శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2018
Written By pnr
Last Updated : శనివారం, 14 ఏప్రియల్ 2018 (11:54 IST)

ఐపీఎల్ 2018 : ఎట్టకేలకు రాయల్ చాలెంజర్స్ బోణీ

ఐపీఎల్ క్రికెట్ లీగ్ పోటీల్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. శుక్రవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 4 వికెట్ల తేడాతో కింగ్స్ లెవన్ పంజాబ్‌పై విజయం సా

ఐపీఎల్ క్రికెట్ లీగ్ పోటీల్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. శుక్రవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 4 వికెట్ల తేడాతో కింగ్స్ లెవన్ పంజాబ్‌పై విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని కోహ్లీ కెప్టెన్సీలోని బెంగళూరు 19.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసి గెలుపును తన ఖాతాలో వేసుకుంది.
 
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు ప్రత్యర్థి కింగ్స్ లెవెన్ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. సొంతగడ్డ చిన్నస్వామి స్టేడియంపై పూర్తి అవగాహన ఉన్న బెంగళూరు.. లక్ష్యఛేదన వైపే మొగ్గుచూపింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 20 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత 156 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ జట్టులో హార్డ్ హిట్టర్ ఏబీ డివిలీయర్స్(40 బంతుల్లో 57, 2ఫోర్లు, 4సిక్స్‌లు), డీకాక్(45) జట్టు విజయంలో కీలకమయ్యారు. 33 పరుగులకే మెకల్లమ్(0), కోహ్లీ(21)వికెట్లను చేజార్చుకున్న బెంగళూరు ఇన్నింగ్స్‌ను వీరిద్దరు గాడిలో పడేశారు. పంజాబ్ పసలేని పేస్‌బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొంటూ మూడో వికెట్‌కు 54 పరుగులు జోడించడంతో పాటు మిగిలిన బ్యాట్స్‌మెన్స్ సహకారం అందించడంత బెంగుళూరు జట్టు గెలుపొందింది.