'చై'తో పోటీపడిన 'సామ్'... 'యుటర్న్' మూవీ టాక్ ఎలావుంది?

టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగ చైతన్య. ఈ కుర్ర హీరో నటించి తాజాగా విడుదలైన చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు'. మారుతి దాసరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ కాగా, సీనియర్ నటి రమ్య

uturn
pnr| Last Updated: శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (15:37 IST)
టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగ చైతన్య. ఈ కుర్ర హీరో నటించి తాజాగా విడుదలైన చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు'. మారుతి దాసరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ కాగా, సీనియర్ నటి రమ్యకృష్ణ అత్తగా నటించింది. ఈ చిత్రం సెప్టెంబరు 14వ తేదీ గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో సాఫ్ట్ క్యారెక్టర్‌లో చైతూ నటించి మంచి మార్కులు కొట్టేశాడు. ఇకపోతే, రమ్యకృష్ణ, మురళీ శర్మ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనూ ఇమ్మాన్యుయేల్ నటన పరంగా నిరాశపరిచింది. హాస్య నటుడు వెన్నెల కిషోర్ ఫర్వాలేదననిపించాడు. మొత్తంమీద శైలజారెడ్డి అల్లుడు మంచి టాక్‌తో ఆడుతోంది.
 
అదేసమయంలో నాగ చైతన్య భార్య, హీరోయిన్ అక్కినేని నటించి 'యుటర్న్' చిత్రం కూడా గురువారమే (సెప్టెంబరు 13) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెండితెరపై భార్యాభర్తలు నటించిన చిత్రాలు పోటీపడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరి 'యుటర్న్' చిత్రం మూవీ ఎలా ఉందో ఓసారి పరిశీలిద్ధాం. 
 
నిజానికి సమంత తన సినీ కెరీర్ ప్రారంభంలో గ్లామ‌ర్ పాత్ర‌లతో ఆక‌ట్టుకుని స్టార్ హీరోలంద‌రితో న‌టించి.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. న‌ట‌నప‌రంగా దాదాపు ద‌శాబ్ద‌కాలం అనుభ‌వముంది. అందుకేనేమో ప్ర‌స్తుతం స‌మంత గ్లామ‌ర్ పాత్ర‌ల కంటే పెర్ఫామెన్స్ రోల్స్ చేయ‌డానికి ఆస‌క్తిని చూపుతుంది. ఈ కోవలోకి 'రంగస్థలం', 'మహానటి' చిత్రాలు వస్తాయి. అయితే తొలిసారి లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయ‌డానికి ముందుకు వ‌చ్చింది. స‌మంత ప్రధాన పాత్రధారిగా నటించిన యుట‌ర్న్. క‌న్న‌డలో శ్రద్ధా శ్రీనాథ్ చేసిన రోల్‌నే స‌మంత తెలుగు, త‌మిళంలో పోషించింది. 
 
ఇంజ‌నీరింగ్ చదివిన ర‌చ‌న‌(స‌మంత‌) జ‌ర్న‌లిజంపై ఆస‌క్తితో ఓ పత్రికలో జ‌ర్న‌లిస్ట్‌గా చేరుకుంది. అక్క‌డ ఆమెకు ఆదిత్య‌(రాహుల్ ర‌వీంద్ర‌న్) ప‌రిచ‌యమవుతాడు. ఆర్‌.కె.పురం ఫ్లై ఓవ‌ర్‌పై రోడ్డు ప్ర‌మాదాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయ‌ని తెలుసుకున్న ర‌చ‌న‌.. దానిపై వివ‌రాలు సేక‌రించి ఓ ఆర్టిక‌ల్ ప్ర‌చురించాల‌నుకుంటుంది. ప్లై ఓవ‌ర్‌పై మ‌ధ్య‌లో కొంద‌రు ఎలాంటి మలుపు లేని ద‌గ్గ‌ర యుట‌ర్న్ తీసుకుంటూ ఉంటారు. అలా ఎందుకు తీసుకుంటారు? అని వివ‌రాలు సేక‌రించి వారి ఇంట‌ర్వ్యూలు ఆధారంగా ఆర్టిక‌ల్ వేయాల‌నుకుంటుంది ర‌చ‌న‌. 
 
అందులో భాగంగా అక్క‌డ యూట‌ర్న్ తీసుకునే వాహ‌నాల నంబ‌ర్స్ నోట్ చేసుకుని.. ఓ వ్య‌క్తి ఇంటికి వెళుతుంది. ర‌చ‌న వెళ్లే స‌మ‌యానికి ఆ వ్య‌క్తి చ‌నిపోయి ఉంటాడు. పోలీసులు ర‌చ‌న‌పై అనుమానంతో కేసు ఫైల్ చేస్తారు. అయితే ఎస్‌.ఐ.నాయ‌క్ మాత్రం ర‌చ‌న నిర్దోషి అని న‌మ్ముతాడు. బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన ర‌చ‌న మ‌ళ్లీ ఫ్లై ఓవ‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి వివ‌రాలు సేక‌రించే క్ర‌మంలో.. ఆమెకు నాయ‌క్ తోడుగా వ‌స్తాడు. వారికి ఓ షాకింగ్ నిజం తెలుస్తుంది. ఫ్లై ఓవ‌ర్‌పై యుట‌ర్న్ తీసుకునే వ్య‌క్తులు చనిపోతుంటారు. అలా ఎందుకు చ‌నిపోతున్నారు? అలా చ‌నిపోవ‌డం వెనుక ఎవ‌రుంటార‌నేదే ప్ర‌ధాన క‌థాంశం. ఈ విషయం తెలియాలంటే కథ చూడాల్సిందే. 
 
సాధారణంగా రోడ్డు ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం నిర్లక్ష్యం. ట్రాఫిక్ రూల్స్‌ను పాటించకపోవడం. రాంగ్ రూట్‌లో డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేయడం. ఇత్యాది కారణాలన్నీ ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఇవికాకుండా మ‌నం చేసే చిన్న త‌ప్పులు కార‌ణంగా ఎదుటివారి ప్రాణాల‌కు ముప్పుతెస్తోంది. అలాంటి ఓ పాయింట్‌ను తీసుకుని ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ కుమార్ ఓ క‌థ‌ను సిద్ధం చేశాడు. ఓ చిన్న పాయింట్‌ని ఆధారంగా చేసుకుని ప్రేక్ష‌కుడిని ఎంగేజ్ చేయ‌డం గొప్ప విష‌యం. ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ కుమార్ ఆ విష‌యంలో స‌క్సెస్ అయ్యారు.
 
ఈయనకు నికేత్ బొమ్మి సినిమాటోగ్ర‌ఫీ.. పూర్ణ చంద్ర బ్యాగ్రౌండ్ స్కోర్‌తో త‌మ వంతు స‌హ‌కారాన్ని అందించారు. న‌టిగా మంచి విజ‌యాల‌ను సాధిస్తున్న స‌మంత మ‌రోసారి త‌నెంటో న‌ట‌న‌తో ప్రూవ్ చేసుకుంది. అలాగే పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో ఆది పినిశెట్టి.. జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో రాహుల్ ర‌వీంద్ర‌న్ ఆక‌ట్టుకున్నారు. భూమిక పాత్ర చిన్న‌దే అయినా.. పాత్ర మేరకు ఆమె చక్క‌గా న‌టించారు. మొత్తంమీద రియల్ లైఫ్‌లోనే కాకుండా, రీల్ లైఫ్‌లో కూడా నాగ చైతన్య, సమంతలు పోటీపడి విజేతలుగా నిలిచారని చెప్పొచ్చు.దీనిపై మరింత చదవండి :