శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: శుక్రవారం, 31 జులై 2015 (22:37 IST)

నాన్న ఎంట్రెన్స్ వరకే... ఆ తర్వాత అంతా నా టాలెంటే...: శ్రుతి హాసన్‌ ఇంటర్వ్యూ

సినిమా పరిశ్రమలో బ్యాక్‌బోన్లు( కమల్ హాసన్).. ప్రవేశం వరకే వుపయోగపడతాయి. కానీ ఆ తర్వాత.. నిలబెట్టేది ప్రతిభేనని నా ఫీలింగ్‌. నేను మొదట్లో వచ్చినప్పుడు సినిమాలు ప్లాప్‌ అయ్యాయి. ఐరన్‌ లెగ్‌ అన్నారు. తర్వాత గ్యాప్‌ తీసుకున్నా. ఒక సినిమా చేశా. హిట్‌ అయింది. దాంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇలా ఎలా జరిగిందనేది నాకే తెలీదు. అంతా దైవ నిర్ణయమే అని శ్రుతిహాసన్‌ తేల్చి చెప్పింది. 'శ్రీమంతుడు'లో మహేష్‌ బాబు సరసన నటించింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వై.నవీన్‌, వై.రవిశంకర్‌, సి.వి.మోహన్‌ సంయుక్తంగా నిర్మించారు. ఆగస్టు 7న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ శ్రుతి హాసన్‌తో ఇంటర్వ్యూ విశేషాలు.
 
'శ్రీమంతుడు'లో ఏ తరహా పాత్ర మీది?
పాత్ర పేరు చారుశీల. చాలా బోల్డ్‌గా వుంటాను. బాగా మెచ్చూర్డ్‌ పర్సన్‌. దర్శకుడు పాత్రను బాగా డిజైన్‌ చేసారు. నేను ఏ సినిమాలో ఇప్పటివరకు ఇలాంటి పాత్రలో కనిపించలేదు. చాలా డిఫరెంట్‌‌గా ఉంటుంది. 
 
మహేష్‌ బాబుతో నటించడం ఎలా అనిపించింది?
'ఆగడు' సినిమాలో ఆయనతో ఐటెం సాంగ్‌లో నటించాను. మొదటిసారి ఆయనతో ఫుల్‌ లెంగ్త్ ఉండే పాత్రలో నటించాను. సినిమాల పట్ల కమిట్మెంట్‌ ఉన్న వ్యక్తి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం గలవారు. ఇండస్ట్రీలో టాప్‌ హీరో అనే భేషజం లేదు. సెట్స్‌లో చాలా క్రమశిక్షణగా ఉంటారు. అందుకే ఈ రోజు ఆయన ఈ స్థాయిలో ఉన్నారు. అలానే జగపతి బాబు, సుకన్య వంటి సీనియర్‌ యాక్టర్స్‌తో నటించాను. సెట్స్‌లో వారితో ఫ్రెండ్లీ నేచర్‌ ఉండేది. వారి నుంచి చాలా నేర్చుకున్నాను.
 
ఆడియోలో మీకు నచ్చిన పాట ఏమిటి? 
దేవి మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. నాకు 'జత కలిసే' సాంగ్‌ చాలా నచ్చింది. పిక్చరైజేషన్‌ కూడా బావుంటుంది. సినిమా చూసినప్పుడు ఆడియన్స్‌‌కు సాంగ్స్‌ ఇంకా బాగా నచ్చుతాయి. సినిమాలో రొమాన్స్‌ను కూడా డిఫరెంట్‌‌గా చూపించారు. 
 
మీరుంటే సినిమాలు హిట్టే అంటున్నారు? 
అలా ఎందుకంటారో అర్థంకాదు. ఐరన్‌, సిల్వర్‌, గోల్డెన్‌ అనే పదాలు జ్యూవలరీ వ్యాపారానికి సంబంధించినవి. ఇది సినిమా.   మొదట్లో నేను నటించిన చిత్రాలు కొన్ని ఫ్లాప్స్‌‌గా నిలిచాయి. కాని ఇప్పుడు హిట్స్‌ రావడంతో అందరూ గోల్డెన్‌ లెగ్‌ అంటున్నారు. నాకు ఫ్లాప్స్‌ వచ్చినపుడు ఎలా నటించానో ఇప్పుడు కూడా అలానే నటిస్తున్నాను. నా నటనలో ఎలాంటి మార్పు లేదు. ప్రేక్షకులు చూసే దృష్టిలో మార్పుంది. దేవుడి అనుగ్రహం వలన తెలుగు ప్రేక్షకులు నన్ను బాగా ఆదరిస్తున్నారు.
 
నాన్నగారు మీకు సూచనలు ఇస్తారా? 
నా సినిమాల విషయంలో నాన్నగారు కలుగజేసుకోరు. నువ్వు నటించే సినిమా నీ ఇష్టం నీ లైఫ్‌ అని మాత్రమే చెప్తారు. ప్రతి ఆర్టిస్ట్‌ జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. నాన్నగారు ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారంటే ఆయనే కష్టమే దానికి కారణం. ఆయన కూతురిని కాబట్టి ఇండస్ట్రీలోకి రావడం నాకు సుళువే. కాని ఇక్కడకి వచ్చిన తరువాత మన టాలెంట్‌ మీదే కెరీర్‌ ఆధారపడి ఉంటుంది. ఫేమ్‌ ఈరోజు ఉంటుంది. రేపు పోతుంది. కాని మన వర్క్‌ మనతోనే ఉంటుంది. పనిని నమ్ముకుంటే ఏదైనా సాధించొచ్చు. 
 
సింగర్‌‌గా, నటిగా సినిమాల్లో పని చేసారు. డైరెక్టర్‌గా మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా..? 
దర్శకత్వం మీద నాకు అంత ఆసక్తి లేదు. ఇంట్రెస్ట్‌ లేదని కాదు కాని అది చాలా పెద్ద బాధ్యత. అది హ్యాండిల్‌ చేయడం నా వల్ల కాదు.
 
కథల విషయంలో జాగ్రత్తలు ఏవిధంగా తీసుకుంటారు? 
నేను చేసే ప్రతి పాత్ర భిన్నంగా ఉండాలనుకుంటాను. బ్యాక్‌ టు బ్యాక్‌ ఒకేలాంటి పాత్రల్లో నటించడం నచ్చదు. అలాంటి రోల్స్‌ చేసినా ప్రేక్షకులు బోర్‌ ఫీల్‌ అవుతారు కాబట్టి సినిమా సినిమాకు నా రోల్‌ డిఫరెంట్‌‌గా ఉండేలా చూసుకుంటాను. రేసుగుర్రంలో ఫన్‌ క్యారెక్టర్‌ చేసాను. ఈ సినిమా విషయానికొస్తే కంప్లీట్‌ డిఫరెంట్‌‌గా ఉండే రోల్‌‌లో నటించాను. యూనిక్‌ సబ్జెక్టు ఇది.
 
ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు? 
టివి చూస్తాను. బాగా తింటాను. స్నేహితులను కలుస్తుంటాను. పుస్తకాలు ఎప్పుడు చదువుతూనే ఉంటాను అంటూ తెలిపారు.