ర‌స‌న ...

news

ప్రేమలో వున్నాను.. పిల్లలు కావాలనుకున్నప్పుడు పెళ్లి చేసుకుంటా: తాప్సీ

అందాల రాశి తాప్సీ ప్రేమలో వుంది. కానీ తనకు పిల్లలు కావాలనుకున్నప్పుడు మాత్రమే వివాహం ...

news

ఏం.. మంచివాళ్లకు ఎఫైర్స్ వుండవా? పుండు మీద కారం చల్లిన శ్రీరెడ్డి

ఇటీవలి వరకూ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు కేవలం సినీ ఇండస్ట్రీల వరకే వుండింది. కానీ తాజాగా ...

news

కొత్తగా సినిమాల్లో అడుగుపెట్టేవారి మొదటి మెట్టు... కేరాఫ్ కంచరపాలెం...

స్టార్‌ హీరోలు అవసరం లేదు. పేరున్న హీరోయిన్‌‌తో అస్సలు పనిలేదు. భారీ సెట్టింగులతో అవసరమే ...

Widgets Magazine