ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ : రూ.5555కే 55 అంగుళాల టీవీ

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ పండుగ సీజన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ నిర్వహిస్తోంది. ఇందులోభాగంగా, అనేక రకాలైన ఎలక్ట్రానిక్ వస్తువులను అతి తక్కువ ధరకే విక్రయిస్తోంది. ఇందులోభాగంగా, 55 అంగుళాల లెడ్ టీవీని కేవలం రూ.5555కే విక్రయించనుంది. ఇందుకోసం బుధవారం రాత్రి ఫ్లాష్ సేల్‌ను నిర్వహించనుంది. 
 
ప్రస్తుతం అమెజాన్‌ వెబ్‌సైట్‌లో కొనసాగుతున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ.33,999 ధర ఉన్న షింకో ఎస్55క్యూహెచ్‌డీఆర్10 మోడల్‌కు చెందిన 55 ఇంచుల 4కె ఎల్‌ఈడీ టీవీని కేవలం రూ.5,555 కే కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు. బుధవారం రాత్రి 9 గంటలకు అమెజాన్‌లో షింకో టీవీకిగాను ప్రత్యేక ఫ్లాష్ సేల్ నిర్వహించనున్నారు. అందులో పాల్గొనే వారు కేవలం రూ.5,555 చెల్లించి ఆ టీవీని సొంతం చేసుకోవచ్చు.