ఐపీఎల్ 2023: గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా దూరం
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరమయ్యే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్‌తో పాటు జూన్‌లో జరుగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు కూడా బుమ్రా అందుబాటులో ఉండకపోవచ్చునని వార్తలు వస్తున్నాయి.
అతడు మైదానంలో దిగడానికి మరో ఏడెనిమిది నెలలు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. అక్టోబర్‌లో ప్రారంభం కానున్న వన్డే వరల్డ్ కప్‌లో బుమ్రా బరిలో దిగే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది.
అక్టోబర్‌లో ప్రారంభం కానున్న వన్డే వరల్డ్ కప్‌లో బుమ్రా బరిలో దిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
వెన్ను గాయంతో గత ఏడాది సెప్టెంబర్ తర్వాత టీమిండియాకు దూరమయ్యాడు. గాయం తీవ్రత తగ్గడానికి అనుకున్నదానికంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం