ఐపిఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డ్..
ఐపిఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త బౌలింగ్ యావరేజ్ కలిగిన ఆటగాడిగా డానియల్ చెత్త రికార్డు సృష్టించారు. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ ద్వారా ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ సీజన్లో కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కానీ ఒక్క వికెట్ కూడా తన ఖాతాలో వేసుకోలేదు.
ఇక భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్‌లో ఆడిన డానియల్ యూఏఈలో జరిగిన మిగతా సీజన్‌కి మాత్రం దూరమయ్యాడు. ఇక ఈ ఏడాది ముంబై ఇండియన్స్‌లోకి వచ్చాడు.
ఇప్పటికే ముంబై తరపున రెండు మ్యాచ్‌ల్లో ఆడిన డానియల్ 11.13 ఎకనామి రేటుతో 89 పరుగులకు ఇచ్చి ఒక వికెట్‌గా తీయలేకపోయాడు. మొత్తంగా మూడేళ్ల నుంచి ఏడు మ్యాచుల్లో 26 ఓవర్లు వేసి 242 బౌలింగ్ యావరేజ్‌తో కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసిన అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు ఈ ఆల్ రౌండర్.
కానీ ఆల్ రౌండర్‌గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న డానియల్ సామ్స్ బిగ్ బాష్ లీగ్ లో భాగంగా అరవై రెండు మ్యాచుల్లో 82 వికెట్లు తీసి తనకు తిరుగు లేదు అని నిరూపించాడు. బ్యాటింగ్‌లో కూడా 622 పరుగులు చేసి ఔరా అనిపించాడు.
ఇక అతని వ్యక్తిగత అత్యధిక స్కోరు 98 నాట్ ఔట్ కావడం గమనార్హం. ఎంత మంచి రికార్డు కలిగిన ఈ స్టార్ ప్లేయర్ ఐపీఎల్‌లో మాత్రం పూర్తిగా విఫలం కావడం గమనార్హం.