Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కోహ్లీని ఏమార్చిన యాంకర్ జీన్స్.. ఆన్‌లైన్‌లో సెటైర్ల మీద సెటైర్లు

హైదరాబాద్, శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (03:25 IST)

Widgets Magazine

కెరీర్‌లో ఎలాంటి తప్పూ చేయని టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ తొలిసారి మీడియా కన్నుకు దొరికిపోయాడా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. ఐపీఎల్ ప్రాక్టీసులో నిమగ్నమైన కోహ్లీ తనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన మహిళా యాంకర్‌ ధరించిన చింపిరి జీన్స్ కేసి ఆలానే చూస్తూండిపోయిన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొందరు ఫ్యాషన్ పట్ల కోహ్లీ మక్కువగా ఆ ఘటనకు మద్దతు తెలుపుతుంటే, మరికొందరు రెండడుగులు ముందుకు వేసి ఇకపై కోహ్లీని ఎవరైనా ఇంటర్వ్యూ చేయాలంటే అతడి ప్రేయసి శర్మ పర్మిషన్ తీసుకోవలసిందే అంటూ మేలమాడారు. ఈ విషయమై కోహ్లీ నుంచి వివరణ లేదు కానీ లేడీ యాంకర్ జీన్స్ కేసి తదేకంగా అతడు చూస్తున్న చూపు మాత్రం కెమెరా కంటికి అడ్డంగా దొరికిపోయి హల్ చల్ సృష్టిస్తోంది.
 
వివరాల్లోకి వస్తే.. ఐపీఎల్ హోరాహోరీగా సాగుతున్న నేపథ్యంలో అర్చన విజయ అనే టీవీ వ్యాఖ్యాత కోహ్లీని ఇంటర్వ్యూ చేయడానికి అతను ప్రాక్టిస్ చేస్తున్నచోటుకు వెళ్లింది. ఆమె కెమెరావైపు చూసి మాట్లాడుతుంటే కోహ్లీ చూపు మాత్రం ఆమె జీన్స్‌పైకి మళ్లాయి. అలా తదేకంగా చూస్తుండిపోయాడు. ఇంతకంటే ఫ్యాషన్‌ ఉండదన్నట్లు ఆ జీన్స్ చూశారుగా ఎలా ఉందో! వైరల్‌గా మారిన ఈ ఫొటోపై నెటిజన్ల స్పందనా అధికంగానే ఉంది. 
 
కోహ్లీ తన వృత్తిలో భాగంగా చాలామందికి ఇంటర్వ్యూలు ఇస్తుంటాడు, ఎప్పుడూ ఇలాంటిది లేదని కొందరు, అతనికి ఫ్యాషన్ మక్కువ కాబట్టి చూసి ఉంటాడని ఇంకొందరు సమర్థించారు. ఇక అతను ఇంటర్వ్యూలు ఇవ్వాలంటే ప్రేయసి అనుష్క శర్మ పర్మిషన్ కావాలని సైటైర్లూ వచ్చాయి. ఎదురుగా కెమెరా ఉన్న ఇంటర్వ్యూ కార్యక్రమంలో కళ్లు దారి మళ్లితే ఎవరికైనా సరే చిక్కులు తప్పవు మరి. టీమిండియా కెప్టెన్ కోహ్లీకి ఇంటర్వ్యూలు కొత్త కాదు. కానీ ఈసారి మాత్రం అతని చూపులెక్కడో చిక్కుకుపోయాయి. అదీ విషయం.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

వరుసగా ఐదో విజయంతో ఎదురులేని ముంబై.. హషీమ్‌ ఆమ్లా మెరుపు సెంచరీ వృథా

ఇండోర్‌ ఐపీఎల్‌ పదో సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ చెలరేగుతోంది. 199 పరుగుల లక్ష్యాన్ని ...

news

2013నాటి బూటు కేసు నుంచి ధోనీకి ఊరట.. కేసును కొట్టేసిన సుప్రీం కోర్టు

2013నాటి బూటు కేసు నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఊరట లభించింది. ధోనీ ...

news

ఓ వైపు ఉక్కపోత.. మరోవైపు ప్రాక్టీస్ : చొక్కాలు విప్పిమరీ బంతిని బాదేస్తున్నారు...

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో అంచె పోటీలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆయా జట్ల ఆటగాళ్లు ...

news

అబ్బా ఎండలు బాబోయ్.. షర్టులిప్పి ప్రాక్టీస్ చేసిన కింగ్స్ క్రికెటర్లు.. ఐపీఎల్‌ నుంచి స్మిత్ అవుట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్లో భాగంగా వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓటమిపాలైన కింగ్స్ ...

Widgets Magazine