శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (16:23 IST)

ధోనీ భాయ్‌తో కలిసి ఆడటం సంతోషంగా వుంది... పీయూష్ చావ్లా

Chawla
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఏడాది యూఏఈలో జరుగనున్న ఐపీఎల్‌ ప్రారంభ మ్యాచ్‌లో సీఎస్‌కే ముంబై ఇండియన్స్‌తో తలపడనున్న విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ మూడుసార్లు ఛాంపియన్స్‌గా నిలువగా.. ముంబై ఇండియన్స్ నాలుగుసార్లు టైటిల్‌ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో దుబాయ్‌కి ఆటగాళ్లంతా చేరుకునే పనిలో వున్నారు. 
 
ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇప్పటికే కరోనాతో ఇబ్బందులు తప్పట్లేదు. ఈ నేపథ్యంలో పియూష్ చావ్లా ప్రస్తుతం చెన్నైతో కలిశాడు. ఐపీఎల్ 2020 వేలంలో పియూష్ చావ్లాను చెన్నై సూపర్ కింగ్స్ రూ.6.75 కోట్లకు కొనుగోలు చేసింది. చావ్లా చివరిసారి 2012లో టీమిండియా తరపున ఆడాడు. ఆ తరువాత కేవలం దేశవాళి, ఐపీఎల్‌ టోర్నీలు మాత్రమే ఆడుతున్నాడు. 
 
ఈ నేపథ్యంలో సీఎస్కే తరపున తాను ఆడటంపై చావ్లా హర్షం వ్యక్తం చేశాడు. ధోని సీఎస్‌కేలోకి తీసుకోవడం గురించి చావ్లా మాట్లాడుతూ ఎనిమిదేళ్ల తరువాత ధోనీ కెప్టెన్సీలో క్రికెట్‌ ఆడటం సంతోషంగా ఉందన్నాడు. అత్యుత్తమ కెప్టెన్‌తో కలిసి ఆడటం కన్నా ఇంకేం కావాలి..? అని చావ్లా చెప్పుకొచ్చాడు. 
 
మొదట కోల్‌కతా జట్టులో ఆడిన చావ్లాను జట్టులో బలమైన స్పిన్‌ లైనప్‌ ఉన్నప్పటికీ ధోని ఎంపిక చేసుకున్నాడు. చాలాకాలం తరువాత ధోని భాయ్‌తో కలిసి ఆడటం సంతోషంగా ఉందన్నాడు. అతడు బౌలర్లకు స్వేచ్ఛనిస్తాడు. ఇంకా ప్రోత్సహిస్తాడని కితాబిచ్చాడు.