సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2021
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (11:31 IST)

నేటి నుంచి ఐపీఎల్-14 సీజన్ రెండో దశ పోటీలు ప్రారంభం

కరోనా వైరస్ కారణంగా అర్థాంతరంగా నిలిపివేసిన ఐపీఎల్ 14వ సీజన్ పోటీలు ఆదివారం నుంచి పునఃప్రారంభంకానున్నాయి. యూఏఈ వేదికగా ఐపీఎల్ 2021 సీజన్ రెండో దశ మ్యాచ్‌లు ఆదివారం నుంచే ప్రారంభంకానున్నాయి. 
 
దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి 7:30 గంటలకు ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఐపీఎల్ 2021 సీజన్ మొదటి దశలో 29 మ్యాచ్‌లే జరగగా.. రెండో దశలో మిగిలిన 31 మ్యాచ్‌ల్ని అక్టోబరు 15 వరకూ నిర్వహించనున్నారు.
 
కాగా ముంబై, చెన్నై జట్ల మధ్య ఇప్పటివరకు 32 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 19 మ్యాచ్‌ల్లో ముంబై గెలుపొందగా మిగిలిన 13 మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 
 
మొత్తంగా ముంబై టీమ్ ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలవగా.. చెన్నై జట్టు మూడు సార్లు టైటిల్ గెలిచింది. దుబాయ్ పిచ్ తొలుత పేసర్లకు అనుకూలించి.. ఆ తర్వాత స్పిన్నర్లికి సహకరించే అవకాశం ఉంది. దాంతో.. టాస్ గెలిచిన టీమ్ ఛేదనకే మొగ్గు చూపే సూచనలు కనిపిస్తున్నాయి.