గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 అక్టోబరు 2020 (17:29 IST)

ఐపీఎల్ 2020 : ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ కేకేఆర్... బ్యాటింగుకు దిగిన హైదరాబాద్

యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 13వ సీజన్ పోటీల్లో భాగంగా, ఆదివారం రెండు మ్యాచ్‌లు జరుగుతున్నాయి. వీటిలో తొలుత హైదరాబాద్ సన్‌రైజర్స్, కోల్‌కతా నైట్ రైడరోస్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి.
 
అయితే, కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ జట్లు మధ్య అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియం వేదికైంది. ఈ పోరులో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కోల్‌కతా జట్టులో న్యూజిలాండ్ స్పీడ్ స్టర్ లాకీ ఫెర్గుసన్ ఎంట్రీ ఇచ్చాడు. 
 
చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌ను కూడా తుదిజట్టులోకి తీసుకున్నారు. క్రిస్ గ్రీన్, ప్రసిద్ధ్ కృష్ణలకు ఉద్వాసన పలికారు. సన్ రైజర్స్ జట్టులో కూడా మార్పులు చేశారు. ఖలీల్ అహ్మద్ స్థానంలో ఆల్ రౌండర్ బాసిల్ థంపీని జట్టులోకి తీసుకున్నారు. షాబాజ్ నదీమ్ స్థానంలో అబ్దుల్ సమద్ జట్టులోకి వచ్చాడు.
 
అయితే, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేస్తున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. టి నటరాజన్‌ వేసిన ఆరో ఓవర్‌ ఆఖరి బంతికి ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠి బౌల్డ్‌ అయ్యాడు. పవర్‌ప్లే ఆఖరికి 48/1తో పటిష్టస్థితిలో నిలిచింది.
 
మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. బసిల్‌ థంపీ వేసిన ఐదో ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాది 14 రాబట్టి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆరంభంలో సన్‌రైజర్స్‌ బౌలర్లను ఓపెనింగ్‌ జోడీ ధాటిగాఎదుర్కొంది. 12 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది.