Widgets Magazine

'మహాభారతం'లో కర్ణుడి పాత్ర చేయమని అడిగారు : నాగార్జున ఇంటర్వ్యూ

మంగళవారం, 23 మే 2017 (15:46 IST)

Widgets Magazine

నాగ చైతన్య, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన 'రాండోయ్‌ వేడుక చూద్దాం' చిత్రం ఈ నెల 26న రిలీజ్‌ కానుంది. ఈ సందర్బంగా నిర్మాత అక్కినేని నాగార్జున చెప్పిన విశేషాలు.
Nagarjuna
 
సినిమా ఎలా వచ్చింది ?
ఎడిటింగ్‌ సమయంలో ఇప్పటికి 100 సార్లు చూసుంటాను. సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్సుకి మంచి ట్రీట్‌ అవుతుంది. ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేశారు. విడుదలైన ప్రతిచోటా చిత్రం మంచి విజయం అందుకుంటుందని చాలా నమ్మకంగా ఉన్నాను.
 
ఈ సినిమాకి కళ్యాణ్‌ కృష్ణనే ఎందుకు ఎంచుకున్నారు?
తను మంచి టెక్నీషియన్‌. ఆడియన్స్‌ పల్స్‌ బాగా తెలిసిన వ్యక్తి. 'సోగ్గాడే చిన్ని నాయన' తర్వాత ఈ కథకు అతనైతేనే బాగుంటుందని అనుకున్నాను. అలాగే అతనితో మూడు సినిమాల కాంట్రాక్ట్‌ కూడా ఉంది. కాబట్టి అతనే నా చాయిస్‌ అయ్యాడు.
 
కుటుంబ కథా చిత్రాన్ని చైతన్య ముందుకు తీసుకెళ్లగలడా?
చైతన్యకు తన సినిమాల పట్ల ఒక భిన్నమైన అవగాహన ఉంది. అందుకే అతన్ని కూర్చోబెట్టి ఇలాంటి సినిమా చేస్తేనే అందరూ ఇష్టపడతారని చెప్పాను. అతను కూడా నన్ను నమ్మి చాలా బాగా చేశాడు. కెమెరా ముందు బాగా నటించాడు. రిలీజ్‌ తర్వాత అతనో పెద్ద స్టార్‌ అవ్వడం ఖాయం.
 
దేవి సంగీతం ఎలా వుంది?
దేవి నాకు చాలా కాలంగా తెలుసు. నా సినిమాలకు కూడా మంచి సంగీతం ఇచ్చాడు. ఇప్పుడు 'రారండోయ్‌' చిత్రానికి కూడా అలాగే చేశాడు. అతనికి మంచి అనుభవం ఉంది. అందుకే ఎడిటింగ్‌ టేబుల్‌ వద్ద కూర్చోబెట్టి సన్నివేశాల్లో, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌లో చేంజెస్‌ ఏమైనా చేయాలా! అని అడిగాను. అతను కష్టపడి పనిచేసే వ్యక్తి. అందుకే తన కొన్నేళ్లుగా పొజిషన్లో ఉన్నాడు.
 
చలపతిరావ్‌ కామెంట్స్‌ పైన మీ అభిప్రాయం?
పూర్తిగా ఖండిస్తున్నాను. ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు చేసినా ఇలానే అంటాను. వినడానికి అసభ్యంగా ఉండే వ్యాఖ్యలను ప్రోత్సహించకూడదు.
 
రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటన ఎలా ఉంది?
ఇందులో కొత్త రకుల్‌ని చూస్తారు. సినిమాలో ఆమె నటన అందరినీ మెప్పిస్తుంది.
 
సినిమాని డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నట్టున్నారు?
సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాను. అందుకే నైజాం, వైజాగ్‌, కృష్ణా ఏరియాల్లో డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నాను. ఒకసారి సినిమా బాగా వచ్చిందని తెలిస్తే డిస్ట్రిబ్యూట్‌ చేసే ఛాన్స్‌ ఎందుకు వదులుకుంటాను.
 
మలయాళ మహాభారతం చేయబోతున్నారని విన్నాం?
నిర్మాతలు కర్ణుడి పాత్రని చేయమని అడిగారు. దీని గురించి ఇప్పుడు మాట్లాడటం కన్నా ఒకసారి సినిమా అంతా ఫైనల్‌ అయ్యాక మాట్లాడటం మంచిది.
 
మీ ఇద్దరి అబ్బాయిల్లో నిర్మాత అవ్వాలనే ఉద్దేశ్యం ఎవరిలో బలంగా ఉంది?
ప్రస్తుతానికైతే ఇద్దరినీ తన కెరియర్లపై దృష్టి పెట్టమని అలాగే వాటి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్ని కూడా గమనిస్తుండమని చెప్పాను.
 
మీ తర్వాతి సినిమాల గురించి చెప్పండి?
రాజుగారి గది2 అవుట్‌‌పుట్‌ చూసి మళ్ళీ 10 రోజుల రీషూట్‌ చేయమని చెప్పాను. ఇంకా కొన్ని స్క్రిప్ట్స్‌ వింటున్నాను. కొన్ని సైన్‌ చేసే ఉద్దేశ్యంలో ఉన్నాను అని తెలిపారు
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Nagachaitanya Akkineni Nagarjuna Chalapathi Rao Karna Role Rarandoi Veduka Chuddam

Loading comments ...

తెలుగు సినిమా

news

'బాహుబలి 3' ఉంటుందా? ఉండదా? నిర్మాత శోభు యార్లగడ్డ ట్వీట్లో ఏమన్నారు?

'బాహుబలి పార్ట్ 3' ఉంటుందా? ఉండదా? ఇదే దేశవ్యాప్తంగా సాగుతున్న ఆసక్తికర చర్చ. ఈ విషయంపై ...

news

'అనుష్క తొడ' నుంచి 'అమ్మాయిలు పక్కలోకి పనికొస్తారు' వరకూ... యాంకర్లే కారణమా?

ఆడియో వేడుకలు అనగానే కొంతమంది నటులు పారిపోవాల్సిన పరిస్థితో... లేదంటే నోటికి తాళాలు ...

news

చలపతిరావు వయసు తగినట్టుగా ప్రవర్తిస్తే బాగుంటుంది : రకుల్ ప్రీత్ సింగ్

టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు వయసుకు తగినట్టుగా నడుచుకుంటే మంచిదని హీరోయిన్ రకుల్ ...

news

అమ్మాయిలు పక్కలోకి పనికొస్తారుపై రచ్చ : ఆ యాంకర్ కాళ్లు విరగ్గొడతామంటున్న మహిళలు.. ఎందుకు?

బుల్లితెర నటుడు, యాంకర్ రవిపై మహిళా సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. తమ కంటికి కనిపిస్తే ...