Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హైదరాబాదులో బోర్డు తిప్పేసిన 4 ఐటీ కంపెనీలు.. యాహూ ఉద్యోగులకు చేదు వార్త

శుక్రవారం, 9 జూన్ 2017 (10:31 IST)

Widgets Magazine
high tech city hyderabad

హైదరాబాద్‌కే తలమానికమైన ఐటీ కారిడార్‌లో వారం రోజుల వ్యవధిలో మొత్తం నాలుగు స్టార్టప్‌ కంపెనీలు బోర్డులు తిప్పేశాయి. ఫలితంగా 250 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. బిచాణా ఎత్తేసిన కంపెనీలు అన్ని స్టార్టప్‌ కంపెనీ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవి కావడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం స్టార్టప్‌ కంపెనీలకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని గమనించిన కేటుగాళ్లు.. కన్సల్టెన్సీల ద్వారా అనేక మందిని మోసం చేశాయి. 
 
ఇలాంటి కంపెనీల చేతుల్లో మోసపోతున్న వారిలో అత్యధికంగా బీటెక్‌ విద్యార్థులు ఉండటం గమనార్హం. ఒక్కో కంపెనీలో ఉద్యోగం కోసం ఒక్కో టెక్కీ దాదాపు రూ.2 లక్షల వరకూ సమర్పించుకున్నారు. ఇక బాధితులంతా మాదాపూర్, రాయదుర్గం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
మరోవైపు... ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం యాహూలో పనిచేస్తున్న 2 వేల మంది ఉద్యోగుల మెడపై కత్తి వేలాడుతోంది. 4.48 బిలియన్ డాలర్ల‌తో యాహూను సొంతం చేసుకోబోతున్న వేరిజాన్ కమ్యూనికేషన్.. కొనుగోలు పూర్తయ్యాక 2 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. వేరిజాన్‌కు చెందిన ఏఓఎల్, యాహూ నుంచి ఉద్యోగుల తొలగింపు ఉంటుందని తెలుస్తోంది. 
 
రెండు యూనిట్లలో కలిపి 15 శాతం మందిని తొలగించనున్నట్టు సమాచారం. కాలిఫోర్నియాతోపాటు అమెరికా బయట కూడా ఉద్యోగుల కోత ఉంటుందని విశ్వనీయ వర్గాల సమాచారం. గురువారం జరిగిన షేర్ హోల్డర్ల సమావేశంలో కంపెనీ విక్రయానికి షేర్ హోల్డర్లు అంగీకరించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

జియో ఎఫెక్ట్.. బీఎస్ఎన్ఎల్ అప్రమత్తం.. ఫైబర్ కాంబో యూఎల్‌డీ 550 పేరుతో కొత్త ప్లాన్

దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో త్వరలో ఫైబర్ సేవలను ...

news

వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్... మెసేజ్‌ల ఉపసంహరణ 'రీకాల్' ఆప్షన్

సోషల్ మీడియాలో ఒకటైన వాట్సాప్ తన వినియోగదారులకు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ...

news

అమేజాన్‌లో ప్రాడెక్టుల కోసం వెతుకుతున్నారా? కుక్కలు కనిపిస్తాయ్ జాగ్రత్త

అమేజాన్‌లో ప్రాడెక్టుల కోసం వెతుకుతున్నారా? కుక్కలు కనిపిస్తాయ్ జాగ్రత్త. ఇదేంటి ...

news

రిలయన్స్ జియో ‌4జీ వీఓఎల్టీఈ ఫీచర్ ఫోన్ ఆన్‌లైన్‌లో లీక్.. స్పెసిఫికేషన్స్ ఇవే....

దేశీయ టెలికాం రంగంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్న రిలయన్స్ జియో తాజాగా మరో అద్భుతాన్ని ...

Widgets Magazine