శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 ఆగస్టు 2021 (22:10 IST)

ఫ్రీ ఫైర్, పబ్‌జి గేమ్స్‌ను నిషేధించాలి.. ప్రధానికి న్యాయమూర్తి లేఖ

పిల్లలు ప్రస్తుతం ఆరు బయట ఆడుకోవడం లేదు. ఫోన్లు, కంప్యూటర్ల కాలం వచ్చేసింది. దీంతో ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నారు. ఇది వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇక పబ్‌జి వంటి గేమ్స్ వల్ల పిల్లల్లో, యువతలో హింసా ప్రవృత్తి పెరిగిపోతోంది. అలాంటి గేమ్స్‌ను ఆడడం కోసం వారు ఏం చేసేందుకైనా వెనుకాడడం లేదు. ఈ క్రమంలోనే పబ్‌జి, ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్‌ను నిషేధించాలని కోరుతూ ఓ న్యాయమూర్తి తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాశారు.
 
అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి నరేష్ కుమార్ లాకా తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఫ్రీ ఫైర్‌, పబ్‌జి మొబైల్ (బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా) లాంటి గేమ్‌లను బ్యాన్ చేయాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ గేమ్స్ వల్ల పిల్లలపై నెగెటివ్ ప్రభావం పడుతుందన్నారు. దీంతో వారి ఎదుగుదలపై ఆ గేమ్స్ ప్రభావం చూపిస్తున్నాయని అన్నారు. అందువల్ల గేమ్స్ ను బ్యాన్ చేయాలని కోరారు.
 
చైనాతోపాటు బంగ్లాదేశ్‌, నేపాల్ వంటి దేశాల్లో ఇప్పటికే అలాంటి గేమ్స్ ను బ్యాన్ చేశారని, కొన్ని చోట్ల పిల్లలు ఆ గేమ్స్ ను ఆడకుండా నిబంధనలను రూపొందించారని అన్నారు. అందువల్ల ఆ గేమ్స్‌ను బ్యాన్ చేసి పిల్లల ఆరోగ్యాన్ని రక్షించాలని నరేష్ కుమార్ లేఖలో మోదీని కోరారు.