సోమవారం, 30 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2018
Written By pnr
Last Updated : శనివారం, 26 మే 2018 (14:31 IST)

ఆ రనౌట్ మా కొంపముంచింది.. దినేష్ కార్తీక్

ఐపీఎల్ 2018 టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి కోల్‌కతాలో జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఓడిపోయింది.

ఐపీఎల్ 2018 టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి కోల్‌కతాలో జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఓడిపోయింది.
 
దీనిపై ఆ జట్టు కెప్టెన్ దినేష్ కార్తీక్ స్పందిస్తూ, హైదరాబాద్ జట్టు చేతిలో ఎదురైన ఓటమి జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందన్నాడు. సీజన్‌ చివరివరకు ఆకట్టుకున్నప్పటికీ కీలక మ్యాచ్‌‌లో పరాజయం చెందడం తీవ్ర నిరాశను మిగిల్చిందన్నాడు. సన్‌‌రైజర్స్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మంచి ఆరంభం లభించినప్పటికీ, కొన్ని చెత్త షాట్లతో పాటు ఒక రనౌట్‌ మా కొంప ముంచిందనీ, ముఖ్యంగా రనౌట్ వల్లే ఓడిపోయినట్టు తెలిపాడు. 
 
174 పరుగులను ఛేదించే క్రమంలో తమకు గొప్ప ఆరంభం లభించిందని.. దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయామన్నాడు. తనతోపాటు నితీష్‌ రాణా, రాబిన్‌ ఉతప్పలు మ్యాచ్‌‌ను ముగిస్తే బాగుండేదన్నాడు. దీంతో ఓటమి చూడాల్సి వచ‍్చిందని.. సన్‌ రైజర్స్‌ మాకంటే మెరుగ్గా రాణించి గెలుపును సొంతం చేసుకుందని చెప్పుకొచ్చాడు.