మంగళవారం, 7 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2021
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 సెప్టెంబరు 2021 (20:51 IST)

ఐపీఎల్‌ 2021.. ఢీల్లి క్యాపిటల్స్‌తో సన్ రైజర్స్ ఢీ..

ఐపీఎల్‌ 2021లో ఢీల్లి క్యాపిటల్స్‌తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతుంది. దుబాయి వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఇందులో టాస్ నెగ్గిన సన్ రైజర్స్ హైదరాబాద్.. మొదట బాటింగ్ చేయడానికి మొగ్గు చూపింది. 
 
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌ను సన్‌రైజర్స్‌ ఫేలవంగా ఆరంభించింది. తొలి ఓవర్‌ మూడో బంతికే ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. నోర్ట్జే బౌలింగ్‌లో అక్షర్‌ పటేల్‌కు సింపుల్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే ఎస్‌ఆర్‌హెచ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ వికెట్‌ నష్టానికి 6 పరుగులు చేసింది.
 
జట్టు వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహా (w), కేన్ విలియమ్సన్ (c), మనీష్ పాండే, జాసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, కేదార్ జాదవ్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్
 
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (w/c), మార్కస్ స్టోయినిస్, షిమ్రాన్ హెట్మీర్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, అన్రిచ్ నార్ట్జే, అవేష్ ఖాన్