గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2021
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 మే 2021 (16:31 IST)

IPL 2021 UAE schedule: సెప్టెంబర్ 19 నుంచి మొదలు..

IPL_2021
ఐపీఎల్ 2021 సీజన్‌ పునః ప్రారంభానికి మార్గం సుగుమమైంది. ఐపీఎల్ జట్లలో కరోనా కేసులు నమోదవడంతో ఈ నెల 4న టోర్నీని నిరవధికంగా వాయిదా వేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. తర్జనభర్జనల నడుమ మళ్లీ ప్రారంభించనుంది. షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ 2021 సీజన్‌లో 60 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. టోర్నీ వాయిదాపడే సమయానికి 29 మ్యాచ్‌లే ముగిశాయి. దాంతో.. మిగిలిన 31 మ్యాచ్‌లను సెప్టెంబరు 18-19 నుంచి అక్టోబరు 9-10లోపు యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
 
జూన్ 2న ఇంగ్లాండ్‌ గడ్డపైకి వెళ్లనున్న కోహ్లీ కెప్టెన్సీలోని భారత టెస్టు జట్టు.. అక్కడ సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జూన్ 18 నుంచి 23 వరకూ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌‌లో తలపడి.. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకూ ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌‌లో ఢీకొట్టబోతోంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే స్పెషల్ ఛార్టర్ ప్లైట్‌లో యూఏఈకి భారత క్రికెటర్లు రానున్నారు.
 
ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన 31 మ్యాచ్‌ల్లో.. 20 మ్యాచ్‌లను 10 రోజుల్లోనే నిర్వహించేలా బీసీసీఐ షెడ్యూల్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి 60 మ్యాచ్‌లకిగానూ 10 డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉండేలా బీసీసీఐ తొలుత షెడ్యూల్ ప్రకటించింది. కానీ.. తాజాగా 31 మ్యాచ్‌ల్లోనే 10 డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉండబోతున్నాయి. ఇక మిగిలిన ఏడు లీగ్ దశ మ్యాచ్‌లను వరుసగా నిర్వహించనుండగా.. ఆ తర్వాత క్వాలిఫయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫయర్-2, ఫైనల్ మ్యాచ్‌‌ని రోజు గ్యాప్‌తో నిర్వహించనున్నారు.  
 
ఐపీఎల్ 2021 సీజన్‌ పునః ప్రారంభానికి సంబంధిన షెడ్యూల్ వివరాలు 
19 సెప్టెంబర్- కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ-అబుదాబి 
20 సెప్టెంబర్ - ఎస్సార్‌హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ - దుబాయ్
21 సెప్టెంబర్ - ఆర్ఆర్ వర్సెస్ సీఎస్కే - షార్జా 
22 సెప్టెంబర్ - ఆర్సీబీ వర్సెస్ పీబీకెస్ - అబుదాబి 
23 సెప్టెంబర్ - కేకేఆర్ వర్సెస్ డీసీ - దుబాయ్
23 సెప్టెంబర్ - ఆర్ఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్ - షార్జా 
 
24 సెప్టెంబర్ - సీఎస్కే వర్సెస్ పీబీకేఎస్ -దుబాయ్
24 సెప్టెంబర్ -ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ -అబుదాబి 
25 సెప్టెంబర్ - ముంబై వర్సెస్ కేకేఆర్ - షార్జా
25 సెప్టెంబర్ - డీసీ వర్సెస్ ఆర్ఆర్ - దుబాయ్ 
 
28 సెప్టెంబర్ - కేకేఆర్ వర్సెస్ పీబీకేఎస్ - అబుదాబి 
28 సెప్టెంబర్ - ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ - షార్జా 
29 సెప్టెంబర్ - సీఎస్కే వర్సెస్ ముంబై - దుబాయ్ 
29 సెప్టెంబర్ - డీసీ వర్సెస్ ఎస్సార్‌హెచ్ -  అబుదాబి
 
30 సెప్టెంబర్ - కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ - షార్జా 
30 సెప్టెంబర్ - ఎస్సార్‌హెచ్ వర్సెస్ పీబీకేఎస్ - అబుదాబి
01- అక్టోబర్ - ఆర్సీబీ వర్సెస్ ముంబై - దుబాయ్ 
01- అక్టోబర్ - కేకేఆర్ వర్సెస్ ఎస్సార్‌హెచ్ - షార్జా 
 
02- అక్టోబర్ - డీసీ వర్సెస్ సీఎస్కే - దుబాయ్ 
02- అక్టోబర్ - పీబీకేఎస్ వర్సెస్ ఆర్ఆర్ - షార్జా 
03- అక్టోబర్ - ముంబై వర్సెస్ డీసీ - దుబాయ్.