మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2019
Written By
Last Updated : మంగళవారం, 7 మే 2019 (18:21 IST)

ఐఐటీ సెమిస్టర్ ప్రశ్నాపత్రంలో ధోనీ గురించి ప్రశ్న.. వైరల్

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ధోనీ గురించి ఐఐటీ మద్రాస్ ప్రశ్నాపత్రంలో అడిగిన ప్రశ్న ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. టీమిండియా మాజీ సారథి అయిన ధోనీ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

ధోనీ సారథ్యంలోని చెన్నై జట్టు ఐపీఎల్‌లో విజయపరంపర కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ధోనీకున్న క్రేజ్‌‍తో ఆయన ఏం చేసినా.. సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది. 
 
ఈ నేపథ్యంలో ఐపీఎల్ టీ-20 12వ సీజన్‌లో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. ప్లే ఆఫ్ దశకు చెన్నై కింగ్స్ జట్టు చేరింది. తద్వారా ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ల్లో వరుసగా ప్లే-ఆఫ్ దశకు చేరుకున్న జట్టుగా చెన్నై రికార్డు సృష్టించింది. 
 
రెండేళ్ల నిషేధం తర్వాత ఐపీఎల్ 12వ సీజన్‌లో బరిలోకి దిగిన చెన్నై 18 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఐఐటీ మద్రాస్ కళాశాల సెమిస్టర్ ప్రశ్నాపత్రంలో ప్లేఆఫ్ దశలో చెన్నై ఆడనున్న మ్యాచ్‌పై ఓ ప్రశ్న వుంది. దీనికి సంబంధించిన ఫోటోను ఐసీసీ తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఈ ప్రశ్న నెట్టింట వైరల్ అవుతోంది.