Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పంజాబ్‌ జట్టుకు హగ్‌లే హగ్‌లు.. గెలిచిన ప్రతిసారీ కౌగలించుకుంటున్న ప్రీతీ జింటా...

హైదరాబాద్, శుక్రవారం, 12 మే 2017 (02:39 IST)

ఏ జట్టయినా మైదానంలో గెలిచాక హోటల్‌కు వెళ్లి పండగ చేసుకుంటుంది. కానీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు గెలుపు సాధించిన ప్రతిసారీ క్లబ్ వాతావరణం పెవిలియన్ చేరుకున్న వెంటనే ఆటగాళ్లకు కనిపిస్తోంది. కారణం పంజాబ్ గెలిచిన వెంటనే జట్టు యజమాని ప్రీతి జింటా కౌగిలింతలతో ఉక్కిరి బిక్కిరి చేయడమే. అదీ మామూలు కాదు. ఏ ఆదునిక యువతి అయినా తన ప్రియుడికి మాత్రమే ఇచ్చే ప్రగాఢమైన కౌగిలింతను ప్రీతీ జింటా జట్టు కెప్టెన్‌కో ఆరోజు బాగా ఆడిన జట్టు ఆటగాడికో ఉదారంగా పంచిపెడుతోంది.
 
గురువారం ముంబై ఇండియన్స్ జట్టుపై పంజాబ్ జట్టు చెమటోడ్చి మరీ గెలుపు సాధించగానే పెవిలియన్‌లో లేచి నిలబడి ఉగ్గబట్టుకుని చూస్తున్న ప్రీతి జింటా ఒక్కసారిగా విజయ నాదం చేసి పక్కనున్న విదేశీ ఆటగాడిని గట్టిగా కౌగలించేసుకుంది. ఆ తర్వాత అటువైపు ఉన్న జట్టు రిజర్వ్ ఆటగాడిని హగ్ చేసుకుంది. పంజాబ్ జట్టు గెలిచిన ఆనందం ఏమిటో కానీ ప్రీతీ జింటా మాత్రం ఇలా తమ జట్టు గెలిచిన ప్రతిసారీ  జట్టు సభ్యులకు కౌగలింతలు ఇచ్చి ఉత్సాహపర్చడం ఐపీఎల్ 10 సీజన్‌లోని ఇతర జట్లను అసూయలో ముంచెత్తుతోంది. తామెంత బాగా ఆడి గెలిచినా తమను అలా బిగి కౌగిలింతల్లో ముంచెత్తే వారే కరువయ్యారని ఇతర జట్లు తెగ ఫీలవుతున్నాయట. 
 
ఇప్పటికే గురువారం మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ముంబై ఇండియన్స్‌ను మట్టిగరపించిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఇలా ప్రీతీ జింటా కౌగిలింతలతో ఆనంద పరుస్తుంటే ఫైనల్ చేరినా చేరవచ్చు. కప్పు గెలవా గెలవవచ్చు అంటూ నెటిజన్లు మేళమాడుతున్నారు. ప్రీతి జింటా కౌగిలింత జట్టు ప్లేయర్‌లకు అంత కిక్ ఇస్తోందా. ఏమో మరి. ఎవరికి తెలుసు?
 Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

పంజాబ్ గెలుపుతో రసవత్తరంగా ప్లే ఆప్ రేస్.. టెన్షన్‌లో సన్ రైజర్స్

దుర్బేద్యమనుకున్న ముంబై ఇండియన్స్‌ను తొలి ఇన్నింగ్స్‌లో ఉతికి ఆరేసిన కింగ్స్ ఎలెవన్ ...

news

సాహోరే.. బాహుబలి కాదు సాహోరే.. పంజాబ్‌: బంతికీ బ్యాట్‌కి మధ్య పోటీలో బంతి విన్నర్

ప్రీతీ జింటా యాజమాన్యంలోని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు అద్భుతమే సృష్టించింది. పొలార్డ్ ...

news

బంతి కాచుకున్నాడు.. రనౌట్ అయ్యాడు.. షాక్‌లో స్టేడియం

బంతిని కాచుకుని కూడా అదే బంతికి ఔటయితే ఆ బ్యాట్స్‌మన్ పరిస్థితి ఎలా ఉంటుందో ...

news

సచిన్ బయోపిక్ విడుదలకు వేళాయె.. ప్రమోషన్‌లో క్రికెట్ గాడ్ బిజీ బిజీ

క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బయోపిక్ సినిమా మే 26న ప్రపంచ వ్యాప్తంగా ...