Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఐపీఎల్ 2017 : హైదరాబాద్ వేదికగా ఫైనల్... ముంబై ఇండియన్స్ వర్సెస్ రైజింగ్ పూణె

Widgets Magazine
uppal stadium

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో అంచె పోటీల్లో భాగంగా ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. హైదరాబాద్, ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌‌కు వేదికకానుంది. ఈ మ్యాచ్‌ కోసం విక్రయానికి ఉంచిన టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అలాగే మ్యాచ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 
 
దీనిపై హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తొలిసారి హైదరాబాద్‌లో జరుగుతోన్న ఫైనల్ మ్యాచ్‌కు 1800 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్టేడియం చుట్టూ 88 సీసీ టీవీలు ఏర్పాటు చేశామన్నారు. 'టెక్నాలజీతో భద్రతను పర్యవేక్షిస్తాం. మహిళల భద్రత కోసం ప్రత్యేక షీ టీంలు, యాంటీ ఈవ్ టీజింగ్ టీంలను ఏర్పాటు చేస్తున్నాం' అని చెప్పారు. 
 
సిగరెట్స్, లైట్స్, బయట తిను బండారాలు, వాటర్ బాటిల్స్‌కు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. చిన్న పిల్లల భద్రతకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటామన్నారు. స్టేడియం లోపల తినుబండారాలను నిర్ణయించిన రేట్లకే అమ్మాలని, రేట్ల పర్యవేక్షణకు సూపర్ వైజింగ్ ఉంటోందని హెచ్చరించారు. ఒక్కసారి లోపలకి వస్తే మ్యాచ్ ముగిసే వరకూ బయటకు వెళ్ళలేరని వీక్షకులకు చెప్పామని అన్నారు.
 
ఇదిలావుండగా, క్వాలిఫయర్‌-1లో పుణె చేతిలో చిత్తయినా మలి ప్రయత్నంలో మాత్రం అదిరిపోయే ఆటతో ముంబై ఇండియన్స్ జట్టు ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకుంది. క్వాలిఫయర్‌-2లో అత్యద్భుత బౌలింగ్‌తో కోల్‌కతాను మట్టికరిపించింది..! ఆ జట్టుపై తన ట్రాక్‌ రికార్డును మరింత మెరుగు పరుచుకుంటూ.. పుణెకు హెచ్చరికలు పంపుతూ భాగ్యనగరంలో అంతిమ సమరానికి దూసుకొచ్చింది..! ఈ సీజన్‌లో తనను మూడు సార్లు ఓడించిన సూపర్‌జెయింట్‌తో ఆదివారం అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది..! 
 
ఐపీఎల్‌లో ముంబై ఫైనల్‌ చేరడం ఇది నాలుగోసారి. దాంతో, టోర్నీలో అత్యధిక ఫైనల్స్‌ ఆడిన రెండో జట్టుగా నిలవనుంది. 2010లో రన్నరప్‌గా నిలిచిన ఆ జట్టు, 2013, 2015లో టైటిల్‌ నెగ్గింది. చెన్నై ఆరు సార్లు ఫైనల్స్‌ ఆడింది Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

చాంపియన్స్ ట్రోఫీ భారత్‌ను చిత్తుగా ఓడిస్తాం : ఇంజమామ్ ప్రగల్భాలు

చాంపియన్స్ ట్రోఫీ భారత్‌ను చిత్తుగా ఓడిస్తామని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ హక్ ...

news

ఐపీఎల్‌10 సీజన్‌లో చరిత్ర పునరావృతం.. తలవంచిన నైట్ రైడర్స్, ఫైనల్లో ముంబై ఇండియన్స్

ఐపీఎల్‌లో చరిత్ర పునరావృతమైంది. భారత-పాకిస్తాన్ మధ్య ప్రపంచ స్థాయి టోర్నీల్లో విజయం ...

news

క్రికెటర్ భువనేశ్వర్ ప్రేమలో పడ్డాడట.. 'వంకాయ ఫ్రై' హీరోయిన్‌తో తిరుగుతున్నాడా?

భారత జట్టు క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ ప్రేమలో పడినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. 'వంకాయ ...

news

స్మిత్ మా కెప్టెన్ అయినా.. ధోనీనే అత్యుత్తమ సారథి.. దటీజ్ ధోనీ.. బెన్‌స్టోక్స్ ట్వీట్..

మహేంద్ర సింగ్ ధోనీకి కూల్ కెప్టెన్ అనే పేరుంది. నిండు కుండ తొణకదు అన్నట్లు.. ధోనీకి ఎంత ...

Widgets Magazine