సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 అక్టోబరు 2020 (11:38 IST)

ఎయిర్‌టెల్ నుంచి గుడ్ న్యూస్.. స్టూడెంట్స్ కోసం ఆకాశ్ ఎడ్యూ టీవీ

భారతీ ఎయిర్‌టెల్ తాజాగా తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎయిర్‌టెల్ డీటీహెచ్ విభాగమైన ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ తాజాగా కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. స్టూడెంట్స్ కోసం తన ప్లాట్‌ఫామ్‌లో ఎడ్యుకేషన్ కంటెంట్‌ను అందుబాటులో ఉంచింది. ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ దీని కోసం ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 
 
ఈ భాగస్వామ్యంలో భాగంగా ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ కొత్త టీవీ ఛానల్‌కు ఆవిష్కరించింది. దీని పేరు ఆకాశ్ ఎడ్యూ టీవీ. మెడికల్, ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ టెస్ట్‌కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఈ ఛానల్ వల్ల బెనిఫిట్ పొందొచ్చు.
 
జేఈఈ/అడ్వాన్స్‌డ్, నెట్ వంటి ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఈ ఛానల్ ఉపయుక్తంగా ఉంటుంది. ఆకాశ్ ఫ్యాకల్టీ విద్యార్థులకు లైవ్ ఇంటరాక్షన్ క్లాసెస్ ద్వారా టీచింగ్ చేయనుంది. అంతేకాకుండా విద్యార్థులు కీలకమైన కాన్సెప్ట్‌లను నేర్చుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఈ ఎయిర్‌టెల్ ఆకాశ్ ఎడ్యూ టీవీ ఛానల్ ద్వారా ప్రయోజనం కలుగనుంది. ఆకాశ్ టీవీ ఛానల్ ద్వారా విద్యార్థులు నాణ్యమైన కోచింగ్ సెషన్స్‌ను చూడొచ్చు.