టోపీని ఇలానా పెట్టుకునేది.. బ్రావోకు క్లాస్ పీకిన జీవా ధోనీ

Last Updated: సోమవారం, 15 ఏప్రియల్ 2019 (11:38 IST)
ఐపీఎల్ లీగ్ 29వ మ్యాచ్ ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కేకేఆర్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. 


ఈ జట్టులో సునీల్ నరేన్ రెండు పరుగులకే అవుట్ అయ్యాడు. తదనంతరం జోడీ కట్టిన నితీష్ రానా, క్రిస్ లిన్‌లు నిలకడగా ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కతా జట్టు 8 వికెట్ల పతనానికి 161 పరుగులు సాధించింది. ఇందులో క్రిస్ 82 పరుగులు సాధించాడు. 
 
దీంతో 162 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగింది. చెన్నై బ్యాట్స్‌మెన్లలో నరైన్ (24), జడేజా (31), రైనా (58)లు రాణించడంతో 19.4 ఓవర్లలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

ఈ మ్యాచ్ అనంతరం జీవా ధోనీతో బ్రావో ఆడుకునే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో బ్రావో టోపీని తిప్పి పెట్టుకున్నాడు. అందుకు జీవా టోపీని ఇలానా పెట్టుకునేది అని అడిగేలా వుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.దీనిపై మరింత చదవండి :