Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఈ వారంలోనే ఎయిర్‌టెల్ 4జీ చౌక ఫోన్...

ఆదివారం, 1 అక్టోబరు 2017 (15:31 IST)

Widgets Magazine
airtel 4g phone

రిలయన్స్ జియో ప్రవేశపెట్టిన 4జీ ఫీచర్ ఫోన్‌కు పోటీగా ఎయిర్‌టెల్ కూడా ఓ 4జీ ఫోన్‌ను తయారు చేస్తుందన్న విషయం తెలిసిందే. కాగా ఈ ఫోన్ ఈనెలలోనే విడుదలయ్యే అవకాశం ఉందన్నారు.ఇక ఈ ఫోన్ ధర రూ.2500 వరకు ఉండవచ్చని సమాచారం. ఇందులో ఆండ్రాయిడ్ 7.0 నూగట్ ఓఎస్‌ను అందిస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ ఫోన్ గురించిన అధికారిక సమాచారం ఇప్పటి వరకు తెలియలేదు. త్వరలో తెలిసే అవకాశం ఉంది.
 
కాగా, రిలయన్స్‌ జియోకి కౌంటర్‌ ఇవ్వడానికి వాయిస్, డేటా సర్వీసులను కూడా ఇందులో పొందుపరిచినట్టు అంతకుముందు వార్తలు వచ్చాయి. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి అన్నిరకాల యాప్‌లను డౌన్‌ చేసుకునేలా ఈ ఫోన్‌ ఉంటుందట. డ్యుయ‌ల్ సిమ్‌, 4 అంగుళాల డిస్‌ప్లే,1 జీబీ ర్యామ్‌, డబుల్‌ కెమెరాలు, 4జీ వోల్ట్‌ కాలింగ్‌ సదుపాయం, భారీ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉంటాయని అంటున్నారు. 
 
కాగా రిలయన్స్‌ జియో ఇటీవల రూ.1,500 రిఫండబుల్‌ డిపాజిట్‌తో 4జీ ఫీచర్‌ ఫోన్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. తొలి విడతగా బుక్‌ చేసుకున్న 60 లక్షల మంది వినియోగదారులకు ఫోన్‌ డెలివరీ చేయడం మొదలు పెట్టింది. డిపాజిట్‌ తిరిగివ్వడానికి రిలయన్స్‌ జియో పలు షరతులు విధించడంతో కొనుగోలుదారులు ఫోన్‌ తీసుకోవాలా, వద్దా అనే సందిగ్ధంలో పడిపోయారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

రూ.2 వేలకే మైక్రోమ్యాక్స్ 4జీ ఫీచర్ ఫోన్

దేశంలో పుట్టుకొచ్చిన టెలికాం విప్లవం పుణ్యమాని వివిధ రకాల ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ...

news

4జీ హ్యాండ్‌సెంట్లలో ఎయిర్ టెల్‌‍ 5జీ సేవ‌లు

దేశంలోని ప్రైవేట్ టెలికాం దిగ్గజం తన వినియోగదారులకు తీపికబురు చెప్పింది. త్వరలోనే 5జీ ...

news

మొన్న విశాల్‌ సిక్కా.. నేడు నవీన్ : ఇన్ఫోసిస్‌కు మరో సీనియర్‌ గుడ్‌‌బై

దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీగా ఉన్న ఇన్ఫోసిస్‌కు మరో సీనియర్ గుడ్‌బై చెప్పారు. ...

news

ప్రేమ కోసం గ్రీన్ కార్డును తిరిగిచ్చేశా... వింతగా చూశారు.. : సత్య నాదెళ్ల

తనకు వివాహమైన కొత్తల్లో భార్య అనుపమ కోసం గ్రీన్ కార్డును వదిలేసుకుని హెచ్-1బీ వీసాకు ...

Widgets Magazine