శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 8 సెప్టెంబరు 2018 (16:05 IST)

కథ నచ్చకపోయినా పవన్ కోసం ఓకే చెప్పా : అనూ ఇమ్మాన్యుయేల్

తనకు కథ నచ్చితేనే ఓకే చెపుతాననీ, కానీ, ఒక్క 'అజ్ఞాతవాసి' విషయంలో మాత్రం హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఓకే చెప్పానని మలయాళ బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్ చెప్పుకొచ్చింది.

తనకు కథ నచ్చితేనే ఓకే చెపుతాననీ, కానీ, ఒక్క 'అజ్ఞాతవాసి' విషయంలో మాత్రం హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఓకే చెప్పానని మలయాళ బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్ చెప్పుకొచ్చింది.
 
ఆమె తాజాగా మాట్లాడుతూ, ఏ సినిమా అయినా కథ నచ్చాకే అంగీకరిస్తానని చెప్పారు. అయితే, 'అజ్ఞాతవాసి' చిత్రం కథ విన్న తర్వాత అందులోని తన పాత్ర 'అత్తారింటికి దారేది' సినిమాలో ప్రణీతలా పాత్రలా ఉండదు కదా అని అడిగ్గా, ఇద్దరు నాయికలకు సమాన ప్రాధాన్యత ఉంటుందని మాటిచ్చారని చెప్పారు. 'శైలజా రెడ్డి అల్లుడు', 'గీత గోవిందం', 'నా పేరు సూర్య' ఈ మూడు సినిమా ఒకేసారి నా దగ్గరకు వచ్చాయి. 
 
కానీ, 'గీత గోవిందం' కథ నచ్చినా ఆ సినిమా చేయలేకపోయాను. అప్పటికి 'అర్జున్‌ రెడ్డి' విడుదలకాలేదు. ఇక శైలజారెడ్డి చిత్రంలో నటించడం చాలా సంతృప్తినిచ్చింది. నాగ చైతన్యతో నటించడం బాగుంది. చాలా మంచి వ్యక్తి. సహ నటుడిగా చాలా సౌకర్యంగా అనిపించింది. దర్శకుడు మారుతితో పనిచేయడం కూడా గొప్ప అనుభూతినిచ్చిందని చెప్పారు. 
 
అయితే, రమ్యకృష్ణగారితో నటించేప్పుడు భయమేసింది. మేమిద్దరం కలిసి నటించాల్సిన సన్నివేశాల్లో భయంతో నాకు సంభాషణలు రాకపోయేవి. 'శైలజారెడ్డి అల్లుడు' అన్ని విధాలా ప్రేక్షకులను అలరిస్తుంది. ఇందులో వినోదం, కుటుంబ విలువలు, ప్రేమ అన్నీ ఉన్నాయి. ఇక నాయికగా నేను అన్ని భాషల్లో పేరు తెచ్చుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు. 
 
డేట్స్‌ కుదరకే 'గీత గోవిందం' సినిమా వదలుకున్నాను. కథ బాగుండటం తప్ప అప్పటికీ ఏ అంశంలో చూసినా 'నా పేరు సూర్య', 'శైలజారెడ్డి' ఆసక్తి కలిగించాయి. నా సినిమాలు కొన్ని ఆలస్యంగా విడుదలయ్యాయి. ఇదీ ఓ రకంగా నాకు మంచే చేసిందని చెప్పారు. ఒక సినిమా జయాపజయాలను తాను నియంత్రించలేనని చెప్పారు. ప్రతి సినిమాకూ నటిగా ఎదగాలని మాత్రమే ఆలోచిస్తానని తెలిపింది.