బుధవారం, 8 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2017
Written By pnr

ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్ మలింగ ఖాతాలో అరుదైన ఫీట్‌

స్వదేశంలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముంబై ఇండియన్స్‌ బౌలర్‌ లసిత్‌ మలింగ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్‌ అన్ని సీజన్లలో కలిసి 150 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు.

స్వదేశంలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముంబై ఇండియన్స్‌ బౌలర్‌ లసిత్‌ మలింగ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్‌ అన్ని సీజన్లలో కలిసి 150 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఐపీఎల్‌ 10లో భాగంగా శనివారం ఢిల్లీ సొంతగడ్డ ఫిరోజ్‌ షా కోట్లా మైదానంలో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో మలింగ ఈ ఘనత సాధించాడు. 
 
ఢిల్లీ ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ వేసిన మలింగ.. ఆ ఓవర్లో ఐదో బంతికి ఢిల్లీ బ్యాట్స్‌‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(3)ను ఔట​ చేయడంతో ఈ ఫీట్‌ మలింగ సాధించాడు. మలింగా బంతిని అయ్యర్‌ షాట్‌ కొట్టగా ముంబై ప్లేయర్‌ హర్బజన్‌ క్యాచ్‌ పట్టడంతో ముంబై క్రికెటర్‌ కళ్లల్లో చెప్పలేనంత సంబరం మొదలైంది. 
 
ఆ తర్వాత కోరే అండర్సన్‌‌ను ఔట్‌ చేసి మరో వికెట్‌ తీశాడు. ఐపీఎల్‌‌లో ఓవరాల్‌‌గా 105 మ్యాచ్‌ లాడిన మలింగ ఉత్తమ ప్రదర్శన 5/13గా ఉంది. వంద వికెట్లకుపైగా తీసిన బౌలర్లలో 18.47 సగటుతో అందరికంటే ముందున్నాడు. ఢిల్లీతో మ్యాచ్‌‌లో కరణ్‌ శర్మ, హర్భజన్‌లు మూడేసి వికెట్లు తీయగా, మలింగ రెండు వికెట్లతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.