యూట్యూబ్‌లో వీడియోలు చూస్తున్నప్పుడు యాడ్‌లతో తలనొప్పిగా వుందా?

mobile massage
మోహన్| Last Updated: బుధవారం, 13 మార్చి 2019 (15:21 IST)
ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్‌కి చెందిన యూట్యూబ్ ఇప్పుడు తన సైట్‌లో యాడ్స్ రాకుండా వీడియోలను చూసే అవకాశాన్ని కల్పిస్తుంది. కాకపోతే దీని కోసం యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ని పొందాలి. ఇలా చేస్తే మాత్రమే మీరు వీడియోలను ప్రకటనలు లేకుండా వీక్షించవచ్చు. ఈ క్రమంలో భారతదేశంలో ఇవాళ్టి నుండి యూట్యూబ్ ప్రీమియం సేవలు ప్రారంభమయ్యాయి. 
 
ఇందుకోసం నెలకు రూ. 129 చెల్లించి యూట్యూబ్‌లో ప్రీమియం ప్లాన్ తీసుకుంటే చాలు. ఇకపై యూట్యూబ్‌లో యూజర్లు చూసేటువంటి ఏ వీడియోలలోనూ యాడ్స్ రావు. అంతేకాదు యూట్యూబ్‌లో యూట్యూబ్ ఒరిజినల్స్ పేరిట అందుబాటులో ఉన్న ఎక్స్‌క్లూజివ్ వీడియోలను కూడా వినియోగదారులు వీక్షించవచ్చు. 
 
ఈ మధ్య శాంసంగ్ నుండి విడుదలైన గెలాక్సీ ఎస్ 10 ఫోన్‌ను కొనుగోలు చేసిన యూజర్లకు 4 నెలల పాటు ఉచితంగా యూట్యూబ్ ప్రీమియం సేవలను ఆఫర్ చేస్తున్నారు. ఆ తర్వాత మాత్రం నెలకు రూ. 129 చెల్లించవలసి ఉంటుంది.దీనిపై మరింత చదవండి :