బుధవారం, 8 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2017
Written By pnr

విదేశీ ఆటగాళ్ళ బాధ్యతారహిత్యం వల్లే ఓడాం : వీరేంద్ర సెహ్వాగ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు ఆటగాళ్లపై ఆ జట్టు క్రికెట్‌ వ్యవహారాల డైరెక్టర్‌, భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ టోర్నీలో కేవలం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు ఆటగాళ్లపై ఆ జట్టు క్రికెట్‌ వ్యవహారాల డైరెక్టర్‌, భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ టోర్నీలో కేవలం విదేశీ ఆటగాళ్ల బాధ్యారాహిత్యం వల్లే ప్లేఆఫ్ చేరలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
‘‘పంజాబ్‌ ఆటతీరు నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. విదేశీ ఆటగాళ్లలో ఒక్కరూ బాధ్యత తీసుకోలేదు. ప్రధాన ఆటగాళ్లలో ఏఒక్కరు సరిగ్గా ఆడలేదు. నలుగురు కీలక ఆటగాళ్లలో కనీసం ఒక్కరైనా 12-15 ఓవర్లు వరకు క్రీజులో నిలబడాలి. కానీ ఎవరూ ఆబాధ్యత తీసుకోలేదన్నారు. 
 
పిచ్‌ మందకొడిగా ఉందని చెప్పడం సమంజసం కాదు. జట్టు కోసం కనీసం 20 ఓవర్లైనా నిలవలేరా? జట్టులో ప్రధాన ఆటగాళ్లు, అనుభవజ్ఞులైన మాక్స్‌వెల్‌, షాన్‌ మార్ష్‌, మోర్గాన్‌లు తమ స్థాయికి తగ్గట్టు ఆడలేదు. వారి ఆటతీరు నన్ను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు.