శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2018
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (11:10 IST)

పీకలు తెగ్గోస్తుంటే పాక్‌తో శాంతి చర్చలా? : గౌతం గంభీర్

భారత క్రికెటర్ గౌతం గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో పాకిస్థాన్ వారు భారత సైనికులను చంపుతూ ఉంటే, శాంతి చర్చలు చేయాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదని తేల్చి చెప్పారు.

భారత క్రికెటర్ గౌతం గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో పాకిస్థాన్ వారు భారత సైనికులను చంపుతూ ఉంటే, శాంతి చర్చలు చేయాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదని తేల్చి చెప్పారు. అంతేకాకుండా, పాకిస్థానీయులను భారత్‌లో కాలు పెట్టకుండా నిషేధం విధించాలని టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ డిమాండ్ చేశారు.
 
ఇదే అంశంపై ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ స్పందిస్తూ, క్రికెట్‌తో పాటు సినిమాలు, సంగీతం తదితర అన్ని రంగాల్లోనూ పాక్, భారత్‌ల మధ్య సంబంధాలు వద్దని హితవు పలికారు. పరిస్థితులు కొలిక్కి వచ్చి, పాక్‌కు బుద్ధి వచ్చేంత వరకూ వారిని ఇండియాలోకి రానీయకపోవడమే మంచిదన్నదే తన అభిప్రాయమన్నారు. 
 
గత యేడాది సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందిన సైనికుల పిల్లల విద్యకు అవసరమయ్యే ఖర్చును సాయంగా అందించిన గంభీర్, గత రాత్రి వారితో కలసి డిన్నర్ చేశాడు. పాక్ రేంజర్లను సైన్యం చంపడంలో తప్పులేదని అభిప్రాయపడ్డ గంభీర్, సహనానికి కూడా హద్దు ఉంటుందని, శాంతి చర్చలని ఓ వైపు చెబుతూ, మరోవైపు సరిహద్దుల్లో దాష్టీకానికి దిగుతున్న పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం నేర్పాలని కోరారు.