గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2017
Written By Raju
Last Updated :హైదరాబాద్ , సోమవారం, 22 మే 2017 (09:06 IST)

భారత్ ప్రజలందరికీ ధన్యవాదాలు.. మీ ప్రేమాభిమానాలు మరువలేను.. స్టీవ్ స్మిత్.. భావోద్వేగ సందేశం

ఐపీఎల్‌-10లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం వేదికగా రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్‌, ముంబయి ఇండియన్స్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతున్న సందర్బంగా. రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్

స్వదేశీ ఆటగాళ్లతో సమానంగా విదేశీ ఆటగాళ్లను కూడా భారత క్రికెట్‌ అభిమానులు ఆదరిస్తున్న తీరుకు విదేశీ క్రికెటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో భారత్‌ జట్టుతో ఉన్న విభేదాలను పక్కనబెట్టి విదేశీ క్రీడాకారులకు సముచిత గౌరవం ఇస్తున్నందుకు ఫిదా అవుతున్నారు. అసాధారణ ప్రేక్షకాదరణకు ముగ్ధులైన డివిలియర్స్‌, క్రిస్‌గేల్‌, డేవిడ్‌ వార్నర్‌తో పాటు పలువురు అంతర్జాతీయ క్రికెటర్లు భారతీయుల అభిమానాన్ని కొనియాడారు. 

ఐపీఎల్‌-10లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం వేదికగా రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్‌, ముంబయి ఇండియన్స్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతున్న సందర్బంగా. రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ ఈ సీజన్ మొత్తంలో భారత్‌‍లో తనకు లభించిన విశేషాదరణను సోషల్‌మీడియా ద్వారా వెల్లడించాడు. మరచిపోలేని జ్ఞాపకాలతో మరొక రోజులో భారత్ నుంచి తిరిగి వెళ్లబోతున్నానంటూ భారతీయుల ప్రేమాభిమానాల పట్ల హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు. 
 
ఐపీఎల్లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న స్టీవ్ స్మిత్..  ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫైనల్‌కు కొద్ది గంటల ముందు భావోద్వేగ సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాదాపు నాలుగు నెలల భారత్ పర్యటనలో ఉన్న తనకు ఇక్కడ ప్రజలు చూపించిన ప్రేమాభిమానులు మరవలేనివిగా పేర్కొన్నాడు. ' నా సుదీర్ఘ జర్నీ నిజంగా అద్భుతంగా ఉంది.  ఇక్కడ చాలా ఎత్తు పల్లాలు చవిచూడటమే కాకుండా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. కొంతమంది ప్రజల్ని కూడా కలిశాను. ఈ క్రమంలోనే కొంతమంది కొత్త ఫ్రెండ్స్ ఏర్పడ్డారు. ఐపీఎల్ ఆడటం అనేది అదొ గొప్ప అనుభవంగా భావిస్తున్నా. ఐపీఎల్ ఫైనల్ తరువాత కేవలం ఇక్కడ ఒక రాత్రి మాత్రమే ఉంటా. భారత్ లో ఉన్న ప్రజలందరికీ ధన్యవాదాలు. మా జట్టుకు మద్దతు తెలిపిన అభిమానులకు సైతం కృతజ్ఞతులు. ఈ పర్యటన ఎప్పటికీ నాకు గొప్ప జ్ఞాపకంగా గుర్తుండి పోతుంది'అని స్టీవ్ స్మిత్ తన ఇన్‌స్టా గ్రాం అకౌంట్ లో పోస్ట్ చేశాడు. 
 
దీంతో పాటు ఈ నాలుగు నెలల పర్యటనలో మధురానుభూతి ఫొటోలను కూడా అభిమానులతో పంచుకున్నాడు. అందులో ధోనీని స్మిత్ ఆలింగనం చేసుకోబోతున్న ఫొటో కూడా ఉండటం విశేషం.
 
ఆదివారం రాత్రి ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో రైజింగ్ పుణె-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటికే రెండు సార్లు టైటిల్ సాధించిన ముంబై ఇండియన్స్ తో తొలిసారి పుణె ఫైనల్లో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచినా కొత్త చరిత్రను లిఖిస్తారు. మరి టైటిల్ పోరులో విజేత ఎవరో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది.

తొలి ఇన్నింగ్స్‌లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ అద్భుత ఫీల్డింగుతో ముంబైని కట్టడి చేసింది. కృణాల్ పాండ్యే మెరుపు బ్యాటింగ్‌తో ముంబై ఇండియన్స్ జట్టు కాస్త నిలదొక్కుకుని 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులు చేసి పుణే సూపర్ జెయింట్‌కి 130 పరుగుల లక్ష్యాన్ని విధించింది. పుణే ఫీల్డింగ్‌లో అద్భుతాన్ని సృష్టించింది మ్యాచ్‌పై పట్టు సాధించింది.