శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : బుధవారం, 5 సెప్టెంబరు 2018 (12:40 IST)

అంజలిని దురదృష్టం వెంటాడుతుందా?

''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'' ఫేమ్ అంజలికి దురదృష్టం వెంటాడుతోంది. సినీ ఆఫర్లు అంతంత మాత్రంగానే వుండటంతో ఆమె పారితోషికం బాగా తగ్గించేసిందని టాక్ వస్తోంది. గీతాంజలి వంటి చిన్న చిత్రం పెద్ద విజయా

''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'' ఫేమ్ అంజలికి దురదృష్టం వెంటాడుతోంది. సినీ ఆఫర్లు అంతంత మాత్రంగానే వుండటంతో ఆమె పారితోషికం బాగా తగ్గించేసిందని టాక్ వస్తోంది. గీతాంజలి వంటి చిన్న చిత్రం పెద్ద విజయాన్ని సాధించినా అంజలికి ఆఫర్లు రావట్లేదు. కోలీవుడ్‌లోనూ అంజలికి అదే పరిస్థితి. దీంతో అవకాశాల కోసం పారితోషికాన్ని బాగా తగ్గించిందట. 
 
ఇటీవల తెలుగులో ఓ సినిమాను కేవలం రూ. 60 లక్షలకు చేయడానికి అంజలి అంగీకరించినట్లు తెలుస్తోంది. కొత్తగా వచ్చిన హీరోయిన్లే ఒక్కో సినిమాకూ రూ.60లక్షలు తీసుకుంటున్నారు. అలాంటిది అంజలి అంతగా తగ్గించి తీసుకోవడం వెనుక అసలు కారణం ఆఫర్లేనని సినీ పండితులు అంటున్నారు. పారితోషికం తగ్గించుకుని మంచి ఆఫర్లు చేతిలో పెట్టుకుంటే.. హిట్ వచ్చాక పారితోషికం డిమాండ్ చేయవచ్చునని అంజలి భావిస్తోంది.