ఆదివారం, 13 ఏప్రియల్ 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 ఏప్రియల్ 2025 (22:01 IST)

ఐపీఎల్ చరిత్రలో వెయ్యి బౌండరీలు- కోహ్లీ అదుర్స్.. ఫిల్ సాల్ట్ సూపర్ ఇన్నింగ్స్ -అవుట్ (వీడియో)

Kohli runs Salt out
Kohli runs Salt out
ఐపీఎల్ చరిత్రలో వెయ్యి బౌండరీలు సాధించిన తొలి ఆటగాడిగా కింగ్ కోహ్లీ నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రెండు బౌండరీలు సాధించి ఈ రికార్డును సాధించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ మూడో బంతికి విరాట్ కోహ్లీ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సిక్స్ బాది ఐపీఎల్‌లో 1000 బౌండరీలను పూర్తి చేశాడు. 
 
ఐపీఎల్‌లో అత్యధిక ఫోర్లు బాదిన రికార్డు కోహ్లీ పేరిట ఉంది. విరాట్ కోహ్లీ ప్రస్తుతం సిక్సర్ల పరంగా మూడో స్థానంలో ఉన్నాడు. ఇక ఐపీఎల్‌లో 8వేల పైచిలుకు పరుగులు చేసిన విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్లలో ఒకడిగా నిలిచాడు. ఐపీఎల్ 2025 24వ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ గెలిచి ఆర్సీబీని ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఆర్సీబీ తన ఇన్నింగ్స్‌ను అద్భుతంగా ప్రారంభించింది. 
 
ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ ఫోర్లు, సిక్సర్లతో వేగంగా పరుగులు సాధించడం ప్రారంభించారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన కెప్టెన్ అక్షర్ పటేల్ ఓవర్లో ఇద్దరు బ్యాటర్లు 16 పరుగులు చేశారు. ఈ ఓవర్ తొలి బంతికి ఫిల్ సాల్ట్ లాంగ్ ఆన్‌లో భారీ సిక్స్ కొట్టాడు. తర్వాతి బంతికి ఫోర్, ఆ ఓవర్ మూడో బంతికి సాల్ట్ మరో ఫోర్ కొట్టాడు. స్టార్క్ వేసిన మొదటి మూడు బంతుల్లో మూడు బౌండరీలు బాదాడు.
 
ఈ ఓవర్లోని నాలుగో బంతికి స్టార్క్ నోబాల్ వేశాడు. ఫిల్ సాల్ట్ ఈ బంతిని కూడా మిస్ కాలేదు. ఫిల్ సాల్ట్ స్టార్క్ బౌలింగ్‌లో మరో ఫోర్ కొట్టాడు. ఆ తర్వాతి బంతికి సాల్ట్ ఫ్రీ హిట్ కొట్టాడు. సాల్ట్ కళ్లు మూసుకుని బ్యాట్‌తో మెరిశాడు. ఆ బంతి బ్యాట్ అంచుకు తగిలి నేరుగా కీపర్ తలమీదుగా వెళ్లి బౌండరీ దాటింది. తర్వాతి బంతికి సాల్ట్ లెగ్ బై ఆఫ్ లో సింగిలి తీసుకున్నాడు. ఆ తర్వాతి బంతికే విరాట్ కోహ్లీ లెగ్ బై ఆఫ్‌లో ఫోర్ కొట్టాడు. ఈ విధంగా స్టార్క్ వేసిన ఈ ఓవర్‌లో మొత్తం 30 పరుగులు వచ్చాయి.

చివర్లో టిమ్ డేవిడ్ 20 బంతుల్లో 37 పరుగులు చేశాడు. టిమ్ డేవిడ్ 2 ఫోర్లు, 4 సిక్సులతో మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీకి ఓ గౌరవప్రదమైన స్కోరును సాధించగలిగింది. దీంతో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది.