శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: శుక్రవారం, 14 అక్టోబరు 2016 (19:51 IST)

శ్రుతి హాసన్ అంతమాట అనేసిందేమిటి...? శ్రుతితో ముఖాముఖి

కమల్‌ హాసన్‌ కుమార్తెగా సినీ రంగంలో ప్రవేశించిన శ్రుతి హాసన్‌ తక్కువ కాలంలోనే నటిగా పేరు తెచ్చుకుంది. కెరీర్‌ ఆరంభంలో ఐరన్‌ లెగ్‌గా వున్న ఆమె 'గబ్బర్‌ సింగ్‌' చిత్రంతో ఒక్కసారిగా గోల్డెన్‌ లెగ్‌ అయిపోయింది. ఇప్పుడు రెండోసారి పవన్‌తో కలిసి నటించడానికి

కమల్‌ హాసన్‌ కుమార్తెగా సినీ రంగంలో ప్రవేశించిన శ్రుతి హాసన్‌ తక్కువ కాలంలోనే నటిగా పేరు తెచ్చుకుంది. కెరీర్‌ ఆరంభంలో ఐరన్‌ లెగ్‌గా వున్న ఆమె 'గబ్బర్‌ సింగ్‌' చిత్రంతో ఒక్కసారిగా గోల్డెన్‌ లెగ్‌ అయిపోయింది. ఇప్పుడు రెండోసారి పవన్‌తో కలిసి నటించడానికి సిద్ధమైంది. ఇలా చేయడం గౌరవంగా భావిస్తున్నానని చెబుతోంది. ఇటీవలే నాగచైతన్యతో 'ప్రేమమ్‌'లో నటించింది. ప్రమోషన్‌లో భాగంగా ఆమె హైదరాబాద్‌ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ..
 
తండ్రి నుంచి ఏం నేర్చుకున్నారు?
కమల్‌హాసన్‌ నా తండ్రి అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నా. ఆయన ఆల్‌రౌండర్‌. ఎన్నో ప్రయోగాలు చేశారు. ఆయనే నాకు ప్రేరణ. ఆయన దారిలో ఏదైనా ఛాలెంజ్‌గా స్వీకరిస్తా. నటిగా.. గాయనిగా, రచయితగా ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా వున్నా.
 
ప్రేమమ్‌ ఎలాంటి స్పందన వచ్చింది.  
'ప్రేమమ్‌' లాంటి ప్రేమకథ చిత్రంలో నటించడం చాలా ఆనందంగా వుంది. నేను పోషించిన సితార పాత్రకు ప్రేక్షకులు వంద మార్కులు వేశారు. లెక్చరర్‌గా నటించాను. ఆ ట్రాక్‌ చాలా సరదాగా వుంటుంది.
 
రియల్‌ లైఫ్‌లో ఎవరినైనా ప్రేమించారా?
లేదు. ఇంకా ఎవరినీ ప్రేమించలేదు. అలాగే పెళ్లి ఆలోచన కూడా ఇప్పటిలో లేదు.
 
సినిమా సక్సెస్‌కు ఏది కొలమానం?
ఓ మంచి కథలో కామెడీ, ట్రాజెడీ, ఫైట్స్‌ లాంటి ఎమోషన్స్‌ వుంటే తప్పకుండా విజయవంతమవుతుంది.
 
ప్రేక్షకులు ఆలోచనలు ఎలా వున్నాయంటారు?
ప్రేక్షకులు ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటున్నారు. వాళ్ళకు నచ్చిన విధంగా చేయడమే నా పని. ప్రేక్షకులు కామెడీనా? యాక్షనా! ఎంటర్‌టైనరా అని ఆలోచించరు. అందుకే కథ నచ్చితే నేను ఒప్పుకుంటాను.
 
ఇంకా ఎలాంటి పాత్రలు చేయాలనుంది?
ప్రేమకథలు, హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేయాలనే కోరిక వుంది.
 
పవన్‌తో నటించడం ఎలా అనిపిస్తుంది?
'కాటమరాయుడు' చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌తో నటించడం రెండోసారి. నా పాత్ర గురించి ఇప్పడే చెప్పలేను. చాలా సింపుల్‌గా వుండే పాత్ర అది. రెండోసారి నటించడం గౌరవంగా భావిస్తున్నాను. 
 
గాయకురాలిగా ఎంతవరకు మీ జర్నీ వచ్చింది?
నటనతోపాటు గాయకురాలిగా పాటలు పాడదామనుకుంటున్నా. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో బిజీగా ఉన్నా.. పాటలు మాత్రం వదలను. అలాగే ముందుముందు రచనవైపే దృష్టి పెడతా.
 
మూడు భాషల్లో నటించడం కష్టంగా లేదా?
ఒకేసారి మూడు భాషల్లో నటించడం కష్టమే అయినా.. అన్ని భాషలు నేర్చుకుంటుంటే కాలేజీ ఫిజిక్స్‌ పాఠాలు గుర్తుకు వస్తున్నాయి.
 
మళ్ళీ సూర్యతో నటిస్తున్నారా?
సెవెంత్‌ సెన్స్‌ తర్వాత మరో సినిమాలో నటిస్తున్నాను. తెలుగులో కూడా మరో సినిమా చేయబోతున్నా. వివరాలు త్వరలో చెబుతాను అని చెప్పారు.