అభిమాన సామ్రాజ్య సార్వభౌముడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు : పరుచూరి

తెలుగు చిత్ర పరిశ్రమలో దిగ్గజ కథా, మాటల రచయితలుగా ఉన్న వారు పరుచూరి బ్రదర్స్. వీరిలో పరుచూరి గోపాలకృష్ణ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇదే అంశంపై ఆయన ట్విటర్‌లో ఓ ట్వీట్ చే

paruchuri gopalakrishna
pnr| Last Updated: ఆదివారం, 2 సెప్టెంబరు 2018 (14:23 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో దిగ్గజ కథా, మాటల రచయితలుగా ఉన్న వారు పరుచూరి బ్రదర్స్. వీరిలో పరుచూరి గోపాలకృష్ణ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇదే అంశంపై ఆయన ట్విటర్‌లో ఓ ట్వీట్ చేశారు.

"తారాలోకాన్ని ఏలుతూ, అభిమాన సామ్రాజ్యానికి సార్వభౌముడిగా ఉంటూ, ఇంకా ఎన్నో వసంతాల సినీ జీవితం తన కోసం యెర్ర పరదా పేర్చి ఎదురుచూస్తున్నా, కాదనుకొని, పేదవాళ్లకు అండగా నిలవడానికి అభ్యుదయవాదులతో కలిసిముందడుగు వేస్తున్న పవన్ కళ్యాణ్‌గారికి జన్మదిన శుభాకాంక్షలు... సంకల్ప సిద్ధిరస్తు అంటూ గోపాలకృష్ణ తన ట్వీట్‌లతో పేర్కొన్నారు.దీనిపై మరింత చదవండి :