మంగళవారం, 26 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2018
Written By pnr
Last Updated : గురువారం, 3 మే 2018 (10:06 IST)

ఐపీఎల్ 2018 : రాజస్థాన్‌పై ఢిల్లీ ఉత్కంఠ విజయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 టోర్నీలో భాగంగా, రాజస్థాన్ జట్టుపై ఢిల్లీ ఉత్కంఠ విజయం సాధించింది. ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలంటే ఖచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో రాణించి అద్భుతమైన విజయాన్ని స

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 టోర్నీలో భాగంగా, రాజస్థాన్ జట్టుపై ఢిల్లీ ఉత్కంఠ విజయం సాధించింది. ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలంటే ఖచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో రాణించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. బుధవారం వర్షం రెండుసార్లు అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో నాలుగు పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ను ఓడించింది.
 
వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ 17.1 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్‌ (29 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 69), శ్రేయాస్‌ అయ్యర్‌ (35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 50), పృథ్వీ షా (25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 47) మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నారు. 
 
అయితే, ఢిల్లీ ఇన్నింగ్స్‌ మరో 5 బంతుల్లో ముగుస్తుందనగా వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. దాంతో, ఢిల్లీ ఇన్నింగ్స్‌ ముగిసినట్టు ప్రకటించిన అంపైర్లు డక్‌వర్త్‌ పద్ధతి ప్రకారం రాజస్థాన్‌ లక్ష్యాన్ని 12 ఓవర్లలో 151 పరుగులుగా లెక్కగట్టారు. అనంతరం ఛేదనలో జోస్‌ బట్లర్‌ (26 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 67), డిఆర్సీ షార్ట్‌ (25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 44) భారీ షాట్లతో చెలరేగినా.. రాజస్థాన్‌ 12 ఓవర్లలో ఐదు వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. కీలకమైన రెండు వికెట్లు తీయడంతో పాటు ఆఖరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన ట్రెంట్‌ బౌల్ట్‌ ఢిల్లీని గెలిపించాడు. రిషభ్‌ పంత్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది.