గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: సోమవారం, 23 మార్చి 2015 (21:32 IST)

సాయిధరమ్ తేజకు ఆ పవర్ చాలా ఎక్కువ... : శ్రద్దాదాస్‌

గ్లామర్‌ పాత్రలు పోషించే శ్రద్దాదాస్‌ తాజాగా తాను నటించిన 'రేయ్‌' చిత్రంలో గ్లామర్‌తో పాటు ఏక్షన్‌ కూడా చేశాననీ, పాప్‌ సింగర్‌గా కన్పిస్తానని అంటోంది. అభిమానులకు కనులవిందుగా పాత్ర వుంటుందని చెబుతుంది. సాయిధరమ్‌తేజ్‌ హీరోగా, సయామీ ఖేర్‌ హీరోయిన్‌గా బొమ్మరిల్లు పతాకంపై వై.వి.యస్‌.చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'రేయ్‌'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 27న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ..
 
గ్లామర్‌ పాత్ర అంటున్నారు. ఎలా వుంటుంది? 
నేను చాలాకాలం తర్వాత మంచి రోల్‌ చేశాను. ఒక నెగెటివ్‌ క్యారెక్టర్‌. గ్లామర్‌తో పాటు ఎంతో పవర్‌ఫుల్‌గా వుండే క్యారెక్టర్‌. హీరో, హీరోయిన్ల క్యారెక్టర్లకు సమానంగా వుంటుంది. ఫుల్‌లెంగ్త్‌, ఫుల్‌ప్లెడ్జెడ్‌గా వుండే క్యారెక్టర్‌ నాకు దర్శకుడు ఇచ్చారు. ఇందులో మెక్సికన్‌ అమెరికా పాప్‌స్టార్‌గా చేశాను. ఇందులో కాంపిటీషన్స్‌ వుంటాయి కాబట్టి హెవీగా డాన్స్‌ చెయ్యాల్సిన క్యారెక్టర్‌ నాది. మూడు సంవత్సరాలు వరసగా పాప్‌స్టార్‌గా వుండే ఒక అమ్మాయి. తను తప్ప ఎవరూ గెలవకూడదన్న ఆలోచనతో వుండే ఒక అమ్మాయి. హీరో, రీబాండ్‌ గ్రూప్‌ టైటిల్‌ గెలవకుండా ఎలా అడ్డుపడుతుంది అనేది కథ.
 
డాన్స్‌ చేశారా? 
బ్రహ్మాండంగా... డాన్స్‌కూడా నా చేత చేయించారు. హీరోకు ధీటుగా వుంటుంది. పాప్‌ స్టార్‌లు ఎలా వ్రవర్తిస్తారో అలా చూసి నేర్చుకున్నాను. దానికి టైం పట్టింది. 
 
మీ కాస్ట్యూమ్స్‌కే బాగా ఖర్చుపెట్టారట? 
అవును. పాత్ర కోసం నాకు 250 నుంచి 300 వరకు కాస్ట్యూమ్స్‌ వాడారు. ఒక కాస్ట్యూమ్‌ని నాలుగు సార్లు అమెరికా నుంచి తెప్పించాల్సి వచ్చింది. ప్రతి సీన్‌లో డిఫరెంట్‌ హెయిర్‌ స్టైల్‌ వుంటుంది. అలాగే డిఫరెంట్‌ మేకప్‌ వుంటుంది. ఇంతకుముందు అలాంటి హెయిర్‌ స్టైల్‌, మేకప్‌ చూసి వుండరు. వై.వి.యస్‌.గారికి కాస్ట్యూమ్‌ నచ్చకపోతే ప్యాకప్‌ చెప్పేస్తారు. క్యారెక్టర్‌ పర్‌ఫెక్ట్‌గా కనిపించాలంటే కాస్ట్యూమ్‌ కూడా పర్‌ఫెక్ట్‌గా వుండాలంటారు.
 
పాప్‌స్టార్స్‌ సన్నగా వుంటారు కదా? 
అందుకే.. నన్ను బాగా తగ్గమని వైవిఎస్‌ చౌదరి చెప్పారు. అందుక ప్రిపేర్‌కూడా అయ్యాను. ఈ క్యారెక్టర్‌ చెయ్యడానికి చాలా కష్టపడ్డాను. మొదటి షెడ్యూల్‌ 30 రోజులు బ్యాంకాక్‌లో చేశాం. ఈ షెడ్యూల్‌లో నా కంటికి గాయం అయింది. దాంతో వై.వి.యస్‌.గారు ఇండియా వెళ్ళి రెస్ట్‌ తీసుకోమన్నారు. అలాగే ఈ క్యారెక్టర్‌ కోసం బాగా వెయిట్‌ తగ్గమని చెప్పారు. సినిమా స్టార్ట్‌ అవ్వడానికి రెండు నెలల ముందు నుంచే బాయిల్డ్‌ వెజిటిబుల్స్‌ పెట్టేవారు. అలాగే బాయిల్డ్‌ చికెన్‌ తిని, జ్యూస్‌ తాగుతూ నెలరోజులు వున్నాను. బ్యాంకాక్‌ షెడ్యూల్‌లో చేసిన సీన్స్‌లో నేను చాలా ఫిట్‌గా కనిపిస్తాను. నిజం చెప్పాలంటే నేను రియల్‌ లైఫ్‌లో డైటింగ్‌ చెయ్యను, ఎక్సర్‌సైజ్‌లు చెయ్యను.
 
ఈ పాత్రతో సినిమా కెరీర్‌ ఎలా వుండబోతుందనుకుంటున్నారు? 
జనరల్‌గా హీరోయిన్స్‌కి హీరోతో డాన్స్‌ చేసే క్యారెక్టర్సే వస్తుంటాయి. కానీ, ఈ సినిమాలో వై.వి.యస్‌.గారు చాలా మంచి క్యారెక్టర్‌ ఇచ్చారు. ఇలాంటి అవకాశం అందరికీ దొరకదు. ఈ సినిమా తర్వాత డెఫినెట్‌గా నాకు ఇలాంటి క్యారెక్టర్లు వస్తాయని ఆశిస్తున్నాను. హీరోయిన్‌ కెరీర్‌ ఇక్కడ ఐదారు సంవత్సరాల కంటే ఎక్కువ వుండదు. ఈ సినిమాలో నేను చేసిన విలన్‌ క్యారెక్టర్‌ వల్ల ఇంకా ఎక్కువ రేంజ్‌ వున్న క్యారెక్టర్స్‌ వస్తాయని, ఎక్కువ సంవత్సరాలు నటిగా కొనసాగుతున్నానన్న నమ్మకం కలుగుతోంది. 
 
నేను పోలీస్‌ క్యారెక్టర్‌ చెయ్యగలను. చాలా మంది చెయ్యలేని పాత్రలను నేను చెయ్యగలను అనుకుంటున్నాను. వారికి అలాంటి క్యారెక్టర్స్‌ చేసే అవకాశం రాకపోవచ్చు. నేను యాక్షన్‌ మూవీస్‌ కూడా చెయ్యగలను. ఎందుకంటే ఐదు సంవత్సరాలు కిక్‌ బాక్సింగ్‌ నేర్చుకున్నాను. హీరోకి సమానమైన పెర్‌ఫార్మెన్స్‌ ఇవ్వగలను. 
 
పాప్‌స్టార్‌గా ప్రేరణ ఎవరైనా వున్నారా? 
వై.వి.యస్‌.గారు నాకు జెన్నిఫర్‌ లోపెజ్‌, బ్రిట్నీ స్ఫియర్స్‌ల గురించి చెప్పారు. అయితే వారు చాలా సాఫ్ట్‌గా మాట్లాడతారు. కానీ, ఇది తెలుగు ఆడియన్స్‌ కోసం చేస్తున్న సినిమా కాబట్టి కాస్త పెద్దగా మాట్లాడాల్సిన అవసరం వుందని చెప్పారు. 
 
సాయిధరమ్‌తేజ్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఎలా అనిపించింది? 
అతనికి తొలి సినిమా. నేను అప్పటికే సినిమాలు చేసి వున్నాను. అయితే జనరల్‌గా కొత్తవారు టేక్స్‌ ఎక్కువ తీసుకుంటారు. సాయిధరమ్‌ విషయంలో కూడా అలాగే జరిగింది. అయితే సినిమా స్టార్ట్‌ అయినపుడు ఐదు టేక్స్‌ తీసుకుంటే షెడ్యూల్‌ జరుగుతుండగా ఆ టేక్స్‌ సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఈ విషయంలో వై.వి.యస్‌.గారు చాలా ఓపికగా చేసేవారు. నాలుగైదు సినిమాలు చేసిన తర్వాత అనుభవంతో టేక్స్‌ తగ్గుతాయి. కానీ, సాయిధరమ్‌కి గ్రాస్పింగ్‌ పవర్‌ ఎక్కువ. దాంతో సినిమా కంప్లీట్‌ అయ్యేలోపు యాక్టింగ్‌లో పర్‌ఫెక్ట్‌ అయిపోయారు. అతని డాన్స్‌ చాలా బాగుంటుంది.
 
మాస్‌ పాత్ర అంటున్నారు. అరేయ్‌, ఒరేయ్‌ అంటూ మాట్లాడతారా? 
ఫుల్‌గా... నేను చాలా ఏరగెంట్‌గా వుంటాను. ఎవర్నీ లెక్కచేయను. చాలా ఇగో వున్న పాత్ర.. అరే, ఒరేయ్‌.. అంటూ మాస్‌ పలికే డైలాగ్స్‌లు సినిమాలో కన్పిస్తాయి.
 
మీ తదుపరి చిత్రాలు? 
ఈ సినిమా తర్వాత నాకు లెంగ్తీ రోల్స్‌ వస్తాయని ఆశిస్తున్నాను. ప్రస్తుతం హిందీలో సచిన్‌ జోషితో 'హాంటింగ్‌ ఆఫ్‌ బాంబే మిల్స్‌' చేస్తున్నాను' అన్నారు.