సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2019
Written By
Last Updated : మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (10:24 IST)

ఉప్పల్‌లో క్రికెట్ పండుగ : హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్

ఐపీఎల్ 2019 11వ సీజన్‌లో భాగంగా ఫైనల్ పోటీలు హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగనుంది. ముందుగా ప్రకటించిన ఐపీఎల్ షెడ్యూల్‌ ప్రకారం మే 12వ తేదీన చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను హైదరాబాద్‌లోని ఉప్పల్‌ మైదానానికి తరలించారు. దీనికి కారణం... చిదంబరం స్టేడియంలో హైకోర్టు ఆదేశాల మేరకు మూసివున్న మూడు స్టాండ్స్‌ను తెరిపించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకురావడంలో తమిళనాడు క్రికెట్‌ సంఘం (టీఎన్‌సీఏ) విఫలమైంది. దీంతో బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 
 
అయితే క్వాలిఫయర్‌ -1 మాత్రం చెన్నైలోనే జరుగుతుంది. దీంతో సీఎస్‌కే టాప్‌-2లో నిలిస్తే తమ సొంత మైదానంలోనే ఈ మ్యాచ్‌ ఆడవచ్చు. ఇక మే 8వ తేదీన జరిగే ఎలిమినేటర్‌, 10వ తేదీన జరిగే క్వాలిఫయర్‌ మ్యాచ్‌లను విశాఖపట్నానికి తరలించారు. నిజానికి ఈ రెండు కూడా హైదరాబాద్‌లోనే జరగాల్సి ఉంది. కానీ 6, 8, 10వ తేదీల్లో తెలంగాణలో పరిషత్‌ ఎన్నికలు ఉండటంతో మ్యాచ్‌లకు పోలీసు సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.