Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఐఫోన్ కొనుగోలుదార్లకు జియో బంపర్ ఆఫర్

ఆదివారం, 12 నవంబరు 2017 (16:26 IST)

Widgets Magazine
reliance jio

దేశీయ టెలికాం సునామీ రిలయన్స్ జియో ఆపిల్ ఐఫోన్లను కొనుగోలు చేసే వారికి బంపర్ ఆఫర్లను ప్రకటించింది. జియో వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఈ ఫోన్లను కొనుగోలు చేసిన వారికి ఈ ఆఫర్లు వర్తించనున్నాయి. గూగుల్ పిక్సల్ 2, పిక్సల్ 2 ఎక్స్‌ఎల్, ఆపిల్ ఐఫోన్ 10, ఐఫోన్ 8, 8 ప్లస్ ఫోన్లను కొనుగోలు చేసే యూజర్లకు వీటిని ఇవ్వనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.
 
ఈ ఆఫర్లలో భాగంగా, పిక్సల్ 2 లేదా పిక్సల్ 2 ఎక్స్‌ఎల్ ఫోన్లను కొంటే రూ.22,999 విలువైన బెనిఫిట్స్‌ను అందివ్వనుంది. తొలుత రూ.9,999 విలువ చేసే యేడాది ప్లాన్‌ను ఉచితంగా అందివ్వనుంది. దీని ప్రకారం యూజర్లకు ఏడాది పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి. దీంతోపాటు ఉచితంగా 750 జీబీ 4జీ డేటా లభిస్తుంది. డేటా మొత్తాన్ని వాడుకుంటే స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. అలాగే, ఈ ఫోన్లను హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.8 వేల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. 
 
ఇకపోతే, ఆపిల్‌కు చెందిన ఐఫోన్ 10, 8, 8 ప్లస్ ఫోన్లను సిటీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.8వేల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. దీంతోపాటు యూజర్లకు 70 శాతం బై బ్యాక్ ఆఫర్ వస్తుంది. అంటే యేడాది పాటు నెలకు రూ.799 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటూ జియో సిమ్‌ను పైన ఆపిల్ ఫోన్లలో వాడితే యేడాది తర్వాత ఆ ఫోన్లను వాటి ధరలో 70 శాతం మొత్తానికి యూజర్లు అమ్ముకోవచ్చు. అయితే ఫోన్లపై ఎలాంటి గీతలు పడరాదు, ఫిజికల్ డ్యామేజ్ ఉండదు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

అందరూ సమానమేనంటున్న ట్విట్టర్.. వెరిఫికేషన్ టిక్ తొలగింపు

సాధారణంగా ట్విట్టర్ ఖాతా పేరు పక్కన నీలం రంగులో చెక్ మార్క్ వుంటే, అది వ్యక్తుల వెరిఫైడ్ ...

news

ఐఫోన్ 7కు ఆర్డర్‌ చేస్తే 'ఘడీ' సబ్బు వచ్చింది... (వీడియో)

ఆన్‌లైన్ మోసాలకు అడ్డే లేకుండా పోయింది. ముఖ్యంగా ఈ-కామర్స్ వెబ్‌సైట్ల సేవలు అందుబాటులోకి ...

news

ఫ్లిప్‌కార్ట్‌ తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే.. ఫీచర్లేంటంటే...

ఇప్పటివరకు కొరియర్ సంస్థగా పనిచేసిన ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ తన తొలి బ్రిలియంట్‌ ...

news

1000 అడుగుల ఎత్తు నుంచి పడేసిన ఆపిల్ ఫోన్‌కు ఏమైంది? (Video)

ఆపిల్ సంస్థకు చెందిన కొత్త మోడల్ ఐఫోన్ ఎక్స్ స్మార్ట్ ఫోన్‌ను వెయ్యి అడుగుల ఎత్తు నుంచి ...

Widgets Magazine