మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 10 జులై 2019 (18:06 IST)

ఫేస్‌బుక్‌తో ప్రైవేసీకి పెనుముప్పు.. తప్పుకోండి.. యాపిల్

సోషల్ మీడియాల్లో అగ్రగామి అయిన ఫేస్‌బుక్‌ ప్రైవసీకి భంగం కలిగిస్తుందని యాపిల్ సంస్థాపకుల్లో ఒకరైన స్టీవ్ ఓజ్నైక్ అన్నారు. అందుచేత ఫేస్‌బుక్ నుంచి శాశ్వతంగా దూరంకండంటూ స్టీవ్ ఓజ్నైక్ హితవు పలికారు. ప్రపంచ స్థాయిలో అత్యధిక సంఖ్యలో ఎఫ్‌బీని ఉపయోగించే వారే సంఖ్య భారీగా పెరిగిపోతున్న వేళ.. స్టీవ్ ఫేస్‌బుక్ పట్ల అప్రమత్తంగా వుండాల్సిందిగా వార్నింగ్ ఇచ్చారు. 
 
ఎఫ్‌బీ ద్వారా డేటా భద్రంగా వుంటుందని అందరూ అనుకుంటున్నారు. కానీ యూజర్ల డేటా చోరీ అవుతున్నాయనే ఆరోపణలు వస్తూనే వున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో యాపిల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన స్టీవ్ ఓజ్నైక్ మాట్లాడుతూ.. ఫేస్‌బుక్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. 
 
సోషల్ మీడియా ద్వారా ప్రయోజనాలున్నప్పటికీ... అందుకు సమానంగా మన ప్రైవసీకి భంగం కలిగించేలా వున్నాయని.. ఎందుకు.. మన గుండె చప్పుడును కూడా సెన్సార్ ద్వారా.. ఇతరులు తెలుసుకునే వీలుంటుందని చెప్పారు. 
 
వ్యక్తిగతంగా పంపే సమాచారాన్ని ఫేస్ బుక్ గ్రహించగలదు. మొత్తానికి మనం ఏం చేయాలంటే.. ప్రైవసీకి భంగం కలుగకుండా వుండాలంటే.. ఫేస్‌బుక్‌ నుంచి బయటికి రావడం చేయాలన్నారు. ఇది చాలామందికి కఠినతరమైన విషయమే. కానీ మీ ప్రైవసీకి భంగం కలుగకుండా వుండాలంటే.. ఫేస్ బుక్ నుంచి తప్పుకోవడమే మంచిదని స్టీవ్ చెప్పుకొచ్చారు.